ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

author img

By

Published : Nov 6, 2021, 5:59 AM IST

Updated : Nov 6, 2021, 10:04 PM IST

etv bharat latest top news
etv bharat latest top news

21:56 November 06

టాప్​న్యూస్​@10PM

  • హైకోర్టు తీర్పుతో పోలీసులు అలర్ట్​.. 

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో వాహనాలు సీజ్‌ చేయకూడదని నిన్న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు పోలీసులు తిరిగి ఇచ్చేస్తున్నారు. 

  • అధికారులూ జాగ్రత్త..!

పోడు భూములపై హక్కు పత్రాల పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఏదైనా అక్రమాలు జరిగితే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. అటవీ భూములు ఆక్రమించకుండా ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 

  • రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు రాబోతోంది'

రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు రాబోతోందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి (Kishan Reddy Comments) జోస్యం చెప్పారు. హుజూరాబాద్ బై ఎలక్షన్ కీలక మార్పులు తీసుకురాబోతోందన్నారు. ఈటల నిజాయతీతో పనిచేశారని కొనియాడారు.

  •  భార్యపై పోలీసులకు భర్త ఫిర్యాదు.. ఎందుకంటే..?

టీ20 ప్రపంచకప్​లో భాగంగా భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓటమిని అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆ సమయంలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ మహిళ పాక్​ గెలుపుపై సంబరాలు చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే?

టీ20 ప్రపంచకప్​లో సెమీస్​ బెర్తు కోసం జరుగుతున్న పోరులో ​దక్షిణాఫ్రికా అదరగొట్టింది. ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో ప్రోటీస్​ బ్యాటర్స్ డస్సెన్​, మార్​క్రమ్ చెలరేగిన వేళ 189 పరుగులు చేసింది.

20:44 November 06

టాప్​న్యూస్​@9PM

  • 2023లో  ప్రజలు పాతరేస్తారు

హుజూరాబాద్​లో భారీ మెజార్టీతో గెలుపొందిన ఈటల రాజేందర్​ను భాజపా నాయకులు, శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ పేరుతో... శామీర్​పేట నుంచి గన్​పార్క్​ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్​పై ఈటల రాజేందర్​ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2023లో భాజపానే అధికారుల చేపట్టనుందని ధీమా వ్యక్తం చేశారు.

  •  తప్పు చేస్తే ఉద్యోగాలు ఊడతాయ్‌..!

పోడు భూములపై హక్కు పత్రాల పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఏదైనా అక్రమాలు జరిగితే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. అటవీ భూములు ఆక్రమించకుండా ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 

  •  ఆయనకు వాటిపైనే ప్రేమ ఎక్కువ 

ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం అవలంభిస్తోన్న నిర్లక్ష్య వైఖరిపై టీపీసీసీ రేవంత్​రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలిన రైతు బీరయ్య చావుకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు తెరవటాన్ని పక్కనపెట్టి.. కొత్త మద్యం దుకాణాలు తెరిచేందుకు సర్కారు సిద్ధమవుతోందని దుయ్యబట్టారు.

  • మూడు రోజుల్లో 39 మంది..!

బిహార్​లో కల్తీ మద్యం సేవించిన ఘటనలో 72 గంటల వ్యవధిలో మృతుల సంఖ్య 39కి చేరినట్లు అధికారులు తెలిపారు. మరికొంతమంది కంటిచూపు మందగించినట్లు పేర్కొన్నారు.

  • విధ్వంసానికి విశ్రాంతి..!

వెస్టిండీస్​ విధ్వంస వీరుడు క్రిస్​ గేల్ క్రికెట్​కు రిటైర్మెంట్​ దాదాపు ప్రకటించేశాడు. టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో ఔటై వెనుదిరిగే సమయంలో గేల్​కు స్టాండింగ్​ ఒవేషన్​ ఇచ్చారు సహచర క్రికెటర్లు.

19:47 November 06

టాప్​న్యూస్​@8PM

  •  తప్పు చేస్తే ఉద్యోగాలు ఊడతాయ్‌..!

పోడు భూములపై హక్కు పత్రాల పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఏదైనా అక్రమాలు జరిగితే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. అటవీ భూములు ఆక్రమించకుండా ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 

  •  వాటిపై ఉన్న ప్రేమ.. రైతుల మీద లేదు

ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం అవలంభిస్తోన్న నిర్లక్ష్య వైఖరిపై టీపీసీసీ రేవంత్​రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలిన రైతు బీరయ్య చావుకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు తెరవటాన్ని పక్కనపెట్టి.. కొత్త మద్యం దుకాణాలు తెరిచేందుకు సర్కారు సిద్ధమవుతోందని దుయ్యబట్టారు.

  • వైట్‌నర్‌ మత్తులో చంపేశాడు

హైదరాబాద్ నాంపల్లిలో దారుణం జరిగింది. వైట్‌నర్‌ మత్తులో యాచకుడిని మరో యాచకుడు కత్తితో పొడిచి చంపాడు. 

