ETV Bharat / sports

కోచ్​గా మారతానని చెప్పిన బ్రావో.. గేల్​ సరదా రిటైర్మెంట్!

author img

By

Published : Nov 7, 2021, 2:36 PM IST

వెస్టిండీస్​ మాజీ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో(DJ Bravo retirement) క్రికెట్​పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. క్రికెట్​ ఆడటం పూర్తిగా మానేసిన తర్వాత తప్పకుండా కోచింగ్​ బృందంలో చేరతానని తెలిపాడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్.. తాను ఇంకా రిటైర్మెంట్​(Chris Gayle news) ప్రకటించలేదని తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

bravo, gayle
డ్వేన్ బ్రావో, క్రిస్ గేల్

టీ20 ప్రపంచకప్​లో భాగంగా వెస్టిండీస్​ చివరి మ్యాచ్​ అనంతరం అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పాడు ఆల్​ రౌండర్ డ్వేన్ బ్రావో(Bravo Retirement). ఈ నేపథ్యంలో తన తదుపరి కార్యాచరణ ఏమిటన్నదానిపై స్పష్టత ఇచ్చాడు.

"క్రికెట్​ ఆడటం పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్న రోజు తప్పనిసరిగా కోచింగ్​ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటాను. క్రికెట్​ నుంచి మాత్రం దూరంగా వెళ్లిపోయే సమస్యే లేదు. నేను కోరుకున్న జీవితాన్ని నాకు ఇచ్చింది క్రికెటే. అందుకే జట్టుకు తిరిగివాల్సింది చాలా ఉందనేది నా అభిప్రాయం."

-- డ్వేన్ బ్రావో, వెస్టిండీస్ మాజీ ఆల్​రౌండర్.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్​కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించానని ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడతానని చెప్పాడు బ్రావో.

ఇప్పటివరకు 40 టెస్టు​లు ఆడిన బ్రావో.. 2,200 పరుగులు చేశాడు. 86 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 2,968 పరుగులు చేసి 199 వికెట్లు తీశాడు. టీ20 మ్యాచ్​ల్లో 1,245 పరుగులు చేసి, 78 వికెట్లు పడగొట్టాడు.

రిటైర్మైంట్​ ఇంకా ప్రకటించలేదు: గేల్

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup) భాగంగా శనివారం(నవంబర్ 6) జరిగిన మ్యాచ్​లో వెస్టిండీస్​పై విజయం సాధించి సెమీస్​ అవకాశాన్ని దక్కించుకుంది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్​ నేపథ్యంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రిటైర్మెంట్(gayle retirement news)​ ప్రకటించబోతున్నట్లే ప్రవర్తించాడు. కానీ, సరదా కోసమే అలా చేశానని తర్వాత చెప్పుకొచ్చాడు.

"అంతర్జాతీయ క్రికెట్​కు ఇంకా వీడ్కోలు చెప్పలేదు. సరదా కోసమే అలా చేశాను. జమైకా వేదికగా సొంత అభిమానుల సమక్షంలో చివరి మ్యాచ్​ ఆడాకే ఘనంగా వీడ్కోలు పలకుతాను. నిజానికి నాకు ఇంకో ప్రపంచకప్​ కూడా ఆడాలని ఉంది. కానీ, బోర్డు ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు."

-- క్రిస్ గేల్, వెస్టిండీస్ క్రికెటర్.

తనకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు గేల్. తన చివరి మ్యాచ్ కోసం విండీస్ బోర్డు తగిన ఏర్పాట్లు చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:

రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ ఆల్​రౌండర్

విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ రిటైర్మెంట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.