ETV Bharat / sports

కివీస్​ X అఫ్గాన్​ పోరు: భారత అభిమానుల ఫన్నీ మీమ్స్..

author img

By

Published : Nov 7, 2021, 8:25 AM IST

ఆదివారం(నవంబర్ 7) న్యూజిలాండ్​తో తలపడనుంది అఫ్గానిస్థాన్(NZ vs AFG T20)​. ఈ మ్యాచ్​లో అఫ్గాన్​ గెలిస్తేనే భారత్​ సెమీస్​కు చేరే అవకాశం దొరుకుతుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్​ అభిమానులు నేడు జరగనున్న మ్యాచ్​ గురించి ఫన్నీ మీమ్స్ షేర్​ చేస్తున్నారు. అవి కడుపుబ్బా నవిస్తున్నాయి. వాటిని చూసేద్దాం..

nz vs afg
అఫ్గాన్, న్యూజిలాండ్

న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్‌(NZ vs AFG T20 match) గెలవాలి..! భారత్‌లో ఇప్పుడు కోట్లాది అభిమానుల ప్రార్థన ఇది. అఫ్గానిస్థాన్‌.. న్యూజిలాండ్‌ను ఓడిస్తే సెమీస్‌ చేరేందుకు భారత్‌కు మార్గం సుగమం అవుతుంది. గ్రూప్‌- 2 నుంచి పాకిస్థాన్‌ ఇప్పటికే సెమీస్‌ చేరుకోగా.. మరో స్థానం కోసం భారత్‌తో పాటు న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌ పోటీపడుతున్నాయి. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచిన కివీస్‌.. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాల చొప్పున సాధించిన భారత్‌, అఫ్గానిస్థాన్‌ చెరో 4 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ ఆఖరి మ్యాచ్‌లో అఫ్గాన్‌ గెలిస్తే న్యూజిలాండ్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఆఖరి మ్యాచ్‌లో నమీబియాను భారత్‌ ఓడిస్తే నెట్‌రన్‌రేట్‌ పరంగా ముందున్న భారత్‌ సెమీస్‌కు చేరుతుంది. అందుకే కివీస్‌ను అఫ్గాన్‌ ఓడించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.

captains
కోహ్లీ, విలియమ్సన్, నబి
memes
ఫన్నీ మీమ్స్
memes
మీమ్స్

ఇదే సందర్భమని భావించిన మీమర్స్‌(NZ vs AFG memes) తమ క్రియేటివిటీకి పనిచెప్పారు. అఫ్గాన్‌ ఆటగాళ్లను టీమిండియా ఆటగాళ్లు బుజ్జగిస్తున్నట్లు, దేశ ప్రజలంతా అఫ్గాన్‌వైపే ఉన్నట్లుగా మీమ్స్‌ రూపొందిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో ఇదే అఫ్గాన్‌పై భారత్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో 'అమ్మనాన్న.. ఓ తమిళ అమ్మాయి' సినిమాలోని ఫైట్‌సీన్‌ను స్ఫూఫ్‌గా చేసుకుని రూపొందించిన మీమ్‌ ఆకట్టుకుంటోంది. 'బాబ్బాబు.. ఇవేవీ మనసులో పెట్టుకోకురా. న్యూజిలాండ్‌పై గెలవరా' అంటూ రూపొందించిన మీమ్‌ నవ్వులు తెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్‌మీడియాలో చాలా మీమ్స్‌ ట్రెండ్‌ అవుతున్నాయి. అవేంటో చూసేయండి..

afg vs nz memes
అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మీమ్

ఇదీ చదవండి:

T20 World Cup: కివీస్​తో పోరు.. అఫ్గాన్​ ఏం చేస్తుందో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.