  • హీరో​ సమాధి ఎదుట పెళ్లి.. చివరకు..!

కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్​పై ఎనలేని అభిమానం ఉన్న ఓ ప్రేమజంట.. ఆయన​ సమాధి(Puneeth rajkumar death) ముందే వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకుంది. కానీ సమాధి ముందు వివాహానికి అక్కడి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

  • సెమీస్​కు కంగారూలు.!

వెస్టిండీస్​పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది కంగారూ జట్టు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్​ అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.

18:42 November 06

టాప్​న్యూస్​@7PM

  •  యాసంగిపై మంత్రి కీలక ప్రకటన

ఈ యాసంగిలో రైతులు వరి వేయవద్దని (Niranjan Reddy On Rice Crop) మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. యాసంగిలో వరి బదులు ఇతర పంటలు వేసుకోవాలని మంత్రి సూచించారు.

  •  'మానేరు'పై కీలక ఆదేశాలు

మానేరు రివర్ (Maneru River) ఫ్రంట్​ డెవలప్​మెంట్ పనులపై బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

  •  మొదటిసారి భాజపా కార్యాలయానికి..!

హుజూరాబాద్​ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత.. ఈటల మొదటిసారిగా భాజపా కార్యాలయానికి(Etela Rajender Rally) బయలుదేరారు. ఈ సందర్భంగా నగరంలో తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ(Etela Rajender Rally) నిర్వహించారు. శామీర్​పేట్​ నుంచి గన్​పార్కు వరకు ర్యాలీ కొనసాగింది. గన్​పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు.

  • ఆ మూడురోజులు  రద్దు

తిరుమలలో ఈ నెల 13, 14, 15న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు (VIP Break Darshan cancelled at tirumala news). ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. 

  • 'మోదీజీ.. ఆ క్లీన్​చిట్​ను వెనక్కి తీసుకోండి'

ప్రధాని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్​ మండిపడింది. సరిహద్దుల్లో చైనా చొరబడలేదని మోదీ క్లీన్​ ఇచ్చారని.. కానీ అరుణాచల్​ప్రదేశ్​లో ఏకంగా గ్రామాన్నే నిర్మించిందని అమెరికా నివేదిక బయటపెట్టిందని పేర్కొంది. ఈ విషయంలో క్లీన్​ చిట్​ను మోదీ వెనక్కి తీసుకుని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేసింది.

17:50 November 06

టాప్​న్యూస్​@6PM

  •  గన్​పార్కు వద్ద ఈటల నివాళి

హుజూరాబాద్​ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత.. ఈటల మొదటిసారిగా భాజపా కార్యాలయానికి(Etela Rajender Rally) బయలుదేరారు. ఈ సందర్భంగా నగరంలో తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ(Etela Rajender Rally) నిర్వహించారు. శామీర్​పేట్​ నుంచి గన్​పార్కు వరకు ర్యాలీ కొనసాగింది. గన్​పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు.

  • వారికి ఫోన్​లో ధైర్యం చెప్పిన రేవంత్..!

కామారెడ్డి జిల్లాలో ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలిన రైతు బీరయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. టీపీసీసీ రేవంత్​రెడ్డి.. బీరయ్య కుమారునితో ఫోన్​లో మాట్లాడారు్. అధైర్య పడొద్దని.. కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

  • 'వారితో జాగ్రత్త.. '

దేశ ప్రజలను విడగొట్టేందుకు భాజపా, ఆరెస్సెస్​లు ఎంత దూరమైనా వెళ్తాయని రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్ (Rakesh Tikait news today) ఆరోపించారు. వీరితో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రైతులతో చర్చలు (Farmers Protest news) జరపాలని కేంద్రానికి సూచించారు.

  • అగ్ర హీరోల సినిమా అప్డేట్స్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో భీమ్లా నాయక్, పుష్ప, 3 రోజెస్, గణ్​పత్, మా కథలు చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

  • ఆసీస్​ లక్ష్యం 158

వెస్టిండీస్​తో గ్రూప్​ దశ ఆఖరి మ్యాచ్​లో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్​వుడ్ చెలరేగిపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన విండీస్​.. 157 పరుగులు చేసింది. పొలార్డ్​ రాణించాడు.

16:54 November 06

టాప్​న్యూస్​@5PM

  • ఆ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమలలో మూడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ద‌క్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం దృష్ట్యా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. 

  •  'రేపటి నుంచి నా తడాఖా ఏంటో చూపిస్తా..' 

హుజూరాబాద్​ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్​ ఘోర పరాజయంపై తనదైన శైలిలో చురకలంటించారు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి(Komatireddy Venkat Reddy Comments). తమ నాయకులకు ప్రజల్లో మంచి క్రేజ్​ ఉందనుకున్నానని.. లేదంటే హుజూరాబాద్​ ప్రచారానికి తానే వెళ్లేవాడినని ఎద్దేవా చేశారు.

