ETV Bharat / state

Floods in Godavari : భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. చర్ల మండలంలో పర్యటించిన కలెక్టర్ అనుదీప్

author img

By

Published : Jul 26, 2023, 5:26 PM IST

Updated : Jul 26, 2023, 8:02 PM IST

Godavari
Godavari

Heavyrains in Badradri kothagudem : భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఈరోజు రాత్రి 7 గంటలకు 46.7 అడుగుల ప్రమాదరకరస్థాయికి చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాదహెచ్చరిక జారీచేశారు. వరదల ప్రత్యేక అధికారి.. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ చర్ల మండలంలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాలైన దండిపేట వీరాపురం గ్రామాలు ఖాళీ చేయించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. చర్ల మండలంలో పర్యటించిన కలెక్టర్ అనుదీప్

Godavari river water level at Bhadrachalam : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. నిన్నటి వరకు 39 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి.. ఈరోజు ఉదయానికి 40 అడుగులకు చేరింది. రాత్రి 7 గంటలకు 46.7 అడుగులకు వద్దకు చేరి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

భద్రాచలం ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి 23 గేట్లు ఎత్తి.. రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీటిని కిందికి వదులుతున్నట్టు లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక అలా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం లేదా రాత్రి వరకు.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి.. 48 అడుగుల వరకు పెరగవచ్చు అని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు.

ఈ నెల 20న మొదటిసారి గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మధ్యలో రెండు రోజులు వరుణుడు శాంతించడంతో గోదావరి ఉద్ధృతి తగ్గింది. ఎగువనున్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో జులై 23న ఉదయం 43.3 అడుగుల ప్రమాదకరస్థాయికి చేరుకోవడంతో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.గోదావరి ప్రవాహం 43 అడుగుల వద్దకు నీటిమట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక.. 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

కలెక్టర్ పర్యటన.. జిల్లావ్యాపంగా కురుస్తున్న జోరువానలో వరదల ప్రత్యేక అధికారి.. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్.. చర్ల మండలంలో పర్యటించారు. ఉగ్రరూపం దాల్చిన తాలిపేరు ప్రాజెక్టును ఆయన సందర్శించారు. అక్కడి వరదల ఉద్ధృతిని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఈఈ రాంప్రసాద్, తహశీల్దార్ భరణి బాబుతో సమీక్షించారు. లోతట్టు గ్రామ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచన చేశారు. దండిపేట వీరాపురం గ్రామాలు ఖాళీ చేయించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

చర్ల మండలంలోని కుదునూరు గ్రామం వద్ద భద్రాచలం వెంకటాపురం చర్ల మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు చేరాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం వద్ద కురుస్తున్న భారీవర్షం వల్ల నిత్య కళ్యాణం మండపంలో జరపాల్సిన.. కళ్యాణ వేడుకను ప్రాకార మండపంలో నిర్వహిస్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షం వల్ల ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గింది.

ఇవీ చదవండి:

Last Updated :Jul 26, 2023, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.