తెలంగాణ

telangana

'భారత్​కు రికార్డు స్థాయిలో ఏడీబీ రుణాలు'

By

Published : May 14, 2021, 4:44 PM IST

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినట్లు ఏషియన్ డెవలప్​మెంట్ బ్యాంకు(ఏడీబీ) ప్రకటించింది. దాదాపు 13 ప్రాజెక్టులకు( కరోనా సంబంధిత) రికార్డు స్థాయిలో దాదాపు 3.92బిలియన్ డాలర్ల రుణాలు అందించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

ADB
ఏషియన్ డెవలప్​మెంట్ బ్యాంకు

కరోనాపై పోరులో భారత ప్రభుత్వానికి సహకారాన్ని కొనసాగించినట్లు ఏషియన్ డెవలప్​మెంట్ బ్యాంకు(ఏడీబీ) ప్రకటించింది. కరోనా సంబంధిత 13 ప్రాజెక్టులకు అత్యవసర సహాయంగా రికార్డు స్థాయిలో దాదాపు 3.92 బిలియన్ డాలర్ల రుణ సహాయాన్ని అందించినట్లు పేర్కొంది. మహమ్మారి సమయంలో పేద, బలహీన వర్గాలకు తక్షణ ఉపశమనం కలిగించేలా సామాజిక రక్షణ చర్యలు చేపట్టినట్లు వివరించిన ఏడీబీ.. 1986లో రుణ కార్యకలాపాలు ప్రారంభమైన నాటి నుంచి భారత్​కు అందించిన వార్షిక రుణాల్లో ఇదే అత్యధికమని స్పష్టం చేసింది.

"భారత్​లో కరోనా సంబంధిత సవాళ్ల