ETV Bharat / state

BJP MLA Candidate Selections : ఈ నెల 15 లేదా 16న.. బీజేపీ మొదటి జాబితా అభ్యర్థుల ప్రకటన

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 4:50 PM IST

Updated : Oct 8, 2023, 5:13 PM IST

BJP MLA Candidate Selections : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కమలనాథులు అభ్యర్థుల ఎంపికపై కసరకత్తులు మొదలు పెట్టారు. ఈ నెల 15 లేదా 16న మొదటి అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. మరోవైపు కమలం నేతలు ప్రచారంపై దృష్టి సారించారు. పార్టీ అగ్రనాయకులతో వీలనైంత వరకు సభలు నిర్వహించాలని చూస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

BJP
BJP MLA Candidate Selections

BJP MLA Candidate Selections : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నగారా మోగనుండటంతో బీజేపీ తమ పార్టీ అభ్యర్థులపై (BJP MLA Candidates) ప్రత్యేక దృష్టి సారించింది. ఏకాభిప్రాయం ఉన్న 40 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను రాష్ట్ర నాయకత్వం అదిష్ఠానానికి పంపింది. అమావాస్య తరువాత ఈ నెల 15న లేదా 16న 38 మందితో కూడిన తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను ప్రకటించనుంది. భిన్నాభిప్రాయాలు ఏర్పడ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తును బీజేపీ నాయకులు ముమ్మరం చేశారు.

BJP Leaders Continuous Meetings : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన నేతలు అసంతృప్తి ఉండడంతో అధిష్ఠానానికి ఇదో సమస్యగా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ నేతల మధ్య ఐక్యత లోపిస్తే అది పార్టీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని అగ్రనాయకులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ నాయకులను ఐక్య పరిచేందుకు అధిష్ఠానం ఒక్కొక్కరితో చర్చలు జరిపింది. బీఆర్​ఎస్​ను ఓడించేందుకు.. పార్టీలో చేరిన నాయకులకు.. ప్రాధాన్యత విషయంలో సంతృప్తిగా లేరని తెలుస్తోంది. దీనిపై ఘట్​కేసర్​లో నిర్వహించిన సభకు వచ్చిన జేపీ నడ్డాతో వారితో చర్చలు జరిపి.. ఎన్నికల కమిటీలో చేర్చారన్న ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతుంది.

JP Nadda on Telangana BJP Rebels : బీజేపీ రెబల్స్​తో జేపీ నడ్డా భేటీ.. తిరుగుబాటుకు చెక్..!

ఎన్నికల షెడ్యూల్​కు ముందే.. అగ్ర నేతలతో ఒక దఫా ప్రచారం చేయాలని (BJP Campaign) కమలం పార్టీ నాయకులు భావించారు. మొదటి దఫా ప్రచారంలో భాగంగా మూడు రోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీని రెండు సార్లు రాష్ట్రానికి రప్పించారు. పాలమూరు వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించి మోదీ.. రాష్ట్రాంలో గిరిజన యూనివర్సిటీ, పసువు బోర్టు.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటించారు. నిజామాబాద్ ప్రజాగర్జన సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్​ఎస్, బీజేపీ పొత్తుపై కీలక వ్యాఖ్యాలు చేశారు.

BJP Leader Muralidhar Rao Fires on BRS : 'తెలంగాణలో కుటుంబపార్టీని.. ఓడించడమే బీజేపీ లక్ష్యం'

JP Nadda in Ghatkesar Public Meet : ఈ నెల 6న నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి కమల దళపతి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల సమాయత్తంపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు ఇచ్చారు. పార్టీలో అసంతృప్తి నేతలతో చర్చలు జరిపారు. మంగళవారం ఆదిలాబాద్​కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా రానున్నారు. ఆదిలాబాద్​లో జనగర్జన పేరుతో నిర్వహించే సభలో అమిత్​షా (Amit Shah Adilabad Sabha) పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. సభ అనంతరం అమిత్​షా తిరిగి దిల్లీ వెళ్లనున్నారు.

BJP Election Plan Telangana 2023 : 60 రోజులు.. 43 బహిరంగ సభలు.. జాతీయ నేతల ప్రసంగాలతో.. బీజేపీ మాస్టర్ ప్లాన్

Telangana BJP Election Campaign : అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమలం వ్యూహాలు.. రూట్‌ మ్యాప్‌ సిద్ధం

Last Updated : Oct 8, 2023, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.