ETV Bharat / business

త్వరలో అమెజాన్ 'గ్రేట్ సమ్మర్ సేల్'​ - ఫోన్స్​, గ్యాడ్జెట్స్​పై భారీ డిస్కౌంట్స్ & ఆఫర్స్! - Amazon Great Summer Sale 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 12:06 PM IST

Amazon Special offers 2024
Amazon Great Summer Sale 2024

Amazon Great Summer Sale 2024 : ఆన్​లైన్ షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్. అమెజాన్​ గ్రేట్ సమ్మర్ సేల్​ వచ్చేసింది. భారీ డిస్కౌంట్స్​, ఆఫర్స్​తో మే 2 నుంచి ఈ మెగా సేల్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు మీ కోసం.

Amazon Great Summer Sale 2024 : ప్రముఖ ఈ-కామర్స్‌ ఫ్లాట్​ఫామ్​ అమెజాన్‌ మరో మెగా సేల్‌కు సిద్ధమైంది. ఏటా వేసవిలో నిర్వహించే గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ తేదీలను తాజాగా ప్రకటించింది. ఈ మే 2 మధ్యాహ్నం నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుందని స్పష్టం చేసింది. అయితే, ఈ బిగ్​ సేల్ ఎప్పుడు ముగుస్తుందనే విషయాన్ని మాత్రం అమెజాన్​ వెల్లడించలేదు. మరో ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ కూడా 'బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌' తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి మే 9 వరకు ఈ సేల్‌ జరగనుంది.

వారికి మే 1 నుంచే!
అమెజాన్​ ప్రైమ్‌ మెంబర్లకు మే 1 అర్థరాత్రి 12 తర్వాత నుంచే ఈ గ్రేట్ సమ్మర్​ సేల్‌ అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ సేల్‌లో అందించే డిస్కౌంట్స్, ఆఫర్స్​, డీల్స్‌ను ప్రైమ్‌ సబ్​స్క్రైబర్లు అందరికంటే ఒక రోజు ముందుగానే పొందవచ్చు.

బెస్ట్​ ఆఫర్స్ ఇవే!
Amazon Great Summer Sale Offers :

  • అమెజాన్​ గ్రేట్ సమ్మర్​ సేల్​లో ఐసీఐసీఐ బ్యాంక్‌, వన్‌ కార్డ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా డెబిట్‌కార్డు/ క్రెడిట్‌కార్డు యూజర్లకు 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ అందిస్తారు.
  • కొనుగోలుదారులకు ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తారు.
  • ఈ సేల్‌ సమయంలో చేసే ఫస్ట్‌ ఆర్డర్‌పై ఫ్రీ డెలివరీ ఫెసిలిటీ ఉంటుంది. అంతేకాదు వెల్‌కమ్‌ రివార్డ్‌ పేరిట 20 శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా ఇస్తారు.
  • స్మార్ట్‌వాచ్‌లు, పుస్తకాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తారు.
  • అమెజాన్‌ అలెక్సా డివైజ్‌లు, ఫైర్‌టీవీ, కిండ్లే డివైజుల మీద ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్స్​, ఆఫర్స్​ ఉంటాయని సమాచారం.
  • ఈ అమెజాన్ గ్రేట్​ సమ్మర్ సేల్‌లో యాపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, రెడ్‌మీ, నార్జో, ఐకూ, పోకో, హానర్‌, టెక్నో లాంటి టాప్​ బ్రాండ్​ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
  • అయితే వేటిపై ఎంతెంత డిస్కౌంట్‌ ఇస్తుందన్న విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా చెప్పలేదు. త్వరలోనే ఈ ఆఫర్స్ అండ్ డీల్స్​ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఫ్లిప్​కార్ట్​ 'బిగ్‌ సేవింగ్‌ డేస్‌' సేల్‌ - భారీ ఆఫర్స్​ & డీల్స్​ - ఎప్పటి నుంచి అంటే? - Flipkart Big Saving Days 2024

2024 మే నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.