ETV Bharat / bharat

భాజపా కార్యకర్త దారుణ హత్య.. వారి పనేనా?

author img

By

Published : Nov 7, 2021, 3:47 PM IST

బంగాల్​ పూర్వ మేదినిపుర్​ జిల్లాలో ఓ భాజపా కార్యకర్త దారుణ హత్యకు(bjp worker death) గురయ్యాడు. టీఎంసీ సభ్యులు గూండాలతో తమ కార్యకర్తను చంపించారని భాజపా ఆరోపించింది(bjp worker killed in bengal). ఆ ఆరోపణలను టీఎంసీ కొట్టిపారేసింది.

BJP leader found dead in West Bengal
BJP leader found dead in West Bengal

బంగాల్​లో భాజపా కార్యకర్త శంభు మైతి దారుణ హత్యకు గురయ్యాడు(bjp worker death). పూర్వ మేదినిపుర్​ జిల్లా భగవన్​పుర్​ ప్రాంతంలోని కెలేఘై నది ఒడ్డున ఆయన మృతదేహం ఆదివారం కనిపించింది. 36ఏళ్ల శంభు శరీరంపై తీవ్రమైన కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. శంభుపై తృణమూల్​ కాంగ్రెస్​ సభ్యులు దాడి చేసి హత్య చేశారని భాజపా ఆరోపించింది(bengal bjp news).

"ఆర్ధరాత్రి సమయంలో టీఎంసీకి చెందిన గూండాలు.. మహమ్మద్​పుర్​ గ్రామంలోని మైతి ఇంటికెళ్లారు. ఆయనపై దాడికి పాల్పడ్డారు. మైతిని హత్య చేశారు. ఎన్నికలు ముగిసి 8నెలలు గడిచినా, భాజపా సభ్యులను టీఎంసీ వెంటాడి మరీ హత్య చేస్తోంది. రాష్ట్రంలో విపక్షాలకు స్వేచ్ఛ ఇవ్వాలని టీఎంసీ అనుకోవడం లేదు. హత్యారాజకీయాలకు పాల్పడుతోంది. ఈ ఘటనను భాజపా తీవ్రంగా పరిగణిస్తోంది. ఘటనకు గల బాధ్యులను పోలీసులు పట్టుకోకపోతే.. మేము నిరసనకు దిగుతాం."

-- రవీంద్రనాథ్​ మైతి, భాజపా ఎమ్మెల్యే.

రవీంద్రనాథ్​ ఆరోపణలను టీఎంసీ తిప్పికొట్టింది. భాజపాలో అంతర్గత కలహాలు ఉన్నాయని, శంభు వాటికి బాధితుడు అని విమర్శించింది. ఆ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడింది.

తాజా ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి:- జైలుకు నిప్పంటించిన ఖైదీలు- 30మంది పోలీసులకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.