ETV Bharat / city

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు

author img

By

Published : Nov 2, 2021, 5:47 AM IST

Updated : Nov 2, 2021, 10:16 PM IST

etv bharat latest top news
etv bharat latest top news

21:43 November 02

టాప్​న్యూస్​@ 10PM

  • 'ఉపపోరులో ఆత్మగౌరవమే గెలిచింది'

హుజూరాబాద్​ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​.. గెలుపుపై స్పందించారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోబాలకు గురిచేసిననా.. దేనికీ లొంగకుండా భారీ మెజార్టీతో గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

  •  రెండు పార్టీలు ఏకమయ్యాయి..!

హుజూరాబాద్‌ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ ప్రకటించారు. ఉపఎన్నికలో తెరాస పార్టీదే నైతిక విజయమన్నారు. తెరాస ఓటమి కోసం రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని గెల్లు ఆరోపించారు.

  •  కాంగ్రెస్ కకావికలం

హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad by election) కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి చేదు అనుభమే మిగిల్చింది (congress defeated in huzurabad by election). పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి సారథ్యంలో తొలి ఓటమిని చవిచూసింది

  • వాటితో లాభాలెన్నో..!

గ్లాస్గోలో జరిగిన సీఓపీ26లో ప్రధాని మోదీ రెండో రోజు ప్రసంగించారు. సౌరశక్తి సామర్థ్యంపై మాట్లాడారు. సౌరశక్తి పరిశుభ్రమైనదిగా పేర్కొన్న మోదీ.. 'ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్​'తో ఎన్నో లాభాలున్నాయని వెల్లడించారు. ఇందుకోసం ఇస్రో సోలార్​ కాలిక్యులేటర్​ రూపొందిస్తోందని స్పష్టం చేశారు. సోలార్​ ప్రాజెక్టుల కోసం ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

  • 'భీమ్లా నాయక్',  అప్డేట్స్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో భీమ్లా నాయక్, శ్యామ్ సింగరాయ్, మేజర్, మిషన్ మంజు, గ్యాంగ్​స్టర్ గంగరాజు, నో మీన్స్ నో, ఎయిట్, సూపర్​మచ్చి చిత్ర విశేషాలు ఉన్నాయి.

20:50 November 02

టాప్​న్యూస్​@ 9PM

  •  ఈటల విజయ ప్రస్థానం

సౌమ్యుడిగా ముద్రపడ్డ ఈటల రాజేందర్(Etela rajender Profile) ఉద్యమనాయకుడిగా కేసీఆర్ కుడిభుజంగా కొనసాగారు. వ్యక్తిత్వంలో ఎప్పుడు మంచి మార్కులే కొట్టేసిన ఈటల ప్రస్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. సంక్షేమ గృహంలో చదివి.. వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసి.. ఉద్యమ సమయంలో తెరాస పార్టీ సైనికుడిగా ప్రజల్లో గుర్తింపు పొందారు.

  • ఒక ఎన్నిక వారిద్దరిని విడదీసింది

వాళ్లిద్దరూ ఒకప్పుడు మంచి మిత్రులు. ఒకే పార్టీలో జోడెడ్లుగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమం నుంచి అధికారపక్షంలో కీలక భూమిక పోషించారు. ఉద్యమ నేతలుగా, ఎమ్మెల్యేలుగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. శాసనసభలోనూ పదునైన విమర్శలు.. వాగ్బాణాలతో తమదైన ముద్రవేశారు. ఆ ఇద్దరినీ హుజురాబాద్ ఉపఎన్నిక రాజకీయ ప్రత్యర్థులుగా మార్చింది.

  • ఓటర్లెందుకు చేయిచ్చారు?

హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad by election) కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి చేదు అనుభమే మిగిల్చింది (congress defeated in huzurabad by election). పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి సారథ్యంలో తొలి ఓటమిని చవిచూసింది (tpcc chief revanth reddy). 

  • ఆ విషయంపై మోదీ చర్చ

ప్రపంచ వాతావరణ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ.. వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఆయా దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. వివిధ అంశాలపై చర్చించారు. సదస్సులో భాగంగా.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తోనూ మోదీ సమావేశమయ్యారు.

  •  భారత్​కు తొలి పతకం

ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో (Boxing World Championships) సెమీస్​లోకి అడుగుపెట్టాడు భారత యువ బాక్సర్ ఆకాశ్ కుమార్. దీంతో ఈ టోర్నమెంట్​లో భారత్​కు తొలి పతకం ఖాయమైంది.

19:47 November 02

టాప్​న్యూస్​@ 8PM

  •  ఈటల ఘన విజయం

హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ విజయ కేతనం ఎగురవేశారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై ఘన విజయం సాధించారు. భాజపా- తెరాస హోరాహోరిగా తలపడిన హుజురాబాద్‌ ఉపఎన్నికలో తొలి రౌండ్‌ నుంచే ఈటల రాజేందర్‌ ఆధిపత్యం సాధించిన ఈటల... కేవలం రెండు రౌండ్లలో మాత్రమే స్వల్ప తేడాతో వెనుకబడ్డారు

  •  కేటీఆర్ ఎలా స్పందించారంటే...!

 హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమితో ఒరిగేదేమీ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. గత 20 ఏళ్లలో తెరాస ఎన్నో ఆటుపోట్లను చవిచూసిందని మంత్రి పేర్కొన్నారు. స్ఫూర్తిదాయకంగా పోరాడిన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఆయన అభినందనలు తెలిపారు

  • ఓటమిపై హరీశ్​ రావు కామెంట్స్

హుజూరాబాద్ ప్రజా తీర్పును శిరసావహిస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒక్క ఓటమితో తెరాస కుంగిపోదని పేర్కొన్నారు. ఓడినా గెలిచినా తెరాస ప్రజల పక్షాన పనిచేస్తుందని తెలిపారు. భాజపా, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయాలను యావత్​ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

  •  హీరోయిన్​గా స్టార్​ యాంకర్..!

ఇప్పటివరకు టీవీ ప్రేక్షకుల్ని అలరించిన యాంకర్ .. ఇకపై సినిమాలతోనూ ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో దీని గురించి స్పష్టత ఇవ్వనున్నట్లు ఓ వీడియో విడుదల చేశారు.

  •  దక్షిణాఫ్రికా గెలుపు

బంగ్లాదేశ్​పై విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. టీ20 ప్రపంచకప్​లో సెమీస్​ ఛాన్స్​లు మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

18:51 November 02

టాప్​న్యూస్​@ 7PM

  •   ఆయన గెలుపునకు అదే కారణం

గత ఐదు నెలలుగా ఉత్కంఠ రేపిన హుజూరాబాద్​ ఉపఎన్నిక ఫలితం ఎట్టకేలకు వెలువడింది. నియోజకవర్గంలో కమలం వికాసిస్తుందా.. లేక.. గులాబీ గుబాళిస్తుందా అన్న ఎదురుచూపుకు తెరపడింది. ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, విమర్శలు, అధికార తెరాస ఎత్తుగడలను ఎదుర్కొని.. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​ హుజూరాబాద్​ గద్దెపై కాషాయ జెండా ఎగురవేశారు. 

  • ' ఇది ప్రజల విజయం '

హుజూరాబాద్​ ఉప పోరులో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం పట్ల కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి(Kishan reddy on Etela winning) హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలో భాజపాను ఆదరించిన హుజూరాబాద్​ ప్రజలకు(Kishan reddy on Etela winning) కృతజ్ఞతలు తెలియజేశారు. రసవత్తరంగా సాగిన హుజూరాబాద్​ ఉప ఎన్నికలో ఈటల విజయం అనంతరం.. కిషన్​ రెడ్డి దిల్లీలో మీడియాతో మాట్లాడారు.

  • 'అది భాజపా గెలుపు కాదు'

హుజూరాబాద్​ ఉప ఎన్నిక ఫలితాలు తాము ఊహించినట్లుగానే ఉన్నాయని కాంగ్రెస్​ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam on huzurabad result)​ పేర్కొన్నారు. ఈటల విజయాన్ని భాజపా గెలుపుగా బండి సంజయ్​ చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. ఫలితాల ఆధారంగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ నాయకత్వం(Ponnam on huzurabad result)​ బలపరచుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

  • కెప్టెన్​ కొత్త పార్టీ పేరు అదే..!

కాంగ్రెస్​కు రాజీనామా చేసిన పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్ నూతన పార్టీని ప్రకటించారు. 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు.

  • అతను వన్డే కెప్టెన్సీ నుంచి కూడా!

టీ20 ప్రపంచకప్​ (T20 World Cup 2021) తర్వాత న్యూజిలాండ్​తో సిరీస్​కు జట్టు ఎంపికపై చర్చించేందుకు బీసీసీఐ త్వరలోనే సమావేశం కానుంది. ఈ భేటీలో టీ20 కెప్టెన్​గా రోహిత్​ శర్మను (Rohit Sharma News) ఎంపిక చేయనున్నట్లు సమాచారం. వన్డేల్లో విరాట్​ కోహ్లీ కెప్టెన్సీ (Virat Kohli ODI Captain) భవితవ్యంపైనా భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

17:43 November 02

టాప్​న్యూస్​@ 6PM

  • 19వ రౌండ్‌లోనూ ఈటల జోరు.. 

హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికలో 8, 11 రౌండ్లు మినహా.. మిగిలిన రౌండ్లలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. 

  • ఆ పార్టీలో పెద్ద ఎత్తున ముసలం 

హుజూరాబాద్​లో భాజపా విజయం కోసం కృషి చేసిన ప్రతీ ఒక్క కార్యకర్తకు నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అభినందనలు తెలిపారు. భాజపాను అడ్డుకునేందుకు తెరాస చేసిన అన్ని ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని స్పష్టం చేశారు. ఈ గెలుపుతో.. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ పతనానికి నాంది పడిందని వ్యాఖ్యానించారు.

  • ఆ కేసులో ఒక్కరికి బెయిల్​ తిరస్కరణ

మంచి రేవుల ఫామ్​ హౌజ్​ పేకాట కేసులో 29మందికి ఉప్పర్​ పల్లి న్యాయస్థానం(Gambling in Farm house case) బెయిల్​ మంజూరు చేసింది. కాగా ప్రధాన నిందితుడు గుత్తా సుమన్​కు బెయిల్​ నిరాకరించింది.

  • ఉపఎన్నికల్లో వారిదే హవా

దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ, 3 లోక్​సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో(bypoll results 2021) భాజపాకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఆశించినంతగా రాణించలేకపోయింది. హిమాచల్ ప్రదేశ్​లో కాంగ్రెస్ మూడు అసెంబ్లీ, ఒక లోక్​సభ స్థానాన్ని కైవసం చేసుకుని భాజపాకు షాక్ ఇచ్చింది. అటు బంగాల్​లో టీఎంసీ క్లీన్​స్వీప్ చేసి మొత్తం నాలుగు స్థానాల్లో గెలుపొందింది(by election results 2021).

