ETV Bharat / bharat

ఉపఎన్నికల్లో అధికార పార్టీలదే హవా- భాజపాకు మిశ్రమ ఫలితాలు

author img

By

Published : Nov 2, 2021, 5:13 PM IST

Updated : Nov 3, 2021, 9:44 AM IST

దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ, 3 లోక్​సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో(bypoll results 2021) భాజపాకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఆశించినంతగా రాణించలేకపోయింది. హిమాచల్ ప్రదేశ్​లో కాంగ్రెస్ మూడు అసెంబ్లీ, ఒక లోక్​సభ స్థానాన్ని కైవసం చేసుకుని భాజపాకు షాక్ ఇచ్చింది. అటు బంగాల్​లో టీఎంసీ క్లీన్​స్వీప్ చేసి మొత్తం నాలుగు స్థానాల్లో గెలుపొందింది(by election results 2021).

bypolls 2021
ఉపఎన్నికల్లో అధికార పార్టీలదే హవా.. భాజపాకు మిశ్రమ ఫలితాలు

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఉపఎన్నికల్లో(bypolls 2021) దాదాపు అధికార పార్టీలకు చెందిన అభ్యర్థులే గెలుపొందారు. మొత్తం మూడు లోక్​సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. భాజపా, కాంగ్రెస్​, శివసేన ఒక్కో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అసోంలో(assam by election results 2021) మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలను అధికార ఎన్డీఏ కైవసం చేసుకున్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం అశించిన ఫలితాలు రాబట్టుకోలేక పోయింది.

అసోంలో థోవ్​రా, భవానీపుర్, మరియాని, గోసెన్​ గావ్, తముల్​పుర్​లో భాజపా, దాని మిత్రపక్షం యూడీడీఎప్ అభ్యర్థులు గెలుపొందారు.

బంగాల్​లో టీఎంసీ హవా..

బంగాల్​లో అధికార టీఎంసీ హవా కొనసాగింది(west bengal by election results 2021). ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలు దిన్​హాటా, శాంతిపుర్​, గోసబ, ఖార్​దహలో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించింది. ఇందులో రెండు భాజపా నుంచి కైవసం చేసుకున్నవి కావడం గమనార్హం. ఈ ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హిమాచల్​లో భాజపాకు షాక్​..

హిమాచల్ ప్రదేశ్​లో(himachal bypoll) అధికార భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఉపఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాలు జుబ్బల్​-కోట్కాయ్​, ఫతేపుర్, అర్కీలో కాంగ్రెస్​ విజయబావుటా ఎగురవేసింది. మండీ లాక్​సభ స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థి, మాజీ సీఎం వీరభద్రసింగ్​ సతీమణి ప్రతిభా సింగ్ గెలుపొందారు. హిమాచల్ ఫలితాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా(karnataka election results 2021).. సింగ్డిలో అధికార భాజపానే గెలిచింది. హంగల్​లో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ రెండు స్థానాల్లో పోటీ చేసిన జేడీఎస్​కు డిపాజిట్ కూడా దక్కలేదు.
  • మధ్యప్రదేశ్​లో ఖండ్వా లోక్​సభ్ స్థానంలో భాజపా గెలిచింది. పృథ్వీపుర్, జోబత్ అసెంబ్లీ స్థానాల్లోనూ అధికార పార్టి గెలిచింది. రాయ్​గావ్​లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు(madhya pradesh by election result 2021).
  • రాజస్థాన్‌లో ఉపఎన్నికలు జరిగిన ధరియావాడ్‌, వల్లభ్‌నగర్‌ స్థానాలను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది(rajasthan by election result 2021).
  • మిజోరంలో తూయిరియాల్​ అసెంబ్లీ ఉపఎన్నికలో అధికార మిజోనేషనల్ ఫ్రంట్ విజయం సాధించింది.
  • హరియాణా ఎల్లెనాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఐఎన్ఎల్​డీ అభ్యర్థి అభయ్ చౌతాలా భాజపా అభ్యర్థిపై గెలుపొందారు.
  • బిహార్​లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. కుశేశ్వర్ అస్థాన్​లో అధికార జేడీయూ గెలిచింది. తారాపుర్​లోనూ జెండా ఎగురవేసింది(bihar by election result 2021).
  • మేఘాలయలో రెండుచోట్ల ఎన్నికలుజరిగితే...అధికార ఎన్​పీపీ, యూడీపీ అభ్యర్థులు గెలిచారు.
  • కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్​ హవేలీ లోక్​సభ స్థానంలో శివసేన విజయం సాధించింది.
  • మహారాష్ట్రలో ఓ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైసవం చేసుంది.
  • ఆంధ్రప్రదేశ్​ బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అధికార వైకాపా గెలిచింది.
  • తెలంగాణ హుజూరాబాద్ ఉపఎన్నికలో భాజపా గెలుపొందింది.

అక్టోబర్​ 30న దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ, 3 లోక్​సభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి.

ఇదీ చదవండి: 'ద్రవ్యోల్బణం.. మోదీ సర్కారు దీపావళి కానుక'

Last Updated : Nov 3, 2021, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.