తెలంగాణ

telangana

స్వేచ్ఛా వాణిజ్యంలో కొత్త రూల్స్.. చైనాకు మరింత కష్టం!

By

Published : Sep 19, 2020, 5:27 AM IST

భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా చైనా ఉత్పత్తుల దిగుమతులపై కస్టమ్స్​ నిబంధనలు మరింత పటిష్టం చేసింది కేంద్రం. భారత్​కు ఎగుమతుల విషయంలో చైనాకు కొత్త ఇబ్బందులు తలెత్తనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనలు.. సెప్టెంబర్​ 21నుంచి అమల్లోకి రానున్నాయి.

Govt makes it difficult to route Chinese imports via ASEAN
స్వేచ్ఛా వాణిజ్యంలో కొత్త నిబంధనలు.. చైనాకు మరింత కష్టం

చైనా ఉత్పత్తులను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వాణిజ్య కూటమితో భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వినియోగించుకుని.. తమ ఉత్పత్తులను ఆసియా దేశాలకు తరిలించే చైనా దిగుమతులపై నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మారిన కస్టమ్స్​ నిబంధనలు ఈ నెల 21 నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

"కస్టమ్స్​(పరిపాలన వాణిజ్య ఒప్పందాలు) నియమాలు-2020 ప్రకారం.. దిగుమతిదారులు ఇతర వాటాదారులకు తమను తాము పరిచయం చేసుకోవడానికి ఇచ్చిన 30రోజుల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్​ 21 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి."

- కేంద్ర ఆర్థిక శాఖ

కొత్త నిబంధనల ప్రకారం.. దిగుమతి చేసుకున్న సరకులను ఆసియా సభ్య దేశాలలో అక్కడి ప్రమాణాలకు అనుగుణంగా 35 శాతం రాయితీ అర్హతను పొందాలి. ఇందులో దిగుమతిదారు సరైన డాక్యుమెంటేషన్​ను చూపించకపోతే.. పూర్తి సుంకం చెల్లించాల్సి ఉంటుంది.

మారిన ఈ నిబంధనల ద్వారా ఆసియేతర ఎగుమతిదారులను స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను దుర్వినియోగం చేయడాన్ని అరికట్టవచ్చు.

ఇదీ చదవండి:దేశరాజధానిలో అక్టోబర్​ 5 వరకు పాఠశాలలు తెరుచుకోవు!

ABOUT THE AUTHOR

...view details