ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

author img

By

Published : Nov 7, 2021, 6:00 AM IST

Updated : Nov 7, 2021, 10:02 PM IST

ETV BHARAT LATEST TOP NEWS
ETV BHARAT LATEST TOP NEWS

21:57 November 07

టాప్ ​న్యూస్ ​@ 10PM

  •  నయా పైసా తగ్గించేది లేదు..

పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపుపై సీఎం కేసీఆర్​ స్పష్టతనిచ్చారు. తాము నయా పైసా పెంచలేదని.. తగ్గించే ప్రసక్తే లేదని చెప్పారు. పెట్రోల్​ ధరలను పెంచిన వాళ్లే తగ్గించాలని సీఎం డిమాండ్​ చేశారు. చమురుపై సెస్‌ రద్దు చేసేవరకు కేంద్రంపై పోరాడుతామన్నారు.

  •  ఎవరి మెడలు వంచుతారు?

సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రగతిభవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... భాజపాపై తనదైన శైలిలో విరచుకుపడ్డారు. ధాన్యం సేకరణ, పంటల సాగు, పెట్రో ధరలపై సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

  • వారిద్దరికి బాంబు బెదిరింపు

దీపక్​ శర్మ అనే వ్యక్తి ట్విట్టర్​ ఖాతా నుంచి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగికి బాంబు బెదిరింపు సందేశం అందింది. ట్వీట్​కు డయల్​ 112ను ట్యాగ్​ చేశాడు నిందితుడు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. నిందితుడిని త్వరలోనే అరెస్ట్​ చేస్తామని చెప్పారు.

  •  ఐదుగురు గ్రామస్థుల కిడ్నాప్

ఛత్తీస్​గఢ్ సుక్మా జిల్లాలో ఐదుగురు గ్రామస్థులను నక్సల్స్ (Naxals in Chhattisgarh) అపహరించుకుపోయారు. ఓ మహిళ, నలుగురు పురుషులను కిడ్నాప్ చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామస్థుల గురించి తమకు ఇంకా సమాచారం లేదని చెప్పారు.

  • టీమ్​ఇండియా సెమీస్​ ఆశలు గల్లంతు

టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భారత్‌ సెమీస్‌ అవకాశాలు గల్లంతయ్యాయి. సూపర్‌-12 దశ నుంచే ఇంటిముఖం పట్టింది కోహ్లీసేన. అఫ్గానిస్థాన్​ విజయంతో న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ చేరడం వల్ల టీమ్​ఇండియా, నమీబియా మధ్య సోమవారం జరగాల్సిన మ్యాచ్​ ఇక నామమాత్రమే.

20:55 November 07

టాప్ ​న్యూస్ ​@ 9PM

  •  ' కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నాం '

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏడేళ్ల కాలం నుంచి అన్నదాతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

  • ' ఆ మాట కేంద్రమే చెప్పింది'

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకోమాట చెప్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందని సీఎం ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో తన బాధ్యతను పూర్తిగా విస్మరిస్తోందని విమర్శించారు. హైదారాబాద్​లోని ప్రగతిభవన్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

  •  టచ్​ చేసి.. బతికి బట్ట కట్టగల్గుతారా..?

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై సీఎం కేసీఆర్​ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్​ స్థాయి మీరి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్​ ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుని స్థాయిలో ఉండి.. అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు

  •  చెంపదెబ్బపై స్పందించిన ప్రకాశ్​రాజ్

'జై భీమ్' సినిమాలో చెంపదెబ్బ సన్నివేశం వివాదస్పదమైంది. ఈ విషయమై ఆ సీన్​లో నటించిన ప్రకాశ్​రాజ్ స్పందించారు. మిగతా అంతా సినిమాలో దానిని మాత్రమే చూడటమేంటని అన్నారు.

  • సముద్రంలో  మంటలు..!

చేపల వేటకు వెళ్లిన ఓ జాలర్ల బృందం పడవ మంటల్లో చిక్కుకుంది. అప్రమత్తమైన ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ దళం జాలర్లను రక్షించింది. ఈ ఘటన గుజరాత్​ తీరానికి 50 మైళ్ల దూరంలో జరిగింది.

19:59 November 07

టాప్ ​న్యూస్ ​@ 8PM

  • రాష్ట్రంలో బతికి బట్ట కట్టగల్గుతారా..?

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై సీఎం కేసీఆర్​ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్​ స్థాయి మీరి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్​ ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుని స్థాయిలో ఉండి.. అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు

  •  'రైతు ప్రభుత్వం మాది'

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏడేళ్ల కాలం నుంచి అన్నదాతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

  • దీదీతో అఖిలేశ్ జట్టు

ఉత్తర్​ప్రదేశ్ రాజకీయాలకు బంగాల్ ఫ్లేవర్ తోడవనుంది. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. యూపీలో ప్రచారం నిర్వహించే (UP Election 2022) అవకాశం ఉందని తెలుస్తోంది. సమాజ్​వాదీ పార్టీ తరపున దీదీ ప్రచారం చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కోసం దీదీ వ్యూహాలనే అఖిలేశ్ ఉపయోగించుకోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

  • 'కొత్త సినిమాల  అప్డేట్స్"

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, బంగార్రాజు, అఖండ, అర్జున ఫాల్గుణ, డేగల బాబ్జీ, పక్కా కమర్షియల్, అనుభవించు రాజా చిత్రాల కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి.

