Huge Traffic in Hyderabad Rains : వరుణ్ బ్రో కొంచెం గ్యాప్​ తీసుకో.. ఈ ట్రాఫిక్​లో ఇళ్లు చేరేదెలా..?

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 12:47 PM IST

Updated : Sep 5, 2023, 1:26 PM IST

thumbnail

Huge Traffic in Hyderabad Rains 2023 : హైదరాబాద్​లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వానలతో కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి మూసాపేట మెట్రో స్టేషన్​ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Hyderabad Rains Traffic Jam : టోలిచౌకీ నుంచి గచ్చిబౌలి వెళ్లే దారులన్నీ వర్షపు నీటి కారణంగా నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల మేర గంటల పాటు ట్రాఫిక్​ జాం నిలిచిపోయింది. టోలిచౌకీ ఫ్లైఓవర్​ వద్ద పెద్ద మొత్తంలో వరదనీరు ఉండిపోవడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు కూకట్​పల్లి నాలా పొంగి ప్రధాన రహదారిపైకి వర్షపు నీరు వచ్చి చేరింది. కూకట్​పల్లి-మూసాపేట, ఎర్రగడ్డ-మూసాపేట రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జాం నెలకొంది. రోడ్లపై చేరుకున్న నీటిని తొలగించేందుకు డీఆర్​ఎఫ్​ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎర్రగడ్డ ప్రధాన రోడ్డుపై వరదనీరు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ ప్రాంతంలో మ్యాన్​హోల్​లో చెత్త పేరుకుపోవడంతో దిగువకు వరదనీరు వెళ్లక.. ఎర్రగడ్డ మెట్రోస్టేషన్​ సమీప రహదారిలో నీరు నిలిచిపోయింది. దీంతో పంజాగుట్ట నుంచి కూకట్​పల్లి వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Last Updated : Sep 5, 2023, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.