  •  బంగ్లా బ్యాట్లేత్తిసింది

దక్షిణాఫ్రికా బౌలర్ల విజృంభణతో బంగ్లాదేశ్​ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్​లో 18.2 ఓవర్లలో 84 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో సఫారీ జట్టు ముందు 84 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిలిపారు.

16:53 November 02

టాప్​న్యూస్​@ 5PM

  • 16వ రౌండ్‌లో భాజపాకు 1,772 ఓట్ల ఆధిక్యం

హుజురాబాద్‌ ఎన్నికల ఫలితాల్లో ఈటల రాజేందర్‌ ఆధిక్యం కొనసాగుతోంది. 16వ రౌండ్‌లో భాజపాకు 1,772 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 16వ రౌండ్‌లో భాజపాకు 5,689, తెరాసకు 3,917 ఓట్లు వచ్చాయి. 

  • ఆ దేశాలకు అండగా 'ఐరిస్'- ఆవిష్కరించిన మోదీ

గ్లాస్గోలో జరుగుతున్న వాతావరణ సదస్సులో భాగంగా ఐరిస్​ను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో అభివృద్ధి చెందుతున్న ద్వీపాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. వాతావరణ మార్పుతో ఏర్పడే విపత్తులకు సంబంధించిన డేటాను ఆయా దేశాలతో ఇస్రో పంచుకుంటుందన్నారు.

  •  కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

హుజూరాబాద్​ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి వాస్తవ పరిస్థితులను కాంగ్రెస్‌ హైకమాండ్‌కు వివరిస్తానని భువనగిగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి(MP Komatireddy Venkata Reddy comments on Huzurabad by poll) అన్నారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఐదు నెలలైనా కాంగ్రెస్​ పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.

  •  ఆ ఊసెందుకు ఎత్తడం లేదు

తెరాస పాలనపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ విమర్శలు(manickam tagore comments) గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. పసుపు బోర్డు మాట ఇచ్చిన భాజపా.. ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • సెట్​లో పవన్.. 

పవన్ 'హరిహర వీరమల్లు'(harihara veera mallu release date) షూటింగ్ తిరిగి షూటింగ్ మొదలైంది. హీరో పవన్​, అర్జున్ రాంపాల్, జాక్వెలిన్​లపై(jacqueline fernandez first movie) సీన్స్​ చిత్రీకరించనున్నారు.

15:44 November 02

టాప్​న్యూస్​@ 4PM

  • 14వ రౌండ్‌లో భాజపాకు 1,046 ఓట్ల ఆధిక్యం

హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికలో 8, 11 రౌండ్లు మినహా.. మిగిలిన రౌండ్లలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు అమలు చేసిన శాలపల్లి గ్రామంలో... తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంతూరు హిమ్మత్​నగర్​లో ఈటల ముందంజలో నిలిచారు.

  •  అధికార మార్పునకు నాంది

హుజూరాబాద్‌ గడ్డపై కాషాయ జెండా ఎగురబోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఫలితాల్లో భాజపా అధిక్యం కనబరుస్తుండడంతో పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈటల గెలుపును భాజపా విజయంగానే భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈటల గెలుపుతో తెలంగాణలో అధికార మార్పిడిని ప్రజలు కోరుకుంటున్నారనేది స్పష్టమైందని తెలిపారు.

  •  టీఎంసీ క్లీన్​స్వీప్​

బంగాల్​ ఉపఎన్నికల్లో టీఎంసీ హవా కొనసాగింది. మొత్తం నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. భాజపా అభ్యర్థులపై భారీ మెజారిటీ సాధించి చిత్తుగా ఓడించింది. ఇది విద్వేష రాజకీయాలపై బంగాల్ ప్రజలు సాధించిన విజయమని సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

  • బ్యాచ్​లర్​గా రికార్డు సృష్టించిన అఖిల్

థియేటర్లలో ప్రస్తుతం సందడి చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'(most eligible bachelor review).. కలెక్షన్లలో మరో మార్క్​ను చేరుకుంది. దీంతో అఖిల్​ సరికొత్త రికార్డు సాధించాడు.

  • యువరాజ్​ నుంచి గుడ్​న్యూస్

టీమ్​ఇండియా మాజీ డాషింగ్​ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్ (Yuvraj Singh News) అభిమానులకు శుభవార్త. 2011 వన్డే ప్రపంచకప్​ విజేత యువీ.. తిరిగి మైదానంలోకి (Yuvraj Singh Comeback) అడుగుపెట్టనున్నాడు. తన రిటైర్మెంట్​ను వెనక్కు తీసుకోనున్నట్లు తెలిపాడు.

14:37 November 02

టాప్​న్యూస్​@ 3PM

  • 10వ రౌండ్‌లో ఈటలకు 526 ఓట్ల ఆధిక్యం

హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికలో 8వ రౌండ్ మినహా.. మిగిలిన రౌండ్లలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు అమలు చేసిన శాలపల్లి గ్రామంలో... తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంతూరు హిమ్మత్​నగర్​లో ఈటల ముందంజలో నిలిచారు.

