ETV Bharat / state

డల్లాస్‌లో ఘనంగా గ్లోబల్‌ విశ్వకర్మ కాన్ఫరెన్స్‌ 2024 - Global Viswakarma Conference 2024

author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 7:32 PM IST

Updated : May 23, 2024, 7:55 PM IST

Global Viswakarma Conference 2024 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ సోదరుల సామాజిక, ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందిస్తామని గ్లోబల్‌ విశ్వకర్మ ఎన్‌ఆర్‌ఐ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఆ సంస్థ ద్వారా అవసరమున్న ఉన్న వారికి ఉపకార వేతనాలు, నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు. అమెరికాలోని డల్లాస్‌లో గ్లోబల్‌ విశ్వకర్మ కాన్ఫరెన్స్‌ జరిగింది.

Global Viswakarma Conference 2024
Global Viswakarma Conference 2024 (ETV Bharat)

Global Viswakarma Conference 2024 in USA : గ్లోబల్‌ విశ్వకర్మ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌ మొదటి గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ అమెరికాలోని డల్లాస్‌లో జరిగింది. అమెరికా, కెనడాలో ఉన్న దాదాపు 500 మంది విశ్వకర్మ సోదరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వకర్మ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బ్రహ్మం గారి 331వ ఆరాధనోత్సవం నిర్వహించారు. అనంతరం ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌, యాదాద్రి ఆలయ రూపకర్త ఆనంద్‌ సాయి, శాంతి కృష్ణ వంగాలకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా దేశ ఆర్థికాభివృద్ధికి విశ్వకర్మలు అందించిన తోడ్పాటును సదస్సు సమన్వయకర్తలు చైతన్య, గంగాధర్‌ రామడుగు వివరించారు.

Global Viswakarma Conference 2024 in USA
గ్లోబల్‌ విశ్వకర్మ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌ (ETV Bharat)

గ్లోబల్‌ విశ్వకర్మ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌ లక్ష్యాలు, ఉద్దేశాలను సంస్థ సహ వ్యవస్థాపకులు చారి సమంతపుడి, వెంకట్ మారోజు వెల్లడించారు. అనంతరం చిన్నారులు కూచిపూడి నృత్యంతో అలరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ సోదరుల సామాజిక, ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందిస్తామని గ్లోబల్‌ విశ్వకర్మ ఎన్‌ఆర్‌ఐ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఆ సంస్థ ద్వారా అవసరమున్న ఉన్న వారికి ఉపకార వేతనాలు, నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపారు. ప్రభుత్వాల నుంచి సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Global Viswakarma Conference 2024
గ్లోబల్‌ విశ్వకర్మ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌ (ETV Bharat)

Vishwakarma Scheme Launch 2023 : 'విశ్వకర్మలు లేని జీవితాన్ని ఊహించలేం.. శరీరానికి వెన్నెముక లాంటివారు'

సబ్‌మెరైన్‌తో సముద్రంలో ద్వారక నగర వీక్షణ- 300 అడుగుల లోతుకు వెళ్లి

Last Updated : May 23, 2024, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.