  • రషీద్ ఖాన్ మరో ఘనత

అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్​ (Rashid Khan News) మరో ఘనత సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా టీ20ల్లో 400 వికెట్ల మైలురాయిని చేరుకున్న బౌలర్​గా నిలిచాడు.

18:47 November 07

టాప్ ​న్యూస్ ​@ 7PM

  • వైన్స్​ కేటాయింపులపై సర్కార్​ మార్గదర్శకాలు.!

మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయించేందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించింది. కొత్త జిల్లాలను యూనిట్‌గా తీసుకొని కేటాయింపులు చేసేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఆయా జిల్లాల్లో ఉన్న దుకాణాలు ఆధారంగా ఈ కేటాయింపులు పూర్తి చేస్తారు.

  •  బస్సు ఛార్జీలు ఎంత పెంచుతున్నారంటే..?

ఛార్జీల పెంపునకు(rtc ticket prices) ఆర్టీసీ సంస్థ రంగం సిద్దం చేస్తోంది. ప్రజలపై ఆర్థికంగా ఎక్కువ భారం పడకుండా... సంస్థ ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించే విధంగా ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీని పుట్టెడు కష్టాలు వెంటాడుతున్నాయి.

  • వాటిపై ఉన్న శ్రద్ధ కొనుగోళ్లపై లేదు 

ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్ డిమాండ్‌ చేశారు. నల్గొండలో వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించిన ఆయన.. ధాన్యం కొనుగోళ్లలో తెరాస సర్కారు విఫలమైందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ప్రాజెక్టులు, కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు.

  • వాళ్లు పైకి..  ఇండియా ఇంటికి..!

అఫ్గానిస్థాన్​పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా టీ20 ప్రపంచకప్​ సెమీస్​లో బెర్త్ ఖరారు చేసుకుంది. ఫలితంగా భారత్.. సెమీస్​ రేసు నుంచి నిష్క్రమించింది.

  • సెమీస్​ ఆశలు ఆవిరి..!

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌ అవకాశాలు గల్లంతయ్యాయి. సూపర్‌-12 దశ నుంచే ఇంటిముఖం పట్టింది కోహ్లీసేన. అఫ్గానిస్థాన్​ విజయంతో న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ చేరడం వల్ల టీమ్​ఇండియా, నమీబియా మధ్య సోమవారం జరగాల్సిన మ్యాచ్​ ఇక నామమాత్రమే.

17:41 November 07

టాప్ ​న్యూస్ ​@ 6PM

  • 'ఆ ప్రశంసలకు కారణం నేను కాదు'

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో భావోద్వేగ ప్రసంగం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచవ్యాప్తంగా భారత్​కు లభిస్తున్న ప్రశంసలు తన వల్ల కాదని, పార్టీ కార్యకర్తలపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వల్లేనని అన్నారు.

  • భార్యపై ప్రేమతో.. ఇంట్లోనే..!

ప్రాణంగా ప్రేమించిన తన భార్య.. ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లినా ఇంట్లోనే ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రేమను చాటుకున్నారు కర్ణాటకకు చెందిన శివ చౌగలే. భార్య పేరుపై ఓ ఆస్పత్రిని సైతం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అర్ధాంగిపై శివకున్న ప్రేమను చూసి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

  • వారికి ఉచిత కోచింగ్

దేశంలో అత్యున్నత సర్వీసులకు నిర్వహించే సివిల్స్​ మెయిన్స్(civils mains exam)​ పరీక్షకు ఉచిత కోచింగ్​ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రిలిమ్స్ పాసై ఆసక్తి గల అభ్యర్థులు తమ వెబ్​సైట్​లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

  • 'పునీత్​కు అది ఇవ్వాల్సిందే​!'

గుండెపోటుతో ఇటీవలే మరణించిన కన్నడ పవర్​ స్టార్ పునీత్ రాజ్​కుమార్​కు(puneeth rajkumar news) పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనే డిమాండ్​ రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటక భాజపా మంత్రులు కూడా పునీత్​ పేరును కేంద్రానికి సిఫార్సు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు(karnataka news). ఆయన చేసిన సేవలకు గానూ మరణానంతరం అవార్డు ప్రకటించాలంటున్నారు.

  • కివీస్​ లక్ష్యం ఎంతంటే..!

