ETV Bharat / state

Kishan Reddy About Telangana Assembly Elections : నేతలంతా ఏకమై తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం: కిషన్​రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 6:08 PM IST

BJP State Chief Kishan Reddy
BJP State Chief Kishan Reddy About Telangana Assembly Elections

BJP State Chief Kishan Reddy About Telangana Assembly Elections : తెలంగాణ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలంటే కేవలం అది బీజేపీతోనే సాధ్యం అవుతుందని తెలిపారు. డబ్బులు, అధికారం దుర్వినియోగం లేని ఎన్నికలు ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

BJP State Chief Kishan Reddy About Telangana Assembly Elections : తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి జెండా ఎగురవేస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన (Telangana Elections) అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ మార్పు కేవలం బీజేపీతో వస్తుంది అని కిషన్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు బీజేపీ పూర్తి సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా కమిటీలు సమావేశాలు జరిపి ప్రచారానికి సంబంధించిన అంశాలను నిర్ణయిస్తారు. నేతలంతా ఐకమత్యంగా పోరాడి ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామన్నారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబపాలనను తుడిచిపెట్టాలని ప్రధాని (Narendra Modi) చెప్పారన్నారు. రెండు, మూడు స్థానాల కోసం బీఆర్​ఎస్, కాంగ్రెస్ పోటీ పడాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలని ఆదరించవద్దని ప్రజలకు విన్నవించారు. ఉద్యమ ద్రోహులందరు ప్రగతిభవన్​లో చేరిపోయారని ఆరోపించారు.

BJP MLA Candidates List 2023 : అసెంబ్లీ ఎన్నికల బరిలోకి బీజేపీ సిట్టింగ్​ ఎంపీలు.. 38 మందితో తొలి జాబితా సిద్ధం!

Ready To Face Elections says BJP State Chief KishanReddy : ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ఆశీర్వదించారని కోరారు. అధికారాన్ని, డబ్బును ఉపయోగించి కేసీఆర్​ ఎన్నికలకు వెళ్తున్నారని కిషన్​రెడ్డి ఆరోపించారు. సకలజనుల పాలన తెలంగాణలో రావాలన్న ఆయన... బీజేపీతోనే సకలజనుల పాలన సాధ్యం అని తెలిపారు. డబ్బు, అధికార దుర్వినియోగం లేకుండా ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల ప్రకటన తర్వాత మొట్టమొదటి సభ మంగళవారం ఆదిలాబాద్​లో జరగనుంది. ఆదిలాబాద్​లో జరగబోయే సభలో అమిత్​షా ప్రసంగిస్తారు. సాయంత్రం ఇంపీరియల్​ గార్డెన్స్​లో మేధావులతో అమిత్​షా (Amit Shah) సమావేశం అవుతారని తెలిపారు. సమ్మక్క సారక్క ఆశీస్సుల కోసం ముఖ్య నేతలంతా ములుగు వెళుతున్నాం అని తెలిపారు.

"తెలంగాణలో ప్రకటించిన ఎన్నికల నోటిఫికేషన్​ను బీజేపీ పార్టీ స్వాగతం పలుకుతోంది. మా పార్టీ ఎన్నికలకు పూర్తి సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రజలు మార్పు పరివర్తన కోరుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ పార్టీ నాయకులు శక్తిని కేంద్రీకరించి ఐక్యమత్యంగా పని చేసి రాష్ట్రంలో జెండాను ఎగురవేస్తాం. తెలంగాణలో కోరుకుంటున్న మార్పు బీజేపీతోనే సాధ్యం అవుతుంది. ఇక్కడ ఉన్న అవినీతి, కుటుంబపాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మోదీ కూడా ఇదే కోరుకుంటున్నారు." - కిషన్​రెడ్డి బీజేపీ ఛీఫ్

Etela Rajender in Mudiraj Meeting : కొట్లాడాలే తప్ప జేజేలు కొడితే బతుకులు మారవు.. ముదిరాజ్​ సభలో ఈటల

Etala Rajendar on TS Elections : కేసీఆర్ ఎన్నికలను (KCR) డబ్బుమయం చేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఖర్చు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను అంగట్లో సరుకులా అమ్ముతున్నారని తెలిపారు. బీఆర్​ఎస్​కు ఓటేస్తేనే దళితబంధు, పింఛన్ వస్తుందని ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి ఓటేస్తే పథకాలన్నీ పోతాయని ప్రజలను భయపెడుతున్నారని తెలిపిన ఆయన మా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. హుజూరాబాద్​లో కేసీఆర్ ఇచ్చిన హమీలు ఇప్పటికీ అమలుకాలేదని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.

BJP State Chief Kishan Reddy About Telangana Assembly Elections నేతలంతా ఏకమై తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం కిషన్​రెడ్డి

BJP Leader Muralidhar Rao Fires on BRS : 'తెలంగాణలో కుటుంబపార్టీని.. ఓడించడమే బీజేపీ లక్ష్యం'

JP Nadda on Telangana BJP Rebels : బీజేపీ రెబల్స్​తో జేపీ నడ్డా భేటీ.. తిరుగుబాటుకు చెక్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.