  •  ఆ రాష్ట్రంలో స్కూల్ పిల్లల కోసం కొత్త పథకం

విద్యార్థుల కనీస ఖర్చులైన యూనిఫాం, షూలు, సాక్సుల కోసం తల్లిదండ్రులకు యూపీ ప్రభుత్వం (Yogi Adityanath news) చేదోడు అందిస్తోంది. ప్రతి విద్యార్థికి రూ.1,100 చొప్పున తల్లిదండ్రుల ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. దీని వల్ల 1.80 కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది.

  • మాజీ హోంమంత్రికి జ్యుడీషియల్ కస్టడీ

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ(Anil Deshmukh News) విధించింది ముంబయి కోర్టు. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈనెల 2న అనిల్ దేశ్​ముఖ్​ను.. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్​ చేసింది.

  • వారి గురించి అందరికీ తెలుసు.. !

టీమ్​ఇండియాపై ఫిక్సింగ్​ ఆరోపరణలు చేస్తున్న పాకిస్థాన్​ అభిమానులపై విరుచుకుపడ్డాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh News). తాము గెలిస్తే న్యాయంగా ఆడుతున్నామని, ఇతరులు గెలిస్తే అక్రమంగా గెలిచారంటూ చేసే వ్యాఖ్యలు హీనమైనవని అన్నాడు.

15:49 November 06

టాప్​న్యూస్​@4PM

  • ఆఫ్రికాలో ఘోర విషాదం

ఆఫ్రికా దేశం సియెర్రా లియోన్​లో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని ఫ్రీటౌన్​లో ఆయిల్ ట్యాంకర్ పేలడం వల్ల 84 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ విపత్తు నిర్వహణ ఏజెన్సీ డైరెక్టర్ మొహమద్ లమ్రేన్ బా వెల్లడించారు. బాధితులకు చికిత్స కొనసాగుతోందని చెప్పారు.

  • ఆ గుర్తింపు దేశానికే గర్వకారణం

కరోనాపై విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి సూచించారు. కొవాగ్జిన్​కు డబ్లూహెచ్​వో గుర్తింపు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ప్రపంచంలోనే ఉత్తమమైన వాక్సిన్‌ను మన తయారు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు.

  •  మోదీ ''రివర్స్​ గేర్'​

దేశంలో వంటగ్యాస్ ధరల పెంపునకు(LPG News Today) సంబంధించి కేంద్రంపై కాంగ్రెస్​నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News) విమర్శలు గుప్పించారు. కేంద్ర వైఖరితో లక్షలాదిమంది కట్టెలపొయ్యికి పరిమితమవుతున్నారని ఆరోపించారు.

  • 'మీ కోసం మా భూములు ఇచ్చేదే లేదు..'

తెరాస ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన విజయగర్జన (Trs Vijayagarjana) సభకు తమ భూములు ఇవ్వమంటూ హనుమకొండ జిల్లా రైతులు తెగేసి చెబుతున్నారు. సభ కోసం తమ భూములను నాశనం చేసుకోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

  • స్టార్​ హిరో 'AAA సినిమాస్'

ఐకాన్ స్టార్ 'AAA సినిమాస్' థియేటర్​కు శనివారం పూజా కార్యక్రమం జరిగింది. సరికొత్త టెక్నాలజీతో ఇది ప్రేక్షకుల్ని అలరించనుంది.

14:36 November 06

టాప్​న్యూస్​@3PM

  •  10కి చేరిన మృతుల సంఖ్య

మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​ జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఐసీయూలో మంటలు చెలరేగి 10 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.

  • వాటి ఆధారంగానే కొత్త దుకాణాలు.. !

తెలంగాణలోని మందుబాబులకు శుభవార్త. రాష్ట్రంలో మరిన్ని మద్యం దుకాణాలు తీసుకువచ్చే యోచనలో ఎక్సైజ్​శాఖ చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ అధికారులతో కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్‌శాఖ అధికారులతో సర్ఫరాజ్ అహ్మద్ వీడియోకాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. 

  • చీకటి వేళ ఓ సుందర దృశ్యం

కొండపైన దీపాల స్వర్ణ కాంతుల్లో శ్రీలక్ష్మి నరసింహస్వామి క్షేత్రం(Yadadri temple latest news) కాంతులీనింది. కొండకింద విద్యుత్ దీపాల కాంతుల్లో యాదగిరిగుట్ట పట్టణం మెరిసిపోయింది. దీపావళి సందర్భంగా చీకటి వేళ ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

  • యాంకర్​తో ఆమె​ స్పెషల్​ సాంగ్​

యాంకర్, నటి లాస్య(lasya new videos) ఓ స్పెషల్​ వీడియో సాంగ్​తో ఫ్యాన్స్​ను అలరించారు. ఇందులో అమృత ప్రణయ్(amrutha pranay latest updates) కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆమె డ్యాన్స్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్​గా మారింది.