న్యూజిలాండ్​తో మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​ బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్​ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేయడం వల్ల నిర్ణీత ఓవర్లన్నీ ఆడి తక్కువ పరుగులే చేశారు.

16:53 November 07

టాప్ ​న్యూస్ ​@ 5PM

  •  ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం..!

ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మొక్కలు పెంచుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్​లోని యాప్రల్​లో ఉన్న ఓ ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. సదరు ఇంటిపై దాడి చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్​ చేసి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

  • సీఎం సొంత గ్రామంలో నీటి కష్టాలు.!

సొంత గ్రామంలో పర్యటించిన మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​కు అక్కడి నీటి కష్టాలను చెప్పుకున్నారు గ్రామస్థులు. వెంటనే అధికారులపై మండిపడ్డారు సీఎం. నీటి కుళాయిలను కూడా నేనే చూసుకోవాలా? అని ప్రశ్నించారు.

  • పునీత్​​కు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' నివాళి

'శ్రీదేవీ డ్రామా కంపెనీ' కొత్త ప్రోమో అలరిస్తోంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా పునీత్ విషెస్ చెబుతున్న ఓ వీడియో కూడా ఇందులో ఉంది. ఆయనకు ఈ ఎపిసోడ్​ను అంకితమిచ్చారు.

  •  ఐపీఎల్ కొత్త​ జట్టుకు కోచ్​గా రవిశాస్త్రి!

ఐపీఎల్​లోనూ రవిశాస్త్రి కోచ్​ అవతారమెత్తేందుకు సిద్ధమవుతున్నాడు. కొత్త జట్టు అహ్మదాబాద్​ బాధ్యతలు త్వరలో అందుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై స్పష్టత రానుంది.

15:40 November 07

టాప్ ​న్యూస్ ​@ 4PM

  • మంత్రిని పరామర్శించిన సీఎం కేసీఆర్

ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. ఇటీవల మంత్రి తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందారు.

  •  ఆ ఐదు రాష్ట్రాలే లక్ష్యం!

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో (BJP Executive Meeting) భాగంగా దేశంలో టీకా పంపిణీపై చర్చించినట్లు ఆ పార్టీ నేత నిర్మలా సీతారామన్ తెలిపారు. జమ్ముకశ్మీర్​ అభివృద్ధి దిశగా పయనిస్తోందని పార్టీ తీర్మానంలో పేర్కొన్నట్లు చెప్పారు. తీర్మానాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టగా.. పలువురు నేతలు మద్దతు ప్రకటించారు.

  • ఆ హత్య.. వారి పనేనా?

బంగాల్​ పూర్వ మేదినిపుర్​ జిల్లాలో ఓ భాజపా కార్యకర్త దారుణ హత్యకు(bjp worker death) గురయ్యాడు. టీఎంసీ సభ్యులు గూండాలతో తమ కార్యకర్తను చంపించారని భాజపా ఆరోపించింది(bjp worker killed in bengal). ఆ ఆరోపణలను టీఎంసీ కొట్టిపారేసింది.

  • నిజంగా పూజాహెగ్డే తప్పుకోనుందా?

పవన్​-హరీశ్​ శంకర్(pawan kalyan harish shankar movie)కాంబోలోని రెండో సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. చిత్రాలు, రాజకీయాలతో పవన్​ బిజీగా ఉండగా, పలు భాషల్లో నటిస్తూ హీరోయిన్​ పూజా హెగ్డే(pooja hegde pawan kalyan) కూడా ఫుల్​ బిజీగా ఉంది. దీంతో ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొనేలా కనిపిస్తోంది.

  • ఆ సిరీస్​కు  ఐపీఎల్​ స్టార్​లు!

టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021) ​అనంతరం భారత్​లో పర్యటించనుంది న్యూజిలాండ్​ (India vs New Zealand). 3 టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన కోసం ఐపీఎల్​లో అదరగొట్టిన పలువురు కుర్రాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది!

14:39 November 07

టాప్ ​న్యూస్ ​@ 3PM

  • ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదన.. దేనికి ఎంతంటే!

రాష్ట్రంలో ఆర్టీసీ(TSRTC) ఛార్జీల పెంపుపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్​ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆర్టీసీ(TSRTC) ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ సజ్జనార్‌ పాల్గొన్నారు. ఛార్జీల పెంపుపై అధికారులు సమాలోచనలు జరిపి పలు ప్రతిపాదనలు రూపొందించారు. 

  •  ఆ ఐదు ఇళ్లలో సోదాలు!

మేడ్చల్​ డ్రగ్స్ కేసు(Medchal Mephedrone drug case)లో ఇంకా దొరకని నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుల ఇళ్లతో పాటు మరో ఐదుగురి ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు హన్మంత్ రెడ్డి ఇదివరకే లొంగిపోయాడు.

  • 'మా శక్తిని ఇంకా పూర్తిగా చూడలేదు...!'

