ETV Bharat / politics

రాష్ట్రంలో ఎక్కడికక్కడే వడ్లు తడిచిపోయాయి - మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి : హరీశ్​రావు - Harish Rao Talk With Farmers in TS

author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 5:26 PM IST

Harish Rao Meet Farmers in Telangana : రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసి ముద్ధయిన ధాన్యాన్ని పరిశీలించేందుకు, దీంతో పాటు వారి ఇబ్బందులను తెలుసుకునేందుకు మాజీ మంత్రి హరీశ్​రావు జిల్లాలో పర్యటించారు. జయశంకర్​ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాలో ధాన్యాన్ని పరిశీలించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Harish Rao Demands
Harish Rao Visit Crop Loss Areas in Telangana (ETV Bharat)

Harish Rao Meet Farmers in Telangana : రాష్ట్రంలో పలు జిల్లాలో మాజీ మంత్రి హరీశ్​రావు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు పర్యటించారు. అనంతరం అక్కడ పడుతున్న రైతుల ఇబ్బందులు వారితో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తుందని ప్రచారం చేస్తుందని, 20 రోజులు గడుస్తున్నా వడ్లు కొనుగోలు చేయలేదని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించి మంత్రులు, అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు.

Harish Rao Talk With Famers in Jagtial : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడుతున్నారని హరీశ్​రావు అన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఆయన తిరుగు ప్రయాణంలో కొడిమ్యాల మండలం పూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి, రేవంత్​ రెడ్డి సర్కార్​కి తేడా ఏంటో తెలుసుకున్నారా అని అన్నదాతలను అడిగారు.

దొడ్డు వడ్లకు రూ.500 బోనస్‌ లేదనటం దారుణం: హరీశ్‌రావు - Harish Rao on Paddy Bonus Issue

Harish Rao Comments on Congress GOVT : వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రస్తుతం సన్న బియ్యానికి మాత్రమే రూ.500 ఇస్తానని చెబుతోందని హరీశ్​రావు మండిపడ్డారు. కర్షకులను మోసం చేసే అంశం మీద జరగబోయే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని తెలిపారు. అనంతరం రైతులు వారి సమస్యలను చెప్పుకున్నారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్లారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతాలలోని కమలాపుర్ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలోని తడిసిన ధాన్యాని హరీశ్​రావు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నదాతలు తెలిపారు. ధాన్యం తడిచి మొలకెత్తిందని వడ్లను కొనమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన హరీశ్​ రావు జాయింట్ కలెక్టర్​కి ఫోన్ చేసి తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు.

"అకాల వర్షాలతో వడ్లు తడిసిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వడ్లు కొనుగోలు చేస్తున్నామని అసత్య ప్రచారాలు చేస్తోంది. ఎక్కడ చూసినా వడ్లు తడిసి ఉన్నాయి. 20 రోజులు గడుస్తున్నా వడ్లు కొనుగోలు చేయలేదు. వెంటనే మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను." - హరీశ్​రావు, మాజీ మంత్రి

రాష్ట్రంలో ఎక్కడికక్కడే వడ్లు తడిచిపోయాయి : హరీశ్​రావు (ETV Bharat)

కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను, ఉద్యోగులను మోసం చేసింది : హరీశ్‌ రావు - Harish Rao Comments Congress Govt

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.