ETV Bharat / state

Telangana BJP Leaders Secret Meeting : 'ఎరక్కపోయే వచ్చి బీజేపీలో ఇరుక్కుపోయామే.. ఇప్పుడేం చేసేది.. ఎటువెళ్లేది..?'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 8:21 AM IST

Telangana BJP Leaders Secret Meeting : బీజేపీ రాష్ట్ర నాయకుల తీరు నచ్చక అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుందామనే భావనలో కొందరు నేతలు ఉన్నారు. ఈ మేరకు ఇతర పార్టీల నుంచి వచ్చిన మాజీ ఎంపీలంతా ఇటీవల భేటీ అయ్యారు. జాతీయ నాయకత్వం ఎదుట తమ సమస్యలు చెప్పి అమీతుమీ తేల్చుకోవాలనుకున్నారు. ఇప్పుడు వారిలో వారికే.. ఏకాభిప్రాయం కుదరక సతమతమవుతున్నారు. రహస్యంగా సమావేశమైనా.. మీడియాకు తెలవొద్దనే కారణం, నేతల మధ్య భిన్నాభిప్రాయాల వల్లే మిన్నకుండిపోయారని తెలుస్తోంది.

BJP Leaders Meeting in Telangana
BJP Leaders Meeting in Hyderabad

Telangana BJP Leaders Secret Meeting ఎరక్కపోయే వచ్చి బీజేపీలో ఇరుక్కుపోయామే.. ఇప్పుడేం చేసేది.. ఎటువెళ్లేది

Telangana BJP Leaders Secret Meeting : తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా ఈసారి రాష్ట్రంలో కేసీఆర్​ను గద్దె దించి కాషాయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. బీఆర్​ఎస్​ను దీటుగా ఎదుర్కొని.. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలను రాష్ట్ర నాయకత్వం కాషాయ పార్టీలోకి ఆహ్వానించింది. హుజూరాబాద్‌, దుబ్బాక గెలుపుతో బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉందనే నమ్మకంతో వారంతా కమలం గూటికి చేరారు. కర్ణాటక ఎన్నికల(Karnataka Elections 2023) తర్వాత కథ మొత్తం మారిపోయింది.

Telangana BJP Election Strategy : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యాయి. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, కవిత కేసు అంశంపై ఎలాంటి స్పష్టత రాకపోవడం.. బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటేననే చర్చ ప్రజల్లోకి వెళ్లడంతో వలస నేతలు పలువురు సందిగ్ధంలో పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ శివారు గండిపేటలోని ఓ వ్యవసాయక్షేత్రంలో అసంతృప్త బీజేపీ నేతలు(BJP Leaders) రహస్యంగా భేటీ అవడం చర్చకు దారితీసింది. ఈ సమావేశానికి పలువురు మాజీ‌ ఎంపీలు హాజరయ్యారు.

PM Modi Telangana Tour : అక్టోబర్ 2న తెలంగాణకు మోదీ.. మహబూబ్​నగర్, నిజామాబాద్ సభల్లో ప్రసంగం

Telangana BJP Latest News : ఈ రహస్య సమావేశంలో.. బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections 2023)పై జాతీయ నాయకత్వం సీరియస్‌గా లేదని పలువురు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీలో కీలక పదవిలో ఉన్నవారు కొందరు ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని సీనియర్లు అభిప్రాయానికొచ్చారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేకపోవడంపై చర్చించినట్లు తెలిసింది. రేపో, మాపో దిల్లీ వెళ్లి హైకమాండ్‌ను కలవాలని‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Telangana BJP MLA Tickets Issue : జాతీయ నాయకత్వం నుంచి తమకు ఆశాజనకంగా నిర్ణయం రాకుంటే ఏం చేద్దామనే అంశంపై లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ మారాలని కొందరు చెప్పగా.. దీన్ని ఒకరిద్దరు వ్యతిరేకించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ ఇప్పటికిప్పుడు పార్టీ మారితే తమకు ఇతర పార్టీలో టికెట్ దక్కుతుందా? లేదా? అనే లెక్కలు వేసుకున్నట్లు తెలిసింది. చివరి క్షణంలో టికెట్ దక్కకుంటే ఏంటనే అంశంపైనా సమాలోచనలు జరిపినట్లు సమాచారం. కాషాయ పార్టీని వీడి హస్తం గూటికి వెళ్దామనుకున్న వారిలో కొద్ది మందికే.. కాంగ్రెస్ పచ్చజెండా ఇచ్చినట్లు తెలిసింది. మిగతా వారికి మాత్రం టికెట్‌పై స్పష్టమైన హామీ దక్కలేదు. ఈ అంశమే నేతల మధ్య భిన్నాభిప్రాయానికి కారణంగా తెలుస్తోంది. ఒకే మాటపై ఉంటేనే తామనుకున్నది చెల్లుతుందని భావిస్తున్నారు.

BJP MLA Candidate Applications Telangana 2023 : బీజేపీ ఆశావాహుల అప్లికేషన్స్​ స్టార్ట్​.. మొదటి వేసింది ఎవరో తెలుసా..!

BJP MLA Candidates Selection Telangana 2023 : ఎమ్మెల్యే టికెట్‌కు ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తులు స్వీకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.