ప్రధాని నరేంద్ర మోదీని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం ఘనంగా సన్మానించింది. దిల్లీలో సమావేశం సందర్భంగా.. కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్​ నాయకులు మోదీని గజమాలతో సత్కరించారు. కొవిడ్​ క్లిష్ట సమయాల్లో ప్రధాని తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు.. భాజపా శక్తిని ఇంకా పూర్తిస్థాయిలో చూడలేదని, త్వరలోనే అది జరుగుతుందని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.

  • 2015 తర్వాత ఇదే రికార్డు..

తమిళనాడు చెన్నైలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2015 తర్వాత ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారి. వానల ధాటికి నగరంలోని జలమయమైన వివిధ ప్రాంతాల్లో ఆయా చోట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్​ పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

  • కోచ్​గా మారతానని చెప్పిన బ్రావో.. గేల్​ సరదా రిటైర్మెంట్!

వెస్టిండీస్​ మాజీ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో(DJ Bravo retirement) క్రికెట్​పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. క్రికెట్​ ఆడటం పూర్తిగా మానేసిన తర్వాత తప్పకుండా కోచింగ్​ బృందంలో చేరతానని తెలిపాడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్.. తాను ఇంకా రిటైర్మెంట్​(Chris Gayle news) ప్రకటించలేదని తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

13:48 November 07

టాప్ ​న్యూస్ ​@ 2PM

చెన్నైలో వరుణుడి బీభత్సం

తమిళనాడు చెన్నైలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2015 తర్వాత ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారి. వానల ధాటికి నగరంలోని జలమయమైన వివిధ ప్రాంతాల్లో ఆయా చోట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్​ పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కొనుగోళ్ల జాప్యం.. అన్నదాతకు శాపం

ధాన్యం కొనుగోళ్లలో(paddy procurement in telangana) జాప్యంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల ఇంకా కేంద్రాలు తెరవలేదు. ప్రారంభించిన చోట కొనుగోళ్లు మొదలవలేదు. ఫలితంగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఈసారి దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ స్థాయిలో కొనుగోళ్లు ఊపందుకోలేదు. జిల్లాలోని వివిధ మండలాల్లోని పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం...

ఏఎస్సై మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని పెట్రోలింగ్ వాహనం(Police accident today) ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏఎస్సై హరిలాల్ మృతిచెందారు.


జలప్రళయం తప్పదా?

ఆర్కిటిక్‌ హిమఖండంలో పెరిగిన వేడిపై (Arctic warminig faster) నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రెండు దశాబ్దాలలో ఆర్కిటిక్‌ ప్రాంతంలో వేసవి రోజుల్లో సముద్ర జలాలపై మంచు కనుమరుగై పోనుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మనం మేల్కొని కర్బన ఉద్గారాలను తద్వారా భూతాపాన్నీ కట్టడి చేయకపోతే పరిస్థితి చేజారిపోవచ్చని చెబుతున్నారు.

బాయ్​ఫ్రెండ్​ ప్రపోజల్​.. పిక్స్​ వైరల్​

బాలీవుడ్​ బ్యూటీ అనన్య పాండే కజిన్​గా పరిచయమైంది మోడల్​ అలన్న పాండే. గత కొద్దీ కాలంగా సోషల్​మీడియాలో బికినీ ఫొటోలను పోస్ట్​ చేస్తూ నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రస్తుతం మాల్దీవుల్లో తన ప్రియుడు ఐవోర్​తో కలిసి ఎంజాయ్​ చేస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఆమెకు ప్రపోజ్​ చేసి ఆశ్చర్యపరిచాడు. రింగ్​ తొడిగాడు. ఇద్దరూ ముద్దులు పెట్టుకుంటూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది అలన్న. అవి కాస్త వైరల్​గా మారాయి. వాటితో వారిద్దరూ కలిసి గతంలో దిగిన ఫొటోలపై ఓ లుక్కేద్దాం..

12:50 November 07

టాప్ ​న్యూస్ ​@ 1PM

ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము

 ఓ పాము ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసింది. పాముకాటుకు మూడు నెలల చిన్నారి మృతి చెందింది. ఈఘటన మహబూబాబాద్​ జిల్లా కేంద్రం శనిగపురంలో జరిగింది. చిన్నారి తల్లిదండ్రులు క్రాంతి, మమత... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  

పెంచేనా.? ఉంచేనా.? 

టీఎస్​ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ సమావేశమయ్యారు. బస్సు ఛార్జీల పెంపుపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఆ బ్యాంకు ఖాతాల‌ను మూసేయండి

వినియోగదారులు.. తమ అవసరాలకు తగిన విధంగా వివిధ బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభించడం మంచిది కాదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ ఖాతాలు తెరిచి ఉంటే.. అందులో అవసరంలేని వాటిని మూసివేయడమే మేలని సూచిస్తున్నారు. లేదంటే.. మీ జేబులకు చిల్లు పడటం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.


