ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారికి వాహన యోగం! కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి! - Horoscope Today May 24th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 5:00 AM IST

Horoscope Today May 24th 2024 : మే​ 24న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today May 24th 2024
Horoscope Today May 24th 2024 (ETV Bharat)

Horoscope Today May 24th 2024 : మే​ 24న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పెద్దగా మార్పు ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు ఆదాయాన్ని మించి ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బందులు పెట్టే వ్యక్తులను పట్టించుకోకండి. మీరు సహనంతో ఉంటే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఉద్యోగులు కష్టపడి పనిచేసి అందరి ప్రశంసలను పొందుతారు. వ్యాపారులు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంతకాలం వేచి ఉండటం మంచిది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేసింది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార నిపుణులకు ఆశించిన ప్రయోజనాలు అందుతాయి. ఈ రోజు ఈ రాశి వారు ఊహించిన దాని కంటే ఎక్కువ ధనలాభాన్ని పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్థిరాస్తి,మార్కెటింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానం విషయంలో ఆందోళనతో ఉంటారు. అనారోగ్య సమస్యల వలన చికాకుతో ఉంటారు. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. లేకుంటే అనవసర కలహాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. మెరుగైన ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠించండి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు చురుగ్గా, లౌక్యంగా పనిచేసి పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలకు మంచి సమయం. ఆర్థికంగా బలోపేతం అవుతారు. మెరుగైన ఫలితాల కోసం గణపతి ఆలయ సందర్శన చేస్తే మంచిది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో విహారయాత్రలకు వెళతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలి. స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. పెద్దల సూచనలు పాటించడం మంచిది. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. శివారాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో పేరున్న గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగులు పని ఒత్తిడి ఉన్నా సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రమోషన్​కు అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంది. వృత్తి వ్యాపార నిపుణులకు అన్నింటా విజయం ఉంది. కార్యసిద్ధి ఉంటుంది. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నూతన వాహన యోగం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. లేకుంటే అపార్థాలకు అవకాశం ఉంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగులు పనిలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటారు. వ్యాపారులకు తోటి వ్యాపారుల నుంచి తీవ్రమైన పోటీ ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన వ్యహారంలో పెద్దల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. శని స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి మార్పును ఈ రోజు చూస్తారు. కీలకమైన విషయాలలో ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. బంధుమిత్రులతో విందువినోదాలో పాల్గొంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ఆర్థిక విషయాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. తీర్థ యాత్రలకు వెళతారు. ఒక శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దైవ దర్శనం కోసం తీర్థ యాత్రలు చేస్తారు. ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. సహనంతో ఉంటే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. కుటుంబంలో గొడవల కారణంగా ప్రశాంతత లోపిస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు వ్యాపార విస్తరణ నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శ్రీ దుర్గా దేవి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.