  • 'సిరిసిల్ల ఘటనే నిదర్శనం'

సిరిసిల్లలో ఆరేళ్ల గిరిజన బాలికపై జరిగిన అత్యాచారం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay on sircilla incident)​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తెరాస నిర్లక్ష్యం వహించడాన్ని(Bandi sanjay on sircilla incident)​ తప్పుబట్టారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఎన్ని అరాచకాలు చేసినా చెల్లుతుందని ఎద్దేవా చేశారు.

 

  •  కూరగాయల రేట్లు కుతకుత!

రాష్ట్రంలో కూరగాయల(Vegetables Cost in Hyderabad) ధరలు కుతకుతమంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. అన్ని కూరగాయల ధరలు మండుతున్నాయి. కూరగాయ వ్యాపారుల మాయాజాలం వినియోగదారుల పాలిట శాపంగా మారుతోంది

  • ఆయన మరణంతో టెస్టుల కోసం క్యూ

కన్నడ నటుడు పునీత్ రాజ్​కుమార్ మరణం తర్వాత ఆస్పత్రుల్లో రద్దీ అధికమైంది. సొంత ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ.. చెకప్​ల కోసం తరలి వెళ్తున్నారు ప్రజలు. గుండె చెకప్​లు, ఈసీజీలు చేయించుకుంటున్నారు.

  • ఆ​ కేసుపై సుమోటో విచారణ

టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల కూతురు వామికకు(తొమ్మిది నెలలు)వచ్చిన అత్యాచారా బెదరింపులపై నమోదైన కేసును సుమోటోగా తీసుకుంది దిల్లీ మహిళా కమీషన్​. ఆ నిందితులకు సంబంధించిన ఎఫ్​ఐఆర్​ను నవంబరు 8వ తేదీలోగా సమర్పించాలని పోలీసులను కోరింది.

13:56 November 02

టాప్​న్యూస్​@ 2PM

  • గెల్లు ఇలాకాలో ఈటల తఢాకా

హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికలో వరుసగా తొలి ఏడు రౌండ్లలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు అమలు చేసిన శాలపల్లి గ్రామంలో... తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంతూరు హిమ్మత్​నగర్​లో ఈటల ముందంజలో నిలిచారు.

  • ఏం చేసినా చెల్లుతుందా?

సిరిసిల్లలో ఆరేళ్ల గిరిజన బాలికపై జరిగిన అత్యాచారం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay on sircilla incident)​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తెరాస నిర్లక్ష్యం వహించడాన్ని(Bandi sanjay on sircilla incident)​ తప్పుబట్టారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఎన్ని అరాచకాలు చేసినా చెల్లుతుందని ఎద్దేవా చేశారు.

  • గడియారం ఖరీదు రూ.50 లక్షలు

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్​, ఎన్​సీబీ అధికారి సమీర్ వాంఖడే మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సమీర్ బెదిరింపుల ద్వారా రూ.కోట్లు సంపాదించి విలాసవంతమైన జీవితం గడుపుతారని, రూ.లక్ష విలువైన ప్యాంటు, రూ.70వేలు విలువైన చొక్కా ధరిస్తారని ఆరోపించారు. వీటిని వాంఖడే ఖండించారు.

  • టీ20 సిరీస్​కు కెప్టెన్​గా రాహుల్!

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్​తో టీ20(ind vs nz series 2021), టెస్టు, వన్డే సిరీస్ ఆడనుంది భారత్. కాగా, రాహుల్​(kl rahul news)ను కివీస్​తో పొట్టి సిరీస్​కు కెప్టెన్​గా నియమించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

  • పాన్​ఇండియా చిత్రంతో రవితేజ

వరుస సినిమాలతో జోరు మీదున్న హీరో రవితేజ ఈ సారి ఏకంగా పాన్​ ఇండియా సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. #RT71తో తెరకెక్కబోతున్న ఈ సినిమా వర్కింగ్​ టైటిల్​ పోస్టర్​ను నిర్మాణ సంస్థ అభిషేక్​ అగర్వాల్​ ఆర్ట్స్​ రిలీజ్​ చేసింది. దీనికి సంబంధించిన టైటిల్​తో పాటు పూర్తి వివరాలను నవంబరు 3 మధ్యాహ్నం 12.06గంటలకు ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మూవీలో మాస్​మహారాజా సరికొత్తగా కనిపించనున్నారని వెల్లడించింది.

12:59 November 02

టాప్​న్యూస్​@ 1PM

  • ఉపపోరులో ఈటల జోరు

హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికలో వరుసగా ఏడో రౌండ్లలోనూ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యం సాధించారు. రౌండ్​ రౌండ్​కు కమలం పార్టీ ఆధిక్యం పెరుగుతోంది. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల 3,432 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 7వ రౌండ్‌లో భాజపా 4,038, తెరాస 3,792, కాంగ్రెస్ 94 ఓట్లు వచ్చాయి. 7వ రౌండ్​లో ఈటల 252ఓట్ల ఆధిక్యం సాధించారు. ఏడు రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 31,021, తెరాసకు 27,589 ఓట్లు నమోదయ్యాయి. కాంగ్రెస్​కు 7 రౌండ్లు ముగిసేసరికి 1,086 ఓట్లు వచ్చాయి.

  • డిప్యూటీ సీఎంపై ఐటీ కొరడా

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​కు చెందిన రూ. 1000 కోట్లు విలువ చేసే ఆస్తులను ఐటీ శాఖ సీజ్​ చేసింది. పన్ను ఎగవేత కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టింది.

