ETV Bharat / entertainment

'VD 14' కథను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు- ఈ మూవీకి ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదంట! - Vijay Devarakonda VD 14

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 6:58 AM IST

Updated : May 16, 2024, 7:47 AM IST

Vijay Devarakonda VD 14: స్టార్ హీరో విజయ్ దేవరకొండ- రాహుల్ సంకృత్యన్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే దర్శకుడు రాహుల్ ఈ సినిమాను మరో స్టార్ హీరోతో చేద్దామనుకున్నార. మరి ఆ హీరో ఎవరంటే?

Vijay Devarakonda VD 14
Vijay Devarakonda VD 14 (Source: ETV Bharat)

Vijay Devarakonda VD 14: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా 'VD14' వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతోంది. రీసెంట్​గా విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఓ పోస్టర్​ కూడా రిలీజ్ చేశారు. యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. అయితే డైరెక్టర్ రాహుల్ ఈ కథను విజయ్ కంటే ముందు మరో ఇద్దరు స్టార్ హీరోలకు వినిపించారట. వాళ్లు ఎవరంటే?

డైరెక్టర్ రాహుల్ ఈ సినిమాను తమిళంలో తెరకెక్కిద్దామకున్నారట. దీంతో ఆయన కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను అప్రోచ్ అయ్యారట. ముందుగా ఆయనకే ఈ స్టోరీ చెప్పారు. అయితే ఈ కథను ఆయన రిజెక్ట్ చేశారని టాక్. తర్వాత సూర్య సోదరుడు కార్తీకి కూడా కథ వినిపించారట. కార్తీ కూడా నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో దర్శకుడు రాహుల్ కథలో కొన్ని మార్పులు చేసి, టాలీవుడ్​కు వచ్చారు.

ఇక్కడి నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి విజయ్​కు కథ చెప్పారు. వెంటనే విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమాను ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీమేకర్స్​ రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే సినిమాలో నటించనున్న హీరోయిన్, తదితరుల వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది.

రాలయసీమ సెటప్: సినిమా కథ 1854 - 1878 సంవత్సర కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే స్టోరీ ఎలాంటి స్వాతంత్ర్య సమరయోధుల గురించి కాదని, పూర్తిగా రూరల్ ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ ఓ సందర్భంలో చెప్పారు. రాయలసీమ బ్యాక్​డ్రాప్​లో యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమా ఉంటుందని అన్నారు. ఇక ఈ సినిమాలో విజయ్​ డ్యుయల్ రోల్​ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇదివరకు టాక్సీవాలా వచ్చింది. 2018లో రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ఈ సినిమాతో రాహుల్, హీరో విజయ్​కు బ్రేక్ ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ట్రెండ్ మార్చిన విజయ్- డ్యుయల్ రోల్​కు గ్రీన్ సిగ్నల్! - Vijay Devarakonda Dual Role

మైత్రీ మేకర్స్ కొత్త మూవీ అనౌన్స్​మెంట్ - విజయ్ హీరోగా! - Mythri Movie Makers New Movie

Last Updated :May 16, 2024, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.