ఆర్యన్​పై వాంఖడే స్కెచ్​

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్​ తనయుడు ఆర్యన్ ఖాన్​ను కిడ్నాప్ చేసేందుకు ఎన్​సీబీ అధికారి సమీర్ వాంఖడే, భాజపా నేత మోహిత్​ భారతీయ కుట్ర పన్నారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ముంబయిలోని ఓ శ్మశానవాటిక వద్ద మోహిత్​ను వాంఖడే కలిశారని చెప్పారు.


అనుష్క కొత్త సినిమా ప్రకటన

హీరోయిన్​ అనుష్కకు(anushka shetty uv creations) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆమెతో కొత్త సినిమా తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది యూవీ క్రియేషన్స్​(anushka shetty new movie updates). ఈ చిత్రానికి మహేశ్​ దర్శకుడు. త్వరలోనే షూటింగ్​ ప్రారంభంకానుందని తెలిపింది.


 

11:49 November 07

టాప్ ​న్యూస్ ​@ 12PM

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం

దిల్లీలో భాజపా జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కీలక నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇటీవల ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలే ఈ భేటీ అజెండా.


మోదీనే నంబర్​-1

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ(pm modi news) మొదటి స్థానంలో నిలిచారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు. మార్నింగ్ కన్సల్ట్​ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రజలు ఈమేరకు తమ అభిప్రాయాన్ని తెలిపారు.

సివిల్స్​ లక్ష్యమా.. ఈ టిప్స్​ మీకోసం

సివిల్ సర్వీసెస్​లో విజయం సాధించడం... ఎంతో మంది యువత కల. ఆ స్వప్నాన్ని నిజం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రిలిమ్స్​లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. జనవరి 7 నుంచి జరగనున్న మెయిన్స్​కు సన్నద్ధమవుతున్నారు. తొలి అడుగులో విజయం సాధించి.. మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 

బోరునీళ్లు తాగాడని చితకబాదాడు

బోరునీళ్లు తాగడానికి వెళ్లిన 70 ఏళ్ల వృద్ధుడిని చితకబాదాడు యజమాని. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు.. శనివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. బిహార్​లోని వైశాలిలో జరిగిందీ ఘటన.


'లాలా భీమ్లా' సాంగ్​ రిలీజ్​

'భీమ్లానాయక్'​ సినిమాలోని 'లాలా భీమ్లా' సాంగ్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో పవన్​ కల్యాణ్​, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

10:49 November 07

టాప్​న్యూస్ ​@ 11AM

చంద్రుడిపై ఆవాసానికి బాటలు

నాసా సౌజన్యంతో 2026లో జాబిల్లిపైకి ఒక రోవర్‌ను పంపనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. అది చంద్రుడి మట్టిని సేకరించి, శోధిస్తుందని పేర్కొంది. అయితే ఆ దేశంలోని ప్రైవేటు సంస్థలు.. 2024లోనే చంద్రుడిపైకి రోవర్​ పంపించి, నీటి జాడను శోధించాలని భావిస్తున్నాయి.

అమరావతి పాదయాత్రకు హెచ్చరికలు

ఏపీలో అమరావతి రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న మహా పాదయాత్రలో.. పోలీసులు భారీగా మోహరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ నిర్వాహకులకు మరోసారి హెచ్చరికలు జారీచేశారు.

వీధిలో యువకుడి బీభత్సం

ఉత్తర్​ప్రదేశ్​ అమ్రోహా జిల్లాలో దారుణం జరిగింది. మెహల్లా శాంతి నగర్ ప్రాంతంలో ఓ యువకుడు మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను కిరాతకంగా కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సదరు మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మహిళ తరఫు కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

చిరు కొత్త సినిమాలో పవన్​.. 

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​(chiranjeevi pawan kalyan movie).. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరు '154' సినిమాలో నటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముందని అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వేచి ఉండాల్సిందే.


న్యూజిలాండ్​పై అఫ్గాన్​ గెలిస్తే..

ఆదివారం(నవంబర్ 7) న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్​ (NZ vs AFG T20) మధ్య మ్యాచ్​పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్(shoaib akhtar news) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్​లో అఫ్గాన్​ గెలిస్తే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతాయని అభిప్రాయపడ్డాడు.

09:48 November 07

టాప్​న్యూస్ ​@ 10AM

నిరుద్యోగి ఆత్మహత్య

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎన్నో ఏళ్లుగా శిక్షణ తీసుకుంటూ.... ఎప్పటికీ నోటిఫికేషన్​ విడుదల కాకపోవడం వల్ల మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు (youth commits suicide). ఈఘటన నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్టలో జరిగింది.


