ETV Bharat / Heavy Rains In Telangana

Heavy Rains In Telangana

నేడూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జీహెచ్​ఎంసీ సహా పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉస్మానియా, జేఎన్టీయూ, తెలంగాణ తదితర యూనివర్సిటీలు నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయడం సహా కాలేజీలకు సెలవు ప్రకటించాయి. సచివాలయంతో పాటు జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్​లు తెరిచారు. వర్షాలు, వరదలపై సీఎం రేవంత్‌ రెడ్డి, పలువురు మంత్రులు అధికారులతో ఫోన్​లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

అధికారుల సెలవులు రద్దు : వరద ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని చెప్పిన సీఎం, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని విధుల్లో నిమగ్నం కావాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక ఏర్పాట్లు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

లేటెస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.