ETV Bharat / sitara

'గాడ్‌ ఫాదర్‌' జోరు.. హైదరాబాద్​లో మరో షెడ్యూల్​ ప్రారంభం

author img

By

Published : Nov 2, 2021, 7:03 AM IST

Updated : Nov 2, 2021, 7:41 AM IST

chiranjeevi
చిరంజీవి

చిరంజీవి నటిస్తున్న 'గాడ్​ఫాదర్'(chiranjeevi lucifer remake)​ సినిమాకు సంబంధించిన మరో​ షెడ్యూల్​ను హైదరాబాద్​లో ప్రారంభించారు. మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్‌'కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది.

చిరంజీవి కథానాయకుడిగా(chiranjeevi lucifer remake) మోహన్‌ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గాడ్‌ ఫాదర్‌'. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు(lucifer remake godfather). విభిన్నమైన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోంది. గత నెలలో చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా.. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

సోమవారం(నవంబరు​ 1) నుంచి హైదరాబాద్‌లో మరో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించారు(chiru lucifer remake). ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత షెడ్యూల్‌లో భాగంగా చిరంజీవితో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్‌'కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. తమన్‌ స్వరాలందిస్తుండగా.. నీరవ్‌ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.

త్వరలోనే చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య'(acharya chiru movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో రామ్​చరణ్​, కాజల్​ అగర్వాల్​, పూజాహెగ్డే కీలక పాత్ర పోషించారు.

ఇదీ చూడండి: Pushpa release date: హిందీలో 'పుష్ప' రిలీజ్ కష్టమేనా?

Last Updated :Nov 2, 2021, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.