ETV Bharat / entertainment

ట్రెండ్ మార్చిన విజయ్- డ్యుయల్ రోల్​కు గ్రీన్ సిగ్నల్! - Vijay Devarakonda Dual Role

author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 10:54 AM IST

Vijay Devarakonda Dual Role Movie: యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ స్టైల్ మార్చాడు. తనలోని కొత్త విజయ్‌ను చూపించేందుకు, అభిమానులను వినూత్నంగా అలరించేందుకు సిద్ధమయ్యాడు. గతం కంటే విభిన్నమైన కథాంశంతో మన ముందుకు రానున్నాడు.

Vijay Devarakonda Dual Role
Vijay Devarakonda Dual Role (Source: ETV Bharat)

Vijay Devarakonda Dual Role Movie: 'ఐరన్ ఏ వంచాలా ఏంటి' ఇది 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ డైలాగ్. ఇక ఎప్పుడూ ఒకే పాత్రలో నటించాలా ఏంటీ అని అంటున్నాడు విజయ్. తాజాగా హీరో విజయ్, టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్​తో సినిమా ఓకే చేశాడు. అయితే ఈ సినిమాలో విజయ్ డ్యుయెల్​ రోల్​లో నటించనున్నట్లు తెలుస్తోంది.

1854 - 1878 సంవత్సర కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ కథ ఉండబోతుంది. ఇటీవల సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. బీటలు వారిన నేలపై ఓ రాయి విగ్రహం ఉంది. కత్తి పట్టుకొని అమ్మవారు గుర్రంపై కూర్చున్నట్లు రాయిపై చెక్కి ఉన్న పోస్టర్​ రిలీజ్ చేశారు. దానిని బట్టి విజయ్ ఒక వారియర్ పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పాత్రతోపాటు విజయ్ సినిమాలో డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడని సినీ వర్గాల టాక్.

మొత్తానికి విజయ్ తన 14వ సినిమాతో డ్యూయెల్ రోల్​తో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడన్న మాట. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మంధాన్న హీరోయిన్​గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ పాన్ఇండియా లెవెల్​లో రూపొందిస్తోంది.

ఇక, రీసెంట్​గా రిలీజైన ఫ్యామిలీ స్టార్ సినిమా విజయ్ దేవరకొండకు అనుకున్నంత హిట్ తెచ్చిపెట్టలేదు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా నిరాశ పర్చినప్పటికీ విజయ్‌తో కలిసి మరో ప్రాజెక్టుతో సిద్ధమయ్యారాయన. కిరణ్ కోలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఒక గ్రామీణ నేపథ్యంలో డైరెక్టర్ ఈ సినిమా కథను సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విజయ్ బర్త్​డే సందర్భంగా రిలీజ్ చేశారు. అందులో 'కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే' అంటూ రక్తంతో తడిచిన చేయి కనిపిస్తుంటుంది. వర్షంలో తడుస్తున్న చేయి, వెనుక వైపు చెలరేగుతున్న మంటలు కనిపిస్తుండటం ఈ సినిమా అంచనాలు పెరిగిపోయాయి. ఇది కూడా పాన్ఇండియా రేంజ్​లోనే తెరకెక్కుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

క్రేజీ న్యూస్​ - స్టార్ డైరెక్టర్​తో రామ్ పోతినేని నయా మూవీ! - Ram Pothineni New Movie

విజయ్​ దేవరకొండ ట్రిపుల్ ధమాకా - ఎవరూ ఊహించని విధంగా 3 కొత్త సినిమాల అప్డేట్స్​ - Happy Birthday Vijay Devarkonda

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.