యాంకర్​ సుమ రీఎంట్రీ.. ఫస్ట్​లుక్​తో భారీ అంచనాలు

author img

By

Published : Nov 6, 2021, 12:37 PM IST

Updated : Nov 6, 2021, 7:15 PM IST

suma

యాంకర్​ సుమ(suma latest news) రీఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమా టైటిల్​తో కూడిన మోషన్​ పోస్టర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి విజయ్​కుమార్​ కలివరుపు దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి సంగీతమందిస్తున్నారు.

బుల్లితెర(suma latest news) వ్యాఖ్యాతగా ఎన్నో లక్షల మంది హృదయాలను గెలుచుకున్న సుమ.. మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. సుమారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆమె వెండితెరపై సందడి చేయనుంది(suma update). తాజాగా ఈమె నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్​తో కూడిన​ మోషన్​ పోస్టర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. మెగాపవర్​స్టార్​ రామ్​చరణ్​ దీన్ని రిలీజ్​ చేశారు. 'జయమ్మ పంచాయితీ' అనే టైటిల్​ ఖరారు చేశారు. ఈ పోస్టర్​లో సుమ రోకలి దంచుతూ సిరీయస్​గా ఉన్న లుక్​.. సినిమాపై ఆసక్తిని రేపుతోంది.

.

ఈ చిత్రానికి విజయ్​కుమార్​ కలివరుపు దర్శకత్వం వహించగా.. కీరవాణి సంగీతమందిస్తున్నారు. బలగప్రకాశ్​ నిర్మాత. ఈ సినిమాలో సుమ గ్రామీణ మహిళగా.. ఊరి పెద్ద స్థానంలో మునుపెన్నడూ లేని విధంగా సీరియస్‌ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

'కల్యాణ ప్రాప్తిరస్తు' చిత్రంతో వెండితెరకి పరిచయమైన సుమ 'పవిత్ర ప్రేమ', 'చాలా బాగుంది', 'వర్షం', 'ఢీ', 'బాద్‌షా' తదితర చిత్రాల్లో నటించి అందర్నీ మెప్పించింది.

ఇదీ చూడండి: మాస్​ లుక్​లో చిరు​.. బాబీతో సినిమా షురూ

Last Updated :Nov 6, 2021, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.