తెలంగాణ

telangana

Telangana Rains : గోదావరి మురిసింది.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది.. ప్రాజెక్టులు మురిశాయి..

By

Published : Jul 26, 2023, 10:31 PM IST

Updated : Jul 26, 2023, 10:50 PM IST

Telangana water projects On Rain : రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గినప్పటికీ గోదావరి పరివాహక ప్రాజెక్టులకు మాత్రం భారీగా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. కృష్ణా పరిధిలోని జూరాలకు 11వేల క్యూసెక్కుల మేర మాత్రమే ప్రవాహం వచ్చి చేరుతోంది. ఉత్తర తెలంగాణలో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు జలకళతో తొణికిసలాడుతున్నాయి.

Telangana Rains
Telangana Rains

Water level in Singur reservoir : ఎడతెరపిలేని వర్షాలతో సింగూరు జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం క్యూసెక్కుల మేర ప్రవాహం ఉండగా 385 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 523 అడుగులకు అడుగులకు నీటిమట్టం చేరింది. సింగూరులో పూర్తిస్థాయి నిల్వ 29 టీఎంసీలకు ప్రస్తుతం 21.814 అడుగలకు చేరింది. అదేవిధంగా నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 26వేల 700క్యూసెక్కుల మేర ప్రవాహం ఉండగా 1405 అడుగులకు ప్రస్తుతం 1401 అడుగుల మేర నీరి చేరింది. 17 టీఎంసీ పూర్తిస్థాయి నిల్వకు ఈ ప్రాజెక్టులో 13.428టీఎంసీలకు నీరు చేరుకుంది.

Sri Ramsagar water Flood : రాష్ట్రంలో వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీరాంసాగర్‌ నిండుకుండను తలపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం లక్షా 16వేల క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతోంది. వెయ్యి 91 అడుగులకు ప్రస్తుతం వెయ్యి 85 అడుగుల మేర నీరు చేరింది. ఎస్​ఆర్​ఎస్​పీ పూర్తిస్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 69 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదే స్థాయిలో ప్రవాహం కొనసాగితే త్వరలోనే గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆలమట్టికి ప్రస్తుతు లక్షా 38 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా నీటి నిల్వ 88టీఎంసీలకు పెరిగింది. ఆలమట్టి పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలుగా ఉంది. నారాయణపూర్‌లోకి 98 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మన రాష్ట్రంలో మొదటి ప్రాజెక్టు జూరాలలోకి ప్రస్తుతం 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. తుంగభద్రలోకి 98 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండగా నీటి నిల్వ 40 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి 8 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నాగార్జునసాగర్‌లోకి 6 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

Moosi river floods : విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి దిగువకు వర్షపు నీరు వస్తుండడంతో యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వలిగొండ మండలం సంగెం వద్ద భీమలింగం లోలేవల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద లోలేవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ నదిఉద్ధృతంగా ప్రవహించడంతో రుద్రవెల్లి- పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు స్తంభించాయి. మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లను మూడు ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 642.50 అడుగుల వరద నీరు వచ్చి చేరింది.

గోదావరి మురిసింది కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది

ఇవీ చదవండి:

Last Updated :Jul 26, 2023, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details