  • రోబోల ఫుడ్ డెలివరీ

ఫుడ్‌ డెలివరీ చరిత్రలో కొత్త అధ్యయానికి అగ్రరాజ్యం అమెరికాలో నాంది పడింది. ఇప్పటివరకూ ఆహారాన్ని వాహనాల ద్వారా డ్రోన్ల సాయంతో సరఫరా చేస్తుండగా తొలిసారి ఓ సంస్థ రోబోల ద్వారా వాటిని చేరవేస్తూ (Robot Food Deliveries) వహ్వా అనిపిస్తోంది. 

  • 'అశ్విన్​ను తీసుకోకపోవడంపై విచారణ జరిపించాలి'

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021) తుదిజట్టులో సీనియర్ స్పిన్నర్ రవి అశ్విన్(ravi ashwin t20 world cup)​ను తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు మాజీ క్రికెటర్ వెంగ్​సర్కార్(vengsarkar news). అతడిని ఆడించనప్పుడు ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించాడు. దీనిపై విచారణ జరిపించాలని అభిప్రాయపడ్డాడు.

  • షారుక్ ఇంట్లో సంబరాలు

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్ పుట్టినరోజు ఈరోజు (నవంబర్ 2). అలాగే దీపావళి దగ్గర పడటం వల్ల ఆయన ఇంట్లో పండగ వాతవారణం మొదలైంది. ఆయన ఇల్లు 'మన్నత్'​ను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీప కాంతులతో వెలుగులీనుపోతోంది. దానికి సంబంధించిన వీడియో సహా బాద్​షా గురించి కొన్ని ఆసక్తికర సంగతులు మీకోసం..

12:52 November 02

11:50 November 02

టాప్​న్యూస్​@ 12PM

  • బద్వేలు ఉపఎన్నికలో వైకాపా విజయం

ఏపీలోని కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా ఘన విజయం సాధించింది. తొలి రౌండ్‌ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన వైకాపా అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి ఆమె 68,492 ఆధిక్యంలో ఉన్నారు.

  • ఉపపోరులో ఈటల జోరు

హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికలో వరుసగా నాలుగు రౌండ్లలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యం సాధించారు. రౌండ్​ రౌండ్​కు భాజపా ఆధిక్యం పెరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలు చేసిన గ్రామం శాలపల్లిలోనూ కమలం పార్టీనే ముందంజలో నిలిచింది. ఈ గ్రామంలో భాజపాకు 312 ఓట్లు రాగా.. తెరాసకు 175 ఓట్లు వచ్చాయి. 

  • ఉగ్ర కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక ఏజెన్సీ

తీవ్రవాద సంబంధిత కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్​ఐఏ) ఏర్పాటుకు ఆదేశించింది జమ్ముకశ్మీర్​ యంత్రాంగం. ఎస్​ఐఏకు సీఐడీ విభాగ అధిపతి ఎక్స్​-అఫీషియో డైరెక్టర్​గా వ్యవహరిస్తారని ప్రకటనలో పేర్కొంది.

  • 'టీమ్ఇండియా బ్యాటింగ్​ షాక్​కు గురిచేసింది'

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​లో టీమ్ఇండియా వరుస ఓటముల పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొదటి మ్యాచ్​లో పాక్​ చేతిలో ఓడిన భారత్(ind vs pak t20)​.. రెండో మ్యాచ్​లో కివీస్(ind vs nz t20)​కు అప్పనంగా విజయాన్ని కట్టబెట్టింది. తాజాగా ఈ మ్యాచ్​పై స్పందించిన పాక్ మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్(inzamam ul haq on india loss).. కోహ్లీసేన బ్యాటింగ్ తీరు చూసి షాకయ్యానని తెలిపాడు.

  • 'అందుకే ఆ సినిమా ఆడలేదు!'

మెగాస్టార్​ చిరంజీవి మాట కాదనలేక 'అందరివాడు' సినిమా తెరకెక్కించినట్లు వెల్లడించారు దర్శకుడు శ్రీనువైట్ల. ఆ మూవీ ఎందుకు ఫ్లాప్​ అయిందో వివరించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన ఈ దర్శకుడు.. తన కెరీర్​ గురించి ఆసక్తికర సంగతులు తెలిపారు.

10:59 November 02

టాప్​న్యూస్​@ 11AM

  • తొలి 3 రౌండ్లలో ఈటలకు ఆధిక్యం

హోరాహోరీగా సాగిన హుజూరాబాద్‌ ఉపఎన్నికలో వరుసగా మూడు రౌండ్లలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యం సాధించారు. మూడో రౌండ్​ ముగిసే సరికి 1,269 ఓట్ల ఆధిక్యంతో ఈటల ముందంజలో నిలిచారు. మూడో రౌండ్​లో తెరాస, కాంగ్రెస్​ అభ్యర్థులు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

  • ‘ఇంజినీరింగ్‌’ పార్కులకు పెద్దపీట

రాష్ట్రంలో కొత్తగా ఆరు ఇంజినీరింగు విడిభాగాల పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగు విడిభాగాల పరిశ్రమలు ఏటా విస్తరించడంతో పాటు ఎగుమతులు పెరుగుతుండడంతో ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను సమీకరించి, భారీఎత్తున ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో అయిదు వేల ఇంజినీరింగు విడిభాగాల పరిశ్రమలుండగా.. మూడువేలకు పైగా రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లో నడుస్తున్నాయి.