  • 'వారిపైనే ఒత్తిడి'

టీ20 ప్రపంచకప్​ సెమీ ఫైనల్​ రేసులో గ్రూప్-2 నుంచి ఎవరు నిలుస్తారో అనే విషయం ఆదివారం తెలియనుంది. టీమ్ఇండియా నాకౌట్​కు చేరుకోవాలంటే న్యూజిలాండ్​పై అఫ్గానిస్థాన్ గెలవాల్సి ఉంటుంది. ఈ రెండు జట్లు కూడా సెమీస్ రేసులో ఉన్నాయి. దీంతో ఆదివారం నాటి మ్యాచ్​లో భారత్ కంటే అఫ్గాన్, కివీస్​లపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని తెలిపాడు మాజీ క్రికెటర్ గావస్కర్.

14:03 November 06

టాప్​న్యూస్​@2PM

  • నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి

రంగారెడ్డి జిల్లా కందుకూరులో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి ఏడాదిన్నర పాప మృతి చెందింది. ఇంట్లో ఉన్న చిన్నారి ఆడుకుంటూ నీటి బకెట్‌ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు బకెట్‌లో పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదలింది. 

  • నకిలీ పాన్​కార్డుల తయారీ

మహారాష్ట్రలో నకిలీ పాన్​కార్డ్​లు సృష్టిస్తున్న ఓ వ్యక్తిని (fake PAN card maker) పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన పాల్ఘర్ జిల్లా వాలివ్ ప్రాంతంలో జరిగింది.

  • మ్యూజిక్​ కన్సర్ట్​లో ​తొక్కిసలాట

ఓ మ్యూజిక్​ కన్సర్ట్​లో జరిగిన తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన అమెరికాలో టెక్సాస్​లో జరిగింది. ఈ షోకు సుమారు 50వేల మంది వచ్చి ఉంటారని అధికారులు తెలిపారు.

  • కోహ్లీ పుట్టినరోజు వేడుకలు

శుక్రవారం విరాట్ కోహ్లీ 33వ పుట్టినరోజు (virat kohli birthay). ఈ సందర్భంగా స్కాంట్లాండ్(ind vs sco t20)​తో మ్యాచ్ ముగిశాక డ్రెస్సింగ్​ రూమ్​లో విరాట్ బర్త్​ డే సెలబ్రేషన్స్ జరిగాయి. మెంటార్ ధోనీ దగ్గరుండి కోహ్లీ చేత కేక్ కట్ చేయించాడు.

  • మాస్​ లుక్​లో చిరు​..

అగ్రకథానాయకుడు చిరంజీవి(chiranjeevi bobby film) నటించనున్న కొత్త సినిమా #MEGA154(వర్కింగ్​ టైటిల్​) షూటింగ్​ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిరు మాస్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

12:59 November 06

టాప్​న్యూస్​@1PM

  • ఐసీయూలో మంటలు- ఆరుగురు మృతి!

మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​ జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఐసీయూలో మంటలు చెలరేగి ఆరుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది.

  • ఎమ్మెల్యేకు చేదు అనుభవం

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామస్థులు ఎమ్మెల్యే కాన్వాయ్​ను అడ్డగించారు. రోడ్లు నిర్మించకపోతే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.

  • పాలసీలో ఈ రైడర్లు ఉంటే

చాలా ఆరోగ్య పాలసీలు కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలను, ప్రమాదాలను పాలసీ పరిధి నుంచి మినహాయిస్తాయి. ఈ నేపథ్యంలో పాలసీలోని పరిమితులను అధిగమించేందుకు కాస్త ప్రీమియం ఎక్కువైనా స‌రే చెల్లించి అదనపు రైడర్లను తీసుకుంటే మేలని సూచిస్తున్నారు నిపుణులు.

  • జడేజా ఫన్నీ రిప్లై

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​లో భాగంగా స్కాట్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా(ind vs sco t20). మ్యాచ్ ముగిశాక మీడియా ముందు మాట్లాడటానికి వచ్చిన స్పిన్నర్ జడేజాకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. దానికి తనదైన శైలిలో సమాధానమిచ్చాడు జడ్డూ.

  • యాంకర్​ సుమ రీఎంట్రీ

యాంకర్​ సుమ రీఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమా టైటిల్​తో కూడిన మోషన్​ పోస్టర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి విజయ్​కుమార్​ కలివరుపు దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి సంగీతమందిస్తున్నారు.

11:51 November 06

టాప్​న్యూస్​@12NOON

  • పేకాట కేసులో ఐదుగురు అరెస్టు

హైదరాబాద్‌ బేగంపేటలో దీపావళి ధమాక పేరుతో భారీస్థాయిలో పేకాట శిబిరాన్ని నిర్వహించిన ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు అరవింద్ అగర్వాల్ ఇంట్లో రూ.12,65,000 స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్‌మెంట్‌లోంచి శబ్దాలు వస్తున్నాయంటూ స్థానికులు చేసిన ఫిర్యాదుతో... పోలీసులు దాడి చేశారు. 

