ETV Bharat / state

Rain Alert In Telangana : బీ అలర్ట్​.. రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ

author img

By

Published : Aug 18, 2023, 10:16 PM IST

Rains in Telangana for two days
Heavy rains in Telangana

Telangana Weather Report : తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో నేడు పలు జిల్లాలో వానలు పడుతున్నాయి. ఇవాళ రాత్రి, రేపు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Weather Department Issued Yellow Alert in Telangana : రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో ఈరోజు పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగులగూడెంలో 3.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎగువ కురుస్తున్న వానలతో.. భద్రాద్రి జిల్లాలోని చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి.. 11,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

Weather Department Issued Yellow Alert in Telangana
Rain Alert In Telangana రాష్ట్రంలో నమోదైన వర్షపాతం వివరాలు

మరోవైపు ఇవాళ రాత్రికి ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టరేట్‌లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

Heavy Rains in Telangana For Two Days : మరోవైపు వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరాల్లో కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్ప పీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం.. సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి.. ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకు వాలి ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ రాగల రెండు నుంచి మూడు రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రాత్రి, రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం (Telangana Weather Report) ఉందని వెల్లడించింది. శనివారం అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ రెండు రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది.

మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులు, జలాశయాల్లో పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు వరినాట్లు వేసుకున్నారు. తాజా వార్తల నేపథ్యంలో వానలు పడితే మిగిలిన వరి నాట్లు పూర్తవుతాయని అన్నదాతలు ఆశతో ఎదురు చూస్తున్నారు.

పేకమేడల్లా కూలిన ఇళ్లు.. శిమ్లాలో కొండచరియల విధ్వంసం.. ఇద్దరు మృతి

Uttarakhand Floods : భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ గజగజ.. పేకమేడలా కూలిన డిఫెన్స్‌ కాలేజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.