ETV Bharat / state

Telangana BJP Election Campaign : అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమలం వ్యూహాలు.. రూట్‌ మ్యాప్‌ సిద్ధం

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 8:22 AM IST

Telangana BJP Election Campaign planning 2023 : రాష్ట్ర శాసన సభ ఎన్నికల నగారా మోగనుండటంతో.. కాషాయ దళం ఎన్నికల రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా 20 అంశాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నిర్ణయించింది. 43 బహిరంగ సభలను నిర్వహించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ సభలకు అగ్ర నేతలు హాజరుకానున్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్వహించే కౌన్సిల్ సమావేశానికి కమల దళపతి జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సమాయత్తంపై దిశా నిర్దేశం చేయనున్నారు.

Telangana BJP Election Campaign
Telangana BJP Election Campaign planning 2023

Telangana BJP Election Campaign తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమలం వ్యూహాలు..ఎన్నికల రూట్‌ మ్యాప్‌ సిద్ధం

Telangana BJP Election Campaign planning 2023 : తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు ఎన్నికల రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. గులాబీ తోటలో కమల వికాసమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ ధీటుగా సభలు, సమావేశాలతో హోరెత్తించాలని భావిస్తోంది. ఇప్పటికే మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని ఎన్నికల వేడిని రాజేసివెళ్లారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్​లో జరిగే పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాత్రి 11:30కి హైదరాబాద్ చేరుకున్న నడ్డా.. శంషాబాద్​లోని నొవాటెల్ హోటల్​లో బస చేశారు. ఉదయం పది గంటలకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఔషాపూర్‌లోని వీబీఐటీలో జరిగే పార్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరై ఎన్నికల సమాయత్తంపై.. శ్రేణులను సమాయత్తం చేయనున్నారు.

BJP Telangana Election Committees 2023 : నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీల సమావేశంలో.. ఎన్నికల వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు. ఎన్నికల రూట్ మ్యాప్ ఖరారుపై నేతలకు పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌. సంతోష్, సునీల్ బన్సల్ దిశా నిర్దేశం చేశారు. 20 అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మండల, బూత్, శక్తి కేంద్రాల ఇంఛార్జిలతో సమావేశాలు నిర్వహణ, మహిళా రిజర్వేషన్ బిల్లుపై సమావేశాలు.. విశ్వ కర్మ యోజన పథకం, మేధావులు, పరివారక్షేత్రస్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

కేంద్రం గ్యాస్ ధర తగ్గించడంపై మహిళల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని మార్గ నిర్దేశనం చేశారు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో అభినందన, రాజకీయ తీర్మానాలను సిద్ధం చేశారు. జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు, మహిళా బిల్లులను కేంద్రం తీసుకువచ్చినందుకు ప్రధానికి అభినందనల తీర్మానాలు, రాజకీయ తీర్మానాలను రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు. ఎన్నికల ప్రచార పర్వం ముగిసే నాటికి 43బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సభలకు బీజేపీ అగ్ర నేతలు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Bandi Sanjay Comments on KCR : దమ్ముంటే.. కేటీఆర్​ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి: బండి సంజయ్​

BJP Telangana Election Committees 2023 : ఈ నెల 10న కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నెల 27న మరోసారి షా రాష్ట్రానికి వస్తున్నారు. ఆ రోజు కుత్బుల్లాపూర్ లేదా రాజేంద్ర నగర్​లో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌.. రాష్ట్రంలో రెండ్రోజులు పర్యటించనున్నారు. అధికారమే లక్ష్యంగా గులాబీ దండుపై.. బీజేపీ జాతీయ నాయకత్వం దండ యాత్రకు సిద్ధం కావడంతో పాటు.. అగ్ర నేతల పర్యటనలతో నిస్తేజంలో ఉన్న బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంటోంది.

Telangana BJP Leaders Secret Meeting : 'ఎరక్కపోయే వచ్చి బీజేపీలో ఇరుక్కుపోయామే.. ఇప్పుడేం చేసేది.. ఎటువెళ్లేది..?'

Kishan Reddy Hunger Strike Ended : నిరుద్యోగుల సమస్యలపై బీజేపీ పోరాటం.. నిరాహారదీక్ష విరమించిన కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.