  • తాగి వేరే ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ

అనుకోకుండా తన ఇల్లు అనుకొని మరో ఇంట్లోకి ప్రవేశించిన ఓ మాజీ ఎంపీపై దాడి జరిగింది. ఆయనను దొంగ అని భావించిన ఇంటివారు చితకబాదారు. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించారు.

  • అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు

అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. కొత్తగా మూడు రిమోట్​ సెన్సింగ్​ శాటిలైట్లను(remote sensing satellite) విజయవంతంగా ప్రయోగించినట్లు తెలిపింది. పశ్చిమ చైనాలోని సిచౌన్​ ప్రావిన్స్​, జిచాంగ్​ శాటిలైట్​ లాంఛ్​ కేంద్రం నుంచి ఈ ప్రయోగం(china satellite news) చేపట్టినట్లు వెల్లడించింది.

  • ఈ వెబ్‌సైట్లు చూశారంటే..

తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. ఈ సినిమా డైలాగ్ ఇప్పుడు ఎందుకు అంటారా. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో మనకు తెలియని బోలెడు విషయాలున్నాయి. కొత్తగా ఎంత తెలుసుకున్నా.. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. అలా మీకు తెలియని.. ఉపయోగకరమైన కొన్ని వెబ్‌సైట్ల గురించి చెప్పబోతున్నాం. మరి ఆ వెబ్‌సైట్లు ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం.

  • 'ఓ లక్ష్యం' సాంగ్​ విడుదల

నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం 'లక్ష్య'. ఆర్చరీ క్రీడా నేపథ్యంతో తెరకెక్కిన చిత్రమిది. జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. శనివారం ఈ మూవీలోని 'ఓ లక్ష్యం' సాంగ్​ విడుదలైంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శౌర్య సిక్స్​ ప్యాక్స్​తో కనిపించనున్నారు.

10:54 November 06

టాప్​న్యూస్​@11AM

  • క్రిప్టో కరెన్సీ పేరిట మోసం

క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి.. వాళ్ల ఖాతాల్లోని రూ.50లక్షలు నిలుపుదల చేశారు. నిందితుల నుంచి చెక్‌బుక్‌లు, 6 ఏటీఎం కార్డులు, 6 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. 

  • భారీగా పెరిగిన పసిడి ధర

బంగారం (Gold Rate Today) ధర భారీగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • ఆలయాలు మూసివేత!

శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కేదార్​నాథ్​ ఆలయాన్ని(kedarnath temple closed) మూసివేశారు(char dham yatra). వచ్చే ఆరు నెలల పాటు కేదార్​నాథుడికి ఓంకారేశ్వర్​లో పూజలు జరగనున్నాయి. అలాగే.. యమునోత్రి మందిరాన్ని ఈ రోజు మధ్యాహ్నం మూసివేయనున్నారు.

  • స్కాట్లాండ్​తో మ్యాచ్

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో భాగంగా స్కాట్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా(ind vs sco t20). ఈ క్రమంలో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.

  • పునీత్​ స్ఫూర్తితో కళ్ల దానం

మరణానంతరం(puneeth rajkumar eye transplant) తన కళ్ల ద్వారా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపిన కన్నడ పవర్​స్టార్​ పునీత్​ రాజ్​కుమార్​ను ఆదర్శంగా తీసుకున్న అభిమానులు ఆయన బాటలోనే నడుస్తున్నారు. తమ నేత్రాలను దానం చేసేందుకు వందలమంది ఫ్యాన్స్​ ఆస్పత్రి బయట క్యూ కడుతున్నారు.

09:54 November 06

టాప్​న్యూస్​@10AM

  • దేశంలో కొత్తగా కరోనా కేసులివే!

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య(Coronavirus update) భారీగా తగ్గింది. తాజాగా 10,929 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా​ ధాటికి మరో 392 మంది మృతి చెందారు.

  • క్షుద్రపూజల కోసమే చంపేశారా?

పంజాగుట్ట పీఎస్ పరిధిలోని చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఎక్కడో చంపేసి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ పడేసి ఉంటారనే అనుమానంతో సమీపంలోని దాదాపు వందకుపైగా కెమెరాల పుటేజీ పరిశీలించినా ఎలాంటి పురోగతీ కనిపించలేదు.

  • సరైన విరుగుడు అప్పుడే!

గడచిన ఏడాదిన్నరలోనే లీటరు (petro products price) పెట్రోలుపై రూ.36, డీజిలుపై రూ.26.58 వంతున ఎగబాకిన ధరలు జనజీవనాన్ని ఛిద్రం చేశాయి. సామాన్యులకు సాంత్వన చేకూర్చేలా- పెట్రో ఉత్పత్తులకు జీఎస్టీని వర్తింపజేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకుసాగాలి. పోనుపోను పెనుభారమవుతున్న చమురు దిగుమతి వ్యయాన్ని (petroleum price) అదుపు చేయడంలో భాగంగా- పునరుత్పాదక ఇంధన వనరులను సమధికంగా సమకూర్చుకోవాలి!