అలలపై షికారు.. నేటి నుంచే

గోదావరి నదిలో పాపికొండలు విహారయాత్ర నేటినుంచి పునఃప్రారంభించారు(Papikondalu boating start). సుదీర్ఘ విరామం తర్వాత ఈ సందడి మళ్లీ మొదలైంది(Boat services to Papikondalu to resume). గతంలో పలు ఘటనలు నేర్పిన పాఠంతో భవిష్యత్తులో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టామని ఏపీ పర్యాటక శాఖ తెలిపింది.

తెలంగాణలో పసిడి ధరలు

బంగారం (Gold Rate Today) ధరలో ఆదివారం ఎలాంటి మార్పు లేదు. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ప్రస్తుతం ఇలా ఉన్నాయి.

ఆ పాత్రలు చేయలేదని బాధేసింది

'నరసింహ'(ramya krishnan krishna vamsi), 'అంతఃపురం' సినిమాలో సీనియర్​ హీరోయిన్​ సౌందర్య చేసిన పాత్రలను తాను చేయలేనందుకు బాధపడినట్లు గుర్తుచేసుకున్నారు సీనియర్​ నటి రమ్యకృష్ణ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత(ramya krishna queen web series in telugu) తనకు ఆదర్శమని చెప్పారు. 

అత్యుత్తమ కెప్టెన్లు వీరే

టీ20 మ్యాచ్​ల్లో ఏ ఆటగాడు ఎప్పుడు విజృంభిస్తాడో ఎవ్వరూ ఊహించలేరు. ఒక్కోసారి చివరిక్షణాల్లో మ్యాచ్​ స్థితిగతులు మారిపోతుంటాయి. ఇలాంటి సమయంలో కెప్టెన్ తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. అయితే.. ఇప్పటివరకు టీ20ల్లో అత్యుత్తమంగా రాణించిన కెప్టెన్లు(Best T20 Captain) ఎవరో తెలుసుకుందాం..


 

08:51 November 07

టాప్​న్యూస్ ​@ 9AM

ఎంసెట్‌ తుది విడత సీట్లు

ఎంసెట్ తుది విడత కౌన్సిలింగ్(TS Eamcet counselling 2021) ప్రారంభమైంది. మొత్తం 39వేల సీట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తొలి విడత మిగిలిన సీట్లతో పాటు... కొత్తగా మరో 4,404 సీట్లు అదనంగా చేరాయి. ఈనెల 8న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.


చెప్పులతో కొట్టి చంపేస్తాం

భాజపా ఎమ్మెల్యేకు ఓ మహిళ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. తమ గ్రామానికి వెంటనే రోడ్డు వేయించకపోతే.. చెప్పులతో కొట్టి చంపుతామని బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

ప్రపంచ ఆకలి తీరుతుందా

ప్రపంచ వ్యాప్తంగా ఉండే శ్రీమంతులు తలచుకుంటే ఒక వివిధ దేశాల్లోని కోట్ల మంది నిరుపేదల ఆకలి బాధలు తీర్చేయొచ్చని ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బేస్లే అంటున్నారు. ఎన్నో రోజులుగా తిండి లేక.. తాగేందుకు నీరు దొరక్క, డొక్క ఎండిపోయి.. చావుకు దగ్గరవుతున్న వారు ప్రపంచంలో 4.2 కోట్ల మంది ఉన్నారట. వీళ్లను బతికిచ్చేందుకు 6 బి.డాలర్లు అవసరమని చెప్తున్నారు.


సామీ.. కోసం ఏడాది ఎదురుచూశా!

'సామీ.. సామీ..' అంటూ అందరి హృదయాలను కొల్లగొట్టింది ఆ యువ గాయని. విడుదలైన మూడు రోజుల్లోనే ఆమె పాటకు రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆమే జానపద గాయని మామిండ్ల మౌనిక యాదవ్. తొలి పాటతోనే తనదైన వాయిస్​తో మెప్పించిన మౌనిక ‘ఈటీవీ భారత్​తో'తో తన ప్రయాణాన్ని పంచుకుంది ఇలా...


కివీస్​ X అఫ్గాన్​ పోరు

ఆదివారం(నవంబర్ 7) న్యూజిలాండ్​తో తలపడనుంది అఫ్గానిస్థాన్(NZ vs AFG T20)​. ఈ మ్యాచ్​లో అఫ్గాన్​ గెలిస్తేనే భారత్​ సెమీస్​కు చేరే అవకాశం దొరుకుతుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్​ అభిమానులు నేడు జరగనున్న మ్యాచ్​ గురించి ఫన్నీ మీమ్స్ షేర్​ చేస్తున్నారు. అవి కడుపుబ్బా నవిస్తున్నాయి. వాటిని చూసేద్దాం..

07:38 November 07

టాప్​న్యూస్ ​@ 8AM

సగం దారికొచ్చింది

హైదరాబాద్ ఓఆర్​ఆర్ వెలుపల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు(Regional Ring Road Hyderabad) ఉత్తర మార్గం నివేదికకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. సీఎం కేసీఆర్ సూచనలతో అలైన్​మెంట్ రూపొందించినట్లు తెలిసింది. కాగా త్వరలో దీనిపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

సంక్షేమ రాజ్యంలో 'మందు'పాతరలా?

