Police accident today: లారీని ఢీకొన్న పోలీసు వాహనం.. ఏఎస్సై దుర్మరణం
Updated on: Nov 7, 2021, 1:53 PM IST

Police accident today: లారీని ఢీకొన్న పోలీసు వాహనం.. ఏఎస్సై దుర్మరణం
Updated on: Nov 7, 2021, 1:53 PM IST
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపూర్ మండలంలోని గాంధీనగర్ వద్ద జరిగిన ప్రమాదంలో(Police accident today) గాయపడిన ఏఎస్సై హరిలాల్ మృతి చెందారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆగి ఉన్న ఇసుక లారీని పెట్రోలింగ్ వాహనం ఆదివారం ఉదయం ఢీకొంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలంలోని గాంధీ నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో(Police accident today) గాయపడిన రేగొండ ఏఎస్సై హరిలాల్ నాయక్ మృతిచెందారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆదివారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో హైవే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు వాహనం... ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్సైని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు పోలీసులు తెలిపారు. వరంగల్‌లోని శివనగర్‌కు చెందిన హరిలాల్ నాయక్... మూడేళ్లుగా రేగొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఏఎస్సై మృతి పట్ల పలువురు పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో(Police accident today) గాయపడిన మిగతా ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు.
ఇదీ చదవండి: Singer Mounika yadav Family: ‘సామీ.. సామీ..’ కోసం ఏడాది ఎదురుచూశా!'