  • ప్రేమ వ్యవహారం.. రాహుల్ చెప్పేశాడు!

టీమ్ఇండియా క్రికెటర్ రాహుల్(kl rahul news), బాలీవుడ్ నటి అతియా శెట్టి ప్రేమ వ్యవహారం(kl rahul athiya shetty love story)పై ఇన్నాళ్లు పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా రాహుల్ చేసిన ఓ ట్వీట్ వీరి లవ్ అఫైర్​పై ఓ క్లారిటీ ఇచ్చింది.

  • అందాల యువరాణి.. ఈ శివాని

శివాని నారాయన్​.. తమిళ 'బిగ్​బాస్​' సీజన్​ 4లో పాల్గొని యూత్​లో క్రేజ్​ సంపాదించుకుంది. సోషల్​మీడియాలో హాట్​ ఫొటోలను షేర్​ చేస్తూ కుర్రోళ్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బుల్లితెరపై పలు సీరియళ్లలోనూ అలరించింది. త్వరలోనే కమల్​హాసన్​ నటిస్తున్న 'విక్రమ్' సినిమాతో వెండితెరకు పరిచయం కానుంది. ఓ సారి ఆమె ఫొటోలపై లుక్కేద్దాం..
 

08:56 November 06

టాప్​న్యూస్​@9AM

  • మళ్లీ భూముల విక్రయం

ఉప్పల్‌ భగాయత్‌లో మిగిలిన భూములనూ విక్రయించేందుకు హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ లేఅవుట్లకు సమీపంలో పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతుండడంతో ఈసారి దాదాపు రూ.800 కోట్లకు పైగా రాబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • కరోనా మరణముప్పు రెట్టింపు

ఒక ప్రత్యేకమైన జన్యువు కారణంగా కరోనాతో ఊపిరితిత్తుల వైఫల్యం తద్వారా మరణం (genetics cause to covid death) సంభవిస్తున్నాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. దక్షిణాసియా ప్రాంత మూలాలున్న 60% మందిలో, ఐరోపాలోని 15% మందిలో ఇది ఉంటున్నట్టు గుర్తించారు.

  • వ్యక్తిగత గోప్యతకు తూట్లు

దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి పరిరక్షించడమే లక్ష్యంగా వ్యక్తిగత సమాచార పరిరక్షణ(పీడీపీ) బిల్లును(Personal data protection bill) కేంద్రం 2018లో తెరపైకి తెచ్చింది. మూడేళ్లు గడుస్తున్నా ఇది పార్లమెంటు గడప దాటలేదు. గతేడాది ఇది సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ముందుకు వెళ్ళింది. ఆ కమిటీ వివిధ రంగాల నిపుణులు, భాగస్వామ్య సంస్థలతో చర్చించి బిల్లులో అనేక మార్పుచేర్పులు చేసింది. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనైనా బిల్లు చట్టరూపం దాలుస్తుందా? అనేది అనుమానమే!

  • ఏం జరుగుతుందో చూద్దాం: కోహ్లీ

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​లో భాగంగా శుక్రవారం స్కాట్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా(ind vs sco t20). దీంతో నెట్​ రన్​రేట్ మెరుగుపర్చుకుంది. ఇక తర్వాత మ్యాచ్​లో న్యూజిలాండ్​ను అఫ్గానిస్థాన్ ఓడిస్తే కోహ్లీసేన సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించాడు టీమ్ఇండియా సారథి కోహ్లీ.

  • అంతర్జాతీయ చిత్రంతో సినిమాటోగ్రాఫర్

ఇప్పటికే పలు సినిమాలకు(cinematographer ravi) దర్శకత్వం వహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్​ రవి కె.చంద్రన్(bheemlanayak cinematographer)​.. ఈ సారి అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. 'తమర' అనే క్రేజీ ప్రాజెక్టును రూపొందించబోతున్నట్లు ప్రకటించారు.

07:51 November 06

టాప్​న్యూస్​@8AM

  • బ్రిటిష్‌ గవర్నర్‌ తలకే వెలగట్టి!

తన తలకు బ్రిటిష్‌ ప్రభుత్వం వెలకడితే... పోటీగా బ్రిటిష్‌ గవర్నర్‌ తలకే వెలకట్టిన ధీరుడు! ఆదివాసీలను, రైతులను ఏకంచేసి ఆంగ్లేయులను బెదరగొట్టిన తొలితరం సాయుధ వీరుడు. అందుకే పట్టుబడితే అండమాన్‌కు కూడా కాకుండా సుదూరంగా యెమన్‌ దేశానికి తరలించింది బ్రిటిష్‌ సర్కారు. ఆంగ్లేయుల గుండెల్లో అంతగా నిద్రపోయిన గెరిల్లా యుద్ధతంత్రుడు వాసుదేవ్‌ బల్వంత్‌ ఫాడ్కే!

