తెలంగాణ

telangana

మార్కెట్లకు భారీ నష్టాలు- 14,650 దిగువకు నిఫ్టీ

By

Published : Apr 30, 2021, 9:29 AM IST

Updated : Apr 30, 2021, 3:45 PM IST

Stock markets live updates
స్టాక్​ మార్కెట్లు

15:42 April 30

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 984 పాయింట్ల భారీ నష్టంతో 48,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ అత్యధికంగా 264 పాయింట్లు కోల్పోయి 14,631 వద్దకు చేరింది.

  • 30 షేర్ల ఇండెక్స్​లో ఓఎన్​జీసీ, సన్​ఫార్మా, డాక్టర్​ రెడ్డీస్​, బజాజ్ ఆటో, పవర్​గ్రిడ్​ మాత్రమే లాభాలను నమోదు చేశాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, కోటక్​ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్​ పెయింట్స్​ షేర్లు భారీగా నష్టపోయాయి.

ఇదీ చదవండి:అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

15:06 April 30

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 920 పాయింట్లకుపైగా కోల్పోయి.. 48,844 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 240 పాయింట్లకుపైగా తగ్గి.. 14,654 వద్ద కొనసాగుతోంది.

ఆర్థిక షేర్లలో అమ్మకాల వెల్లువ నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫార్మా షేర్లు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నాయి.

  • ఓఎన్​జీసీ, సన్​ఫార్మా, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో మినహా 30 షేర్ల ఇండెక్స్​లోని కంపెనీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్​, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

12:18 April 30

14,800 దిగువకు నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల నష్టంతో 49,367 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు తగ్గి.. 14,798 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, డాక్టర్​ రెడ్డీస్​, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ, ఏషియన్​ పెయింట్స్​, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:50 April 30

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 300 మైనస్​

స్టాక్​ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

బీఎస్​ఈ-సెన్సెక్స్ ప్రస్తుతం​ 360 పాయింట్లకు పైగా కోల్పోయి.. 49,405 ఎగువన ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 90 పాయింట్లు నష్టపోయి.. 14,800 ఎగువన కొనసాగుతోంది.

లాభనష్టాల్లో..

విప్రో, బజాజ్​ ఆటో, ఓఎన్​జీసీ, దివీస్​ ల్యాబ్స్​, డా.రెడ్డీస్​ ల్యాబ్స్​ రాణిస్తున్నాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్​, టైటాన్​ కంపెనీ, ఎస్​బీఐ డీలాపడ్డాయి. 

Last Updated :Apr 30, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details