  • ఆవుపై అత్యాచారం

ఓ యువకుడు ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన హరియాణాలోని సోనీపత్​లో జరిగింది. గమనించిన గ్రామస్థులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

  • బబుల్ నిబంధనలు అతిక్రమణ

టీ20 ప్రపంచకప్​లో అంపైర్​గా విధులు నిర్వర్తిస్తున్న మైఖేల్ గాఫ్​పై నిషేధం విధించింది ఐసీసీ. కరోనా నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

  • సూర్య 'జైభీమ్'​ ఎలా ఉందంటే?

తమిళ హీరో సూర్య(jai bhim movie review) నటించిన సినిమా 'జై భీమ్'(suriya jai bhim movie).​ ఇందులో ఆయన న్యాయవాది(తొలిసారిగా) పాత్ర పోషించారు. జ్ఞానవేల్​ దర్శకత్వం(suriya jai bhim movie director) వహించిన ఈ చిత్రం అమెజాన్​ ప్రైమ్​లో విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..

09:48 November 02

టాప్​న్యూస్​@ 10AM

  • తొలిరౌండ్​లో ఈటలకు ఆధిక్యం

హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్​ తొలి రౌండ్‌లో ఈటల రాజేందర్‌ ఆధిక్యంలో ఉన్నారు.  తొలి రౌండ్‌లో భాజపాకు 166 ఓట్ల ఆధిక్యం  వచ్చింది. తొలి రౌండ్‌లో భాజపా 4,610, తెరాస 4,444 వచ్చాయి.

  • బద్వేలు.. ఓట్ల లెక్కింపు

ఏపీలోని కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అధికారులు పోస్టల్ బ్యాలెట్లలోని ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంల్లోని ఓట్లను లెక్కిస్తారు.

  • పర్వతాగ్రాన 'శత్రుజీత్'​

తూర్పు లద్దాఖ్​లోని హిమాలయ పర్వతాలపై భారత సైన్యానికి చెందిన శత్రుజీత్​ దళం (Shatrujeet Brigade) విన్యాసాలు చేపట్టింది. చైనీయులు దుస్సాహసానికి పాల్పడితే మెరుపు వేగంతో ఎదురుదెబ్బ తీసే సామర్థ్యం తమకు ఉందని చాటడానికి ఈ విన్యాసాలు జరుపుతోంది.

  • పెరిగిన బంగారం ధర

బంగారం, వెండి ధరలు (Gold Rate Today) మంగళవారం కాస్త పెరిగాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • బికినీ రూల్​కు చెల్లు

బీచ్ హ్యాండ్​బాల్ పోటీల్లో ఇకపై మహిళలు బికినీ(beach handball women's uniform) ధరించడం తప్పనిసరి కాదు. ఇటీవల జరిగిన యూరోపియన్ బీచ్ హ్యాండ్​బాల్ ఛాంపియన్ షిప్​లో బికినీ ధరించలేదని నార్వే మహిళా జట్టుపై భారీ జరిమానా విధించారు. దీనిపై ఆ టీమ్ ఫిర్యాదు చేయగా.. ఆ నిబంధనను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

09:00 November 02

టాప్​న్యూస్​@ 9AM

  • దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం

అక్టోబరు 30న దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మూడు లోక్​సభ, 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరోవైపు.. విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు.

  • హుజూరాబాద్  కౌంటింగ్ షురూ..

ఐదు నెలల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. మూడు ప్రధాన పార్టీలు.. 30 అభ్యర్థులకు గతకొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన హుజూరాబాద్​ ఉపఎన్నిక ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కలిగించిన ఈ నియోజకవర్గంలో చక్రం తిప్పేదెవరో ఇవాళ సాయంత్రం వరకు తెలియనుంది. 

  • వారంలో 3 రోజులు ఆఫీసుకి!

హైబ్రిడ్‌ పని విధానానికే ఐటీ ఉద్యోగులు, సంస్థల యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయని నాస్కామ్‌, ఇన్‌డీడ్‌ సంయుక్తంగా రూపొందించిన నివేదిక తెలిపింది. జనవరి నుంచి వారంలో 3 రోజులు ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేసే అవకాశం ఉందని పేర్కొంది.

  • ధోనీని దాటేసిన మోర్గాన్

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది ఇంగ్లాండ్. సోమవారం శ్రీలంక(eng vs sl t20)పై ఘనవిజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్​లో విజయంతో టీ20ల్లో అత్యధిక విజయాలు అందించిన సారథిగా రికార్డు నెలకొల్పాడు మోర్గాన్(eoin morgan t20 captaincy record).

  • నివేదా.. నీ నవ్వుతో మాయ చేయకలా!

నివేదా థామస్​.. 'జెంటిల్​మెన్'​ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. ఆ చిత్రంతోనే ఎంతో మంది కుర్రోళ్లను ఫిదా చేసింది. ఆ తర్వాత 'నిన్ను కోరి', 'జై లవకుశ', 'బ్రోచేవారెవరు', 'వి', 'వకీల్​సాబ్'​ సహా పలు చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నేడు(నవంబరు 2) ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా కొన్ని సంగతులు మీకోసం..