  • వ్యాపారవేత్తలుగా మారుస్తాం

ఒకటి రెండేళ్లు కష్టపడి, స్థిరత్వం సాధిస్తే చాలు.. పెట్టుబడులే వెతుక్కుంటూ వస్తాయని టి-హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(T-Hub CEO) మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. 130 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశ మార్కెట్​ను ఆకర్షించగలిగితే చాలు అని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే రెండుమూడేళ్లు అంకుర సంస్థలకు ఎంతో అనుకూల కాలం అని పేర్కొన్నారు.

  • పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా?

18 ఏళ్ల లోపు పిల్లలకు కొవాగ్జిన్​ టీకా(Covaxin) ఇచ్చేందుకు అమెరికా ఔషధ నియంత్రణ మండలి-ఎఫ్​డీఏ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసినట్లు భారత్​ బయోటెక్​ భాగస్వామ్య సంస్థ ఆక్యుజెన్​ ఇంక్​ వెల్లడించింది(covaxin ocugen). భారత్​లో నిర్వహించిన 2-3 దశల క్లినికల్​ పరీక్షల సమాచారం ఆధారంగా దరఖాస్తు చేసినట్లు తెలిపింది.

  • సరికొత్త 'బుల్లెట్'​ విమానం!

విమానయానాన్ని సులభతరం చేసే దిశగా సరికొత్త విమానాన్ని తయారు చేస్తోంది అమెరికాలోని ఒట్టో ఏవియేషన్‌ సంస్థ. కోడిగుడ్డు లేదా బుల్లెట్‌ రూపులో ఉన్న ఈ బుల్లి విమానం ఇతర లోహ విహంగాలకు (Celera 500L specialites) భిన్నంగా ఎన్నో ప్రత్యేకతలతో వస్తోంది.

  • ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు చావో రేవో!

టీ20 ప్రపంచకప్​(T20 World cup 2021)లో భాగంగా గ్రూప్-1లో సెమీస్ బెర్తు ఖరారు చేసుకునేందుకు తాడోపేడో తేల్చుకోనున్నాయి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా. సూపర్-12 దశలో ఈ రెండు జట్లు ఈరోజు (నవంబర్ 6) తమ ఆఖరి మ్యాచ్​ ఆడనున్నాయి.

06:49 November 06

టాప్​న్యూస్​@7AM

  • ఈ నాలుగూ ఎందుకు పాటించాలి?

హరిహరులకు అత్యంత ప్రీతికరమైనది కార్తిక మాసం(Karthika masam 2021). ఈ నెలలో హరిహరాదులను స్తుతించడంతోపాటూ చేసే ఇతర పూజలకూ, వ్రతాలకూ ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తిక పురాణం చెబుతోంది. అంతటి విశిష్టత ఉన్న కార్తిక మాసంలో ఈ నాలుగు పాటించాలి. ఎందుకంటే...

  • వ్యాట్‌ తగ్గించని తెలుగు రాష్ట్రాలు

పెట్రోలు, డీజిల్‌ వినియోగదారులకు దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఊరటనిచ్చాయి. వీటిపై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో.. తామూ సిద్ధమంటూ ముందుకొచ్చి లీటరుకు రూ.7 వరకు అమ్మకపు పన్ను కుదించుకున్నాయి. దీంతో అక్కడ పెట్రోలు, డీజిల్‌ ధరలు గణనీయంగా తగ్గాయి. తెలంగాణ, ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు మాత్రం కేంద్రం ప్రకటించిన ఎక్సైజ్‌ సుంకం, దానిపై విధించే వ్యాట్‌ తగ్గింపునకే పరిమితం కావడంతో ఊరట కొంతమేర మాత్రమే లభించింది.

  • రేపు భాజపా జాతీయ కార్యవర్గ భేటీ

భాజపా జాతీయ కార్యవర్గ భేటీ(Bjp National Executive Meet) ఆదివారం జరగనుంది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు.

  • ఒక్క సెమీస్ బెర్తు.. మూడు జట్ల పోటీ!

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​లో భాగంగా జరుగుతున్న సూపర్ 12 మ్యాచ్​లు చివరి దశకు చేరుకున్నాయి. కానీ ఇప్పటికీ సెమీస్ బెర్తులు ఖరారు కాలేదు. గ్రూప్-2 నుంచి పాకిస్థాన్​ సెమీ ఫైనల్ చేరగా.. మరో స్థానం కోసం భారత్, అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో సెమీస్​కు వెళ్లేందుకు ఎవరికి ఎక్కువ అవకాశం ఉందో చూద్దాం.

