కార్మికురాలిపై లైంగిక వేధింపులు - గాజులరామారం ఎస్ఎఫ్ఏ సస్పెండ్ - Gajularamaram SFA Suspended
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : May 23, 2024, 5:26 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-05-2024/640-480-21541121-thumbnail-16x9-suspend.jpg)
Gajularamaram SFA Suspended : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో ఎస్ఎఫ్ఏ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్)గా విధులు నిర్వహిస్తున్న కిషన్, తన కింద పనిచేసే ఓ కార్మికురాలిపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను శారీరకంగా అనుభవించాలని నిర్ణయించుకున్న అతడు, ఆమెపై అధికారి అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. రోజు ఆమె పనికి రాగానే ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వాడుకోవటం మొదలు పెట్టిన కామాంధుడు, అంతటితో ఆగకుండా ఆ తతంగాన్ని తన ఫోన్లో చిత్రీకరించేవాడు. పై అధికారి కావడంతో ఈ వేధింపులను మహిళ భరిస్తూ వస్తున్నారు.
చివరకు పాపం పండి కిషన్ సెల్ఫోన్లో ఉన్న వీడియోలు తోటి కార్మికుల చేతుల్లోకి చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు అతడిని విధుల నుంచి తప్పించారు. వారం రోజుల క్రితమే సదరు ఎస్ఎఫ్ఏపై ఫిర్యాదు రావడంతో గాజులరామారం డీసీ మల్లారెడ్డి అతడిని సస్పెండ్ చేసి విచారణ చేస్తున్నారని గాజుల రామారం ఏఎంహెచ్‌వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తాజాగా అతడిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించేందుకు ఉన్నత అధికారులకు సిఫార్సు చేస్తామన్నారు.