తెలంగాణ

telangana

టాప్​ న్యూస్ @ 7AM

By

Published : Jan 31, 2022, 7:02 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ న్యూస్ @ 7AM
టాప్​ న్యూస్ @ 7AM

ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ఈ సారి బడ్జెట్​లో పెద్దగా తాయిలాలు, వినూత్న సంస్కరణల జోలికి వెళ్లకుండానే ఆర్థిక మంత్రి కసరత్తు పూర్తిచేసే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్‌ మహమ్మారితో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకొందని చెప్తున్నారు.

  • 'రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిద్దాం'

కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని తెరాస నిర్ణయించింది. పార్లమెంటు సమావేశాల్లో తెరాస సత్తా చూపాలని, దేంట్లోనూ వెనక్కి తగ్గకూడదని, రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా.. బయటా గట్టిగా పోరాడాలని, బలమైన వాణి వినిపించాలని తీర్మానించింది.

  • కొత్త రిజిస్ట్రేషన్ విలువల పెంపు అమలుకు సర్వం సిద్ధం

రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్‌ విలువల అమలుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ సర్వం సిద్ధం చేసింది. జిల్లాల్లో విలువల పెంపు కమిటీల ఆమోదం పూర్తి కావడంతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే ఎన్​ఐసీ సహకారంతో వాటిని సాప్ట్‌వేర్‌లో అప్‌డేట్‌ చేయనుంది.

  • రాష్ట్రానికి తోడ్పాటు అందేనా?

కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి అందే తోడ్పాటుపై ఆసక్తి నెలకొంది. పన్నుల వాటా, గ్రాంట్లు, ఆర్థికసంఘం సిఫార్సులకు అనుగుణంగా నిధులతో పాటు విభజనచట్టం హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తులు పంపింది.

  • పెద్దమనిషి.. వక్రబుద్ధి

సమాజంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ, కుమార్తె వయసున్న బాలిక (14) పట్ల వక్ర బుద్ధిని ప్రదర్శించాడో దుర్మార్గుడు. అతని అసభ్యకర మాటలు, లైంగిక చేష్టలను భరించలేకపోయిన బాలిక నిస్సహాయ స్థితిలో తనువు చాలించింది. తాము నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో జరిగింది.

  • సంసిద్ధం శ్రీరామనగరం

హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌ సమీపంలోని శ్రీరామ నగరంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. వచ్చే నెల 2 నుంచి 14 వరకు జరిగే.. వివిధ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రధాని, రాష్ట్రపతి వంటి ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో పరిసరాల ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నారు.

  • 'ఉక్రెయిన్‌కు బలగాలను పంపే యోచన లేదు'

అమెరికా బలగాలను ఉక్రెయిన్​కు పంపే ఆలోచన తమకు లేదని నాటో సెక్రటరీ జనరల్​ తెలిపారు. ఆ దేశ సరిహద్దుల్లో రష్యా బలగాలు ఏ క్షణమైన దాడికి పాల్పడే అవకాశమున్న నేపథ్యంలో నాటో చీఫ్​ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

  • 21 ఏళ్లు.. 21 గ్రాండ్‌స్లామ్‌లు

ఆస్ట్రేలియన్ ఓపెన్​ పురుషుల సింగిల్స్​ ఫైనల్లో యువ ఆటగాడు మెద్వెదెవ్​పై విజయం సాధించి మరో గ్రాండ్​స్లామ్​ టైటిల్​ను ఖాతాలో వేసుకున్నాడు స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్. దీంతో అత్యధికంగా 21 గ్రాండ్​స్లామ్​లు గెలిచిన వీరుడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

  • 'శుభ్​మన్​ గిల్​ను వదులుకోవడం నిరాశే'

ఫిబ్రవరిలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలానికి సిద్ధమవుతున్నట్లు తెలిపాడు కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు కోచ్ బ్రెండన్ మెక్​కలమ్. శుభ్​మన్​ గిల్​ను కోల్పోవడం నిరాశపరిచిందని తెలిపాడు.

  • అజిత్​ సినిమాలో మోహన్​లాల్

పాత్ర నచ్చాలే కానీ ఏ భాషలోనైనా ఎలాంటి చిత్రంలోనైనా నటించడానికి ముందుంటారు ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌. ప్రముఖ తమిళ కథానాయకుడు అజిత్‌ 61వ సినిమా హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇందులోని ఓ కీలక పాత్రలో మోహన్‌లాల్‌ నటించబోతున్నట్లు కోలీవుడ్‌ సమాచారం.

ABOUT THE AUTHOR

...view details