తాగుడు వ్యసనం (alcohol addiction in india) పేదరిక కూపంలోకి నెట్టేస్తుంది. సర్వభ్రష్టుణ్ని చేస్తుంది. కుటుంబ ఎదుగుదలను, ఆర్థిక సౌష్టవాన్ని కుళ్లబొడుస్తుంది. మద్యనిషేధం దిశగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ నల్లబాజారులో కల్తీ మద్యం పడగవిప్పుతోంది. వ్యసనాన్ని పెకలించేలా మద్యవ్యతిరేకతను ప్రజల్లో పెంపొందించాలి. 

తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త

డ్రగ్స్‌... గంజాయి... కొంతకాలంగా పత్రికల్లో వీటికి సంబంధించిన వార్తల్లేని రోజు ఉండటం లేదు. ఆ వార్తల్లో మనకు కన్పిస్తున్నది అయితే సెలెబ్రిటీలూ లేదంటే పోలీసులు అరెస్టు చేసిన స్మగ్లర్లు. వీరిద్దరి మధ్య కనిపించని మరో వర్గమూ ఉంది. కేవలం సెలెబ్రిటీలే వాడితే డ్రగ్స్‌ ఇంత పెద్ద వ్యాపారం కాదు. మనదేశంలో కొన్ని కోట్లమంది మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నారు. 

15 మంది దుర్మరణం

టోల్​బూత్​ వద్ద ఆగి ఉన్న కార్లపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మెక్సికోలో ఈ ప్రమాదం జరిగింది.

అఫ్గాన్​పైనే టీమ్​ఇండియా ఆశలు

టీ20 ప్రపంచకప్​లో గ్రూప్​ దశ మ్యాచ్​లు ముగింపునకు చేరుకున్నాయి. శనివారంతో(నవంబరు 6) గ్రూప్​ 1లో సెమీస్​ చేరే జట్లపై స్పష్టత వచ్చేసింది. అయితే గ్రూప్​ 2లో మాత్రం అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్​ మధ్య పోటీ నెలకొనగా.. టీమ్​ఇండియా భవితవ్యం అఫ్గాన్​పై ఆధారపడి ఉంది. ఇంతకీ గ్రూప్-1లో ఏ జట్లు సెమీస్​కు చేరాయి, గ్రూప్​-2లో ఏ టీమ్స్​కు అవకాశాలు ఉన్నాయి? వాటికి బెర్తు దక్కాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం..

06:50 November 07

టాప్​న్యూస్ ​@ 7AM

నివేదికకు నాలుగేళ్లు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. రామకృష్ణయ్య కమిటీ నివేదిక ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా ప్రభుత్వ అనుమతి లభించలేదు. కీలకమైన సంస్కరణలు అమలు కాకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

నేడు మహబూబ్‌నగర్‌కు సీఎం కేసీఆర్‌..

ముఖ్యమంత్రి కేసీఆర్‌(cm kcr) నేడు మహబూబ్‌నగర్‌ వెళ్లనున్నారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తల్లి శాంతమ్మ ఇటీవల మరణించారు. ఈ ఉదయం జరిగే ఆమె దశదిన కర్మలో సీఎం పాల్గొంటారు.

వెళ్లి చరిత్ర పుస్తకాలు చదవండి

మహ్మద్‌ అలీ జిన్నాను ఉద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్థించకున్నారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌. ఈ విషయంలో తనపై విమర్శలు చేస్తున్న వారు మరోసారి చరిత్ర పుస్తకాలు తిరగేయాలని సూచించారు.

ఇరాక్​ ప్రధానమంత్రిపై హత్యాయత్నం

ఇరాక్​ ప్రధానమంత్రి ముస్తాఫా అల్​-కధామీపై హత్యాయత్నం జరిగింది. డ్రోన్​లతో ఆయన నివాసంపై దాడి చేసి, విఫలమయ్యారు దుండగులు. దీంతో ప్రధానికి ప్రాణహాని తప్పింది.

ఇకపై అలాంటి కథల్నే ఎంచుకుంటా

'రాజా విక్రమార్క' సినిమాతో(Rajavikramarka movie release date) నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానున్నారు హీరో కార్తికేయ. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో చిత్ర విశేషాలను చెప్పిన ఆయన తనకు కాబోయే భార్యను వేదికపైకి పిలిచి పరిచయం చేశారు. ఇకపై ప్రతి సినిమా కథాంశం ప్రేక్షకులు గర్వపడేలా ఎంచుకుంటానని చెప్పారు.

05:36 November 07

టాప్​న్యూస్​@6AM

  • 'ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పంట వేయొద్దు..'