  • 'ఆయన పట్టుదల, క్రమశిక్షణే నాకు స్ఫూర్తి'

'రాజావిక్రమార్క' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది తమిళ హీరోయిన్​ తాన్యా రవిచంద్రన్​. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపింది. మంచి కథ, పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.

05:46 November 06

టాప్​న్యూస్​@6AM

  • ఆడవారిపై ఆ కళ్లు.. 

సూక్ష్మ కెమెరాలు కంటికి కనిపించని శత్రువుల్లా తయారయ్యాయి. మహిళల వ్యక్తిగత భద్రతను ఇవి ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌ గది మరుగుదొడ్డిలో సెల్‌ఫోన్‌ అమర్చిన ఉదంతం విదేశీ యువతి ఫిర్యాదుతో వెలుగుచూసింది. తాజాగా జూబ్లీహిల్స్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో దుస్తులు మార్చుకునేందుకు వెళ్లిన ఓ యువతిని ఇద్దరు యువకులు సెల్‌ఫోన్‌లో వీడియో తీసేందుకు యత్నించారు. ఆమె అప్రమత్తతతో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.

  • వేప చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి..?

తెలుగు రాష్ట్రాల్లో వేప వృక్షాలు ఎండిపోతున్నాయి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వేప చెట్లతో రైతులే కాదు.. అన్నివర్గాల వారికి అవినాభావం సంబంధం ఉంటుంది. అంతా ఎంతో ప్రేమగా చూసుకునే ఆ చెట్లు కళ్ల ఎదుటే మాడి.. కళావిహీనం అవుతుండడం కలవరానికి గురి చేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందో కూడా అంతుబట్టడం లేదు. మూడేళ్ల క్రితం ఒకసారి ఈ తరహా ఉదంతాలు తెలంగాణలో కనిపించాయి. 

  • ఇంజినీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్

నేటి నుంచి ఇంజినీరింగ్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రారంభం (Engineering Final Counselling 2021)కానుంది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కొత్త కోర్సుల్లో తాజాగా 5,610 సీట్లకు అనుమతినివ్వడంతో.. కన్వీనర్ కోటాలో తుది విడత కౌన్సెలింగ్​కు సుమారు 4,200 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు జాగ్రత్తగా కోర్సులు, కాలేజీలు ఎంపిక చేసుకొని వెబ్​ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఈనెల 20 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ జరగనుంది.

  • భాజపా ఎంపీ కారుపై రైతుల దాడి

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను ఉద్దేశించి భాజపా ఎంపీ రాంచందర్ జాంగ్రా(Ramchander jangra) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో శుక్రవారం హరియాణా హిస్సార్‌ జిల్లాలో ఆయనకు నిరసన సెగ తగిలింది. పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన తోపులాటలో.. ఎంపీ కారు ధ్వంసమైంది.

  • పేలిన గ్యాస్​ సిలిండర్​

ఓ గ్యాస్​ సిలిండర్​ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దిల్లీలో ఈ ఘటన జరిగింది. మరోవైపు.. ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మరణించారు.

  • రెచ్చిపోయిన బందిపోట్లు

నైజీరియాలో బందిపోట్లు రెచ్చిపోయారు. రెండు గ్రామాలపై దాడి చేసి 10 మందిని బలితీసుకున్నారు. అనేక ఇళ్లను ధ్వంసం చేశారు.

  • అఫ్గాన్‌పై భారత్‌ సదస్సు

అఫ్గాన్​లో నెలకొన్న శాంతి భద్రతలపై చర్చించేందుకు ఈ నెల 10న జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో భారత్​ ఓ సదస్సు(India Nsa Meeting On Afghanistan) నిర్వహించనుంది. అయితే.. భారత్​ ఈ భేటీని నిర్వహించడాన్ని పాకిస్థాన్​ తప్పుపట్టింది.

  • పుడమి రక్షణ దిశగా...

సున్నా కర్బన సాంకేతికత వైపు పనిచేయడానికి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలైన అమెజాన్‌, యాపిల్‌లతో పాటు భారత్‌ నుంచి మహీంద్రా గ్రూప్‌, దాల్మియా సిమెంట్‌(భారత్‌)లు సిద్ధమయ్యాయి. ఇందుకోసం.. గ్లాస్గోలో జరుగుతున్న కాప్‌26 సదస్సు వేదికగా 'ఫస్ట్‌ మూవర్స్‌ కొయిలేషన్‌'లో వ్యవస్థాపక సభ్యులుగా చేరాయి.

  • గీతా ఆర్ట్స్​ బ్యానర్​లో బాలయ్య..! 

నందమూరి బాలకృష్ణ(Balakrishna latest news).. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్​లో ఓ చిత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి క్రిష్​ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

  • బుమ్రా మరో రికార్డు.. 

టీమ్​ఇండియా స్టార్​ బౌలర్​ జస్​ప్రీత్​ బుమ్రా (Bumrah News) అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్​ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

Last Updated : Nov 6, 2021, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.