ETV Bharat / state

Amit Shah Telangana Tour Today : నేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్​ బహిరంగ సభలో ప్రసంగం

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 8:57 AM IST

Updated : Oct 10, 2023, 9:26 AM IST

Amit Shah Telangana Tour Today : నేడు తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో ఇవాళ మధ్యాహ్నం బేగంపేట రానున్న ఆయన.. అక్కడి నుంచి ఆదిలాబాద్ వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ నిర్వహించే జనగర్జన సభలో అమిత్ షా పాల్గొంటారు.

Telangana Assembly Elections 2023
Amit Shah

Amit Shah Telangana Tour Today : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఎలాగైనా అధికారం రావాలని అస్తశస్త్రాలను సిద్ధం చేస్తోంది. గులాబీ తోటలో కమల వికాసమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్​కు దీటుగా సభలు, సమావేశాలతో హోరెత్తించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అగ్రనాయకులు తెలంగాణలో పర్యటించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంది.

ఈ నేపథ్యంలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జనగర్జన పేరుతో ఆదిలాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి 1:45 గంటలకు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అమిత్ షా హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌ బయల్ధేరి వెళ్లనున్నారు.

Kishan Reddy About Telangana Assembly Elections : నేతలంతా ఏకమై తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం: కిషన్​రెడ్డి

BJP Public Meeing in Adilabad : మధ్యాహ్నాం 3:00 గంటల నుంచి 4:00 గంటల వరకు బహిరంగ సభలో అమిత్ షా (Amit Shah) పాల్గొననున్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బహిరంగ సభ అనంతరం బేగంపేట విమానాశ్రయానికి 5:00 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లి సాయంత్రం 6:00 గంటల వరకు విశ్రాంతి తీసుకోనున్నారు. ఐటీసీ కాకతీయ నుంచి సికింద్రాబాద్‌ సిక్‌ విలేజ్‌లోని ఓ మందిరంలో నిర్వహించే మేధావుల సమావేశానికి హాజరవుతారు.

Amit Shah Telangana Tour Schedule : సాయంత్రం 6:20 గంటల నుంచి 7:20 గంటల వరకు మేధావులతో సమావేశం కానున్న అమిత్ షా పలు సలహాలు, సూచనలను స్వీకరించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మేధావుల సమావేశం అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి 7:40 గంటల నుంచి 8:20 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. రాత్రి భోజనం అనంతరం అమిత్ షా బేగంపేట విమానాశ్రయం నుంచి రాత్రి 9:35 గంటలకు తిరిగి దిల్లీ బయల్ధేరి వెళ్లనున్నారు. ఎన్నికల నగారా మోగిన మరుసటి రోజే అమిత్‌ షా తెలంగాణకు రావడం.. రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

BJP Election Plan Telangana 2023 : 60 రోజులు.. 43 బహిరంగ సభలు.. జాతీయ నేతల ప్రసంగాలతో.. బీజేపీ మాస్టర్ ప్లాన్

Telangana Assembly Elections 2023 : మరోవైపు బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రులు వరస కట్టనున్నారు. ఈనెల 14న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పర్యటిస్తారు. 15న కేంద్రమంత్రి సాద్వి నిరంజన్‌జ్యోతి.. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. 16న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హుజూరాబాద్, మహేశ్వరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 19న మధిర నియోజకవర్గం పరిధిలో కేంద్రమంత్రి నారాయణస్వామి పర్యటించనున్నారు.

BJP Leader Muralidhar Rao Fires on BRS : 'తెలంగాణలో కుటుంబపార్టీని.. ఓడించడమే బీజేపీ లక్ష్యం'

JP Nadda on Telangana BJP Rebels : బీజేపీ రెబల్స్​తో జేపీ నడ్డా భేటీ.. తిరుగుబాటుకు చెక్..!

Last Updated :Oct 10, 2023, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.