యాసంగిలో ఎట్టిపరిస్థితుల్లో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి కోరారు. ఇది ప్రభుత్వ విధానమని, మినుము, వేరుశనగ, కంది, పెసర, ఇతర నూనెగింజలు, చిరుధాన్యాల పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రకటనపై విపక్ష నేతలు మండిపడ్డారు. కేంద్రంపై నెపం నెట్టకుండా రాష్ట్రమే ధాన్యం కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

  • త్వరలో ఆర్టీసీ ఛార్జీలు పెంపు?

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకునే దిశగా రంగం సిద్ధమైంది. పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్​.. గడిచిన నెలలోనే సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపారు. ఏ మేరకు పెంచాలనే అంశంపై కసరత్తు చేయాలని కూడా సూచించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఇవాళ రవాణాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగే అవకాశముంది.

  • డిసెంబర్​ 1 నుంచి.. 

డిసెంబరు ఒకటి నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లైసెన్స్‌ ఫీజు, దరఖాస్తు రుసుం మినహా పలు అంశాల్లో మార్పులు తీసుకొచ్చింది. ఒక వ్యక్తి ఒకే దరఖాస్తు అన్న విధానానికి స్వస్తి చెప్పి... ఎన్నైయినా వేసుకోవచ్చని అబ్కారీ శాఖ ప్రకటించింది. కొత్తగా మరో 350 దుకాణాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

  • అత్యాశే పెట్టుబడి

జనం అమాయకత్వం, అత్యాశే పెట్టుబడిగా సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అధిక లాభాలు ఆశచూపి కోట్లు కొల్లగొడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చంటూ.. కేటుగాళ్లు పన్నుతున్న వలకు చిక్కి అనేక మంది లక్షల్లో నగదు పోగొట్టుకుని గొల్లుమంటున్నారు.

  • మానసిక సమస్యలతో విద్యార్థులు సతమతం..!

త్వరలో ప్రాథమిక తరగతులనూ ప్రత్యక్షంగా ప్రారంభించేందుకు ప్రైవేటు పాఠశాలలు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో.. పిల్లల్లో పాఠశాలకు వెళ్లాలనే ఉత్సాహం రేకెత్తించేదెలా? పాఠాలు వినేలా ప్రోత్సహించేదెలా? మళ్లీ విద్యార్థిని పూర్వస్థితికి తీసుకువచ్చేదెలా? తదితర వివరాలను మనస్తత్వ విశ్లేషకురాలు డాక్టర్‌ చల్లా గీత వివరించారు.

  • కన్నతల్లిపైనే అత్యాచారం..

మద్యం, మాదకద్రవ్యాల మత్తులో కన్నతల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. తనకు సహకరించకపోతే గొంతు కోసేస్తానని బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. మానవజాతికి మచ్చ తెచ్చే ఈ ఘటన దీపావళి రోజు జరగ్గా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • తోకతో జన్మించిన శిశువు.. 

బ్రెజిల్​లో ఓ శిశువు అసాధారణ రీతిలో జన్మించాడు. ఆది మానవులకు ఉండేలా తోకతో పుట్టాడు. దీనిని చూసిన వైద్యుల ఆశ్చర్యపోయారు.

  • 'మా నేత జోలికొస్తే కళ్లు పీకేస్తా..'

హరియాణా భాజపా ఎంపీ అరవింద్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్​ను వ్యతిరేకించే వారి కళ్లు పీకి, చేతులు నరికేస్తానని రైతులను హెచ్చరించారు. ఛండీగఢ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో భాజపా ఎంపీ శర్మ తమ పార్టీ నేత మనీష్ గ్రోవర్ కు మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశారు.

  • అనుష్క జీవితాన్ని మార్చిన ఆ రోజు..

హీరోయిన్‌ అంటే రెండు సీన్లు, మూడు పాటలు మాత్రమే కాదు.. అవసరమైతే సినిమాను ఒంటిచేత్తో నడిపించగలదు అని నిరూపించిన నటి అనుష్క. తొలినాళ్లలో అందాలు ఆరబోసినా... ఆ తర్వాత 'జేజమ్మ', 'దేవసేన', 'రుద్రమదేవి', 'భాగమతి' వంటి అద్భుతమైన పాత్రలతో కట్టిపడేశారు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అనగానే.. అనుష్క పేరు గుర్తొచ్చేలా మాయ చేశారు. ఆదివారం(నవంబరు 7) అనుష్క పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె జర్నీతోపాటు మరికొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

  • 'కస్టమర్ల సమ్మతి లేకుండా'

సాంకేతిక సమస్యల కారణంగా రుణగ్రహీతల సమ్మతి లేకుండా ఈ ఏడాది మే నెలలో 84 వేల రుణాలను మంజూరు చేసినట్లు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ రుణాలు తమ అనుబంధ సంస్థ భారత్‌ ఫినాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ లిమిటెడ్‌(బీఎఫ్‌ఐఎల్‌) మంజూరు చేసినట్లు పేర్కొంది.

Last Updated : Nov 7, 2021, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.