 

07:58 November 02

టాప్​న్యూస్​@ 8AM

  • కాసేపట్లో ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

హుజూరాబాద్‌ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మరికొద్ది గంటల్లో హుజూరాబాద్‌అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 

  • మాజీ సీఎం భార్యతో డ్రగ్స్‌ వ్యాపారి ఫొటోలు

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, ఆయన భార్య అమృతా ఫడణవీస్‌కు డ్రగ్స్‌ మాఫియాతో (nawab malik on devendra fadnavis) సంబంధాలు ఉన్నాయంటూ ఆ రాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ సోమవారం ఆరోపించారు. 

  • కాలే కడుపులపై కనికరం కరవు

పథకాలు ఎన్ని అమలవుతున్నా పోషకాహార లోపం, ఆకలి బాధలు దేశాన్ని ఇంకా పట్టి పీడిస్తున్నాయి. వీటన్నింటికీ అడ్డుకట్ట పడాలంటే సామాజిక వంటశాలలను(Community Kitchen In India) ఏర్పాటు చేయాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సుప్రీంకోర్టు సూచించింది. ప్రపంచ ఆకలి సూచీలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ల కన్నా భారత్‌ అధమ స్థానంలో నిలిచింది. వీటన్నింటిని బట్టి చూస్తే దేశంలో సామాజిక వంటశాలల ఆవశ్యకత తప్పకుండా ఉందని స్పష్టమవుతోంది.

  • హైలో ఓపెన్​లో శ్రీకాంత్​ సత్తా చాటేనా?

వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతున్న భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తిరిగి ఫామ్​లోకి రావడానికి ఎదురుచూస్తున్నాడు. మంగళవారం (నవంబర్ 2) నుంచి ప్రారంభం కానున్న హైలో ఓపెన్​లో ఉత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తున్నాడు. ఇతడితో పాటు మరికొందరు షట్లర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.

  • రెండు నెలలు.. రెట్టింపు వినోదాలు

ఏటా వందలాది చిత్రాలు విడుదలైనా వాటిలో కొన్నైనా బ్లాక్‌బస్టర్‌ చిత్రాలుగా నిలిచిపోతాయి. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తాయి. కానీ ఈ ఏడాది కరోనా పరిస్థితుల మధ్య భయం భయంగానే మొదలైంది. ఇప్పటివరకూ అయితే సరైన చిత్రం బాలీవుడ్‌లో విడుదల కాలేదు. అయినా ఈ ఏడాది ముగిసిపోలేదు. రెట్టించిన ఉత్సాహంతో ఈ రెండు నెలల్లో భారీ అంచనాల మధ్య అగ్రహీరోల చిత్రాలు రాబోతున్నాయి. ఈ రెండు నెలల్లో విడుదలయ్యే చిత్రాలు తీవ్రంగా నష్టపోయిన బాలీవుడ్‌కు భారీ ఉపశమనమే కలిగిస్తాయనే ఆశతో ఉంది చిత్రసీమ. ఇంతకీ రిలీజ్​ అయ్యే ఆ మూవీస్​ ఏంటంటే....
 

07:55 November 02

టాప్​న్యూస్​@ 7AM

  • అర్ధరాత్రి స్టూడెంట్ వార్

కాకతీయ విశ్వవిద్యాలయంలో అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు ఘర్షణకు దిగారు (fight between two student groups). యునివర్సిటీ పీజీ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కట్టెలు, బకెట్లతో కొట్టుకున్నారు.

  • ఎక్కడి గొంగడి అక్కడే!

రెండేళ్లలో తొలిసారి భౌతికంగా సమావేశమైన జీ20 దేశాధినేతలు(G20 summit).. వాతావరణ మార్పు, కొవిడ్​, పన్ను ఒప్పందం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆందోళనలతో సహా పూర్తి ఎజెండాతో చర్చలు జరిపి.. ఉమ్మడి ప్రకటన చేశారు. ఇంతకీ ఈ సమ్మిట్​ అసలు సారాంశం ఏమిటి?

  • డిస్కమ్‌లకు విద్యుదాఘాతాలు

విద్యుత్‌ సంస్థలను కాపాడి ప్రగతిపథంలో నడిపించడం విద్యుత్‌ నియంత్రణ మండళ్ల(ఈఆర్‌సీలు) బాధ్యత. విద్యుత్‌ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రానికీ ఈఆర్‌సీ ఉంది. విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా నియంత్రించి గాడిలో పెట్టాల్సిన ఈఆర్‌సీల పనితీరే నిస్తేజంగా ఉండటం వల్ల అంతిమంగా డిస్కమ్‌లు(Discoms In India) ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. 

  • ఐపీఎల్ వల్లే వైఫల్యాలా?

'భారత్‌ వైఫల్యానికి కారణం ఐపీఎలే'.. 'భారత క్రికెట్‌కు ఐపీఎల్‌ మంచిది కాదు'.. 'ఈ లీగ్‌ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ'.. 'వెంటనే ఐపీఎల్‌ను నిషేధించాలి'.. ఇవీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుసగా రెండో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించే ముప్పు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వినిపిస్తున్న మాటలు. కోహ్లీసేన ప్రదర్శనతో తీవ్ర నిరాశలో ఉన్న క్రికెట్‌ ప్రేమికులు.. జట్టు వైఫల్యానికి ఐపీఎల్‌ను నిందిస్తున్నారు. కొందరు క్రికెట్‌ విశ్లేషకులు, మాజీలు కూడా ఐపీఎల్‌ వైపు వేళ్లు చూపిస్తున్నారు. నిజంగా ఈ వైఫల్యానికి ఐపీఎల్‌దే బాధ్యతా? ఈ లీగ్‌ వల్ల భారత క్రికెట్‌కు అంత నష్టమా?

  • 'గాడ్‌ ఫాదర్‌' జోరు

చిరంజీవి నటిస్తున్న 'గాడ్​ఫాదర్'(chiranjeevi lucifer remake)​ సినిమాకు సంబంధించిన మరో​ షెడ్యూల్​ను హైదరాబాద్​లో ప్రారంభించారు. మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్‌'కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది.

05:20 November 02

టాప్​న్యూస్​@ 6AM

  • నేడే కౌంట్​డౌన్​..

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది(Huzurabad By Election Counting). ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో ఉప ఎన్నిక ఫలితం పెను మార్పులు సృష్టించబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ హుజూరాబాద్ బై ఎలక్షన్ కౌంటింగ్ ఎలా జరుగుతుంది. ఎన్ని రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు? ఎన్ని టేబుళ్లు ఏర్పాటు చేశారు? మొత్తం ఫలితం రావడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం.

  • తెలంగాణ విద్యార్థికి తొలి ర్యాంక్​

నీట్‌ ఫలితాల్లో (NEET RANKS 2021) తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. జాతీయ ర్యాంకుల్లో ఒకటో ర్యాంకులో ముగ్గురు నిలవగా.. ఇందులో రాష్ట్ర విద్యార్థి మృణాల్‌ కుట్టేరి తొలిస్థానాన్ని సొంతం చేసుకున్నారు. తర్వాత రెండు స్థానాల్లో దిల్లీకి చెందిన తన్మయ్‌గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జీ నాయర్​​ నిలిచారు. ఐదో ర్యాంకుకు 12 మంది విద్యార్థులు పోటీపడగా ఇందులో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కందవల్లి శషాంక్‌ కూడా ఒకరు. దీంతో తొలి 10 ర్యాంకుల్లో తెలంగాణ విద్యార్థులు రెండింటిని దక్కించుకున్నారు.

  • కొలిక్కిరాని కొలువులు..

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటన కోసం రెండేళ్లుగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొలువుల ప్రకటనలకు కసరత్తు చేస్తున్నా.. ఓ కొలిక్కి రావడం లేదు. టీఎస్‌పీఎస్సీ వద్ద ఉద్యోగాల కోసం రిజస్టరైన దాదాపు 25 లక్షల మంది ఉద్యోగార్థులు ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశతో సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి దాటిపోతోంది.

  • కలవరపెడుతున్న గంజాయి దందా

తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్న మత్తు పదార్థం గంజాయి. ఓ వైపు అధికారులు దాడులతో వందలాది కిలోలను స్వాధీనం చేసుకుంటుంటే.. మరో వైపు స్మగ్లర్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు చాక్లెట్స్‌, బిస్కెట్‌, టీ పొడి రూపాల్లోకి మార్చుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 14 వందల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

  • మాజీ హోంమంత్రి అరెస్ట్​

మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. 12 గంటలపాటు ఆయను విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంది.

  • సర్వం సిద్ధం

అక్టోబర్​ 30న జరిగిన 29 అసెంబ్లీ, మూడు లోక్​సభ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. అందుకోసం అన్ని ఏర్పాటు చేపట్టింది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో కీలక నేతలు పోటీ పడుతున్న స్థానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే.. ఎవరికి వారు తమదే విజయమని ధీమా వ్యక్తం చేయటం గమనార్హం.

  • చైనాలో కరోనా కలకలం

చైనాలో కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో కరోనా(China Corona Update) కేసులు నమోదువుతుండటం వల్ల అక్కడి ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. బీజింగ్​ వాసులు(Beijing Coronavirus Restrictions) నగరాన్ని వీడి వేరే ప్రాంతానికి వెళ్లినట్లైతే.. తిరిగి తమ స్వస్థలానికి చేరుకునే ప్రయాణాలను వాయిదా వేయాలని అధికారులు ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప నగరాన్ని దాటి వెళ్లకూడదని చెప్పారు.

  • 'పుష్ప' రిలీజ్ కష్టమేనా?

'పుష్ప' రిలీజ్(pushpa release date)​ గురించిన ఓ విషయం అభిమానుల్లో కలవరం పెంచుతోంది. ఈ సినిమా హిందీలో నేరుగా విడుదల కాదని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంత?

  • దేశంలోనే తొలిసారిగా..

దేశంలోనే తొలిసారిగా వెదురుతో ఫ్రొఫెషనల్​ క్రికెట్​ బ్యాట్లను (Bamboo Bat) తయారు చేసింది త్రిపురలోని బ్యాంబూ, కేన్ అభివృద్ధి సంస్థ. అందుకోసం అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేసింది.

  • క్షీణించిన వాహన విక్రయాలు

గత కొన్ని నెలలుగా ఆటోమొబైల్​ రంగాన్ని చిప్​ల​ కొరత(Chip Shortage) వేధిస్తోంది. దీంతో భారీ స్థాయిలో వాహన విక్రయాలు(Chip Shortage auto sales) పడిపోయాయి. దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ(ఎంఎస్‌ఐ) వాహన విక్రయాల్లో 24% క్షీణత కనిపించింది. ఇదే తరహా పరిస్థితిని పలు ఇతర కంపెనీలు కూడా ఎదుర్కొంటున్నాయి.

Last Updated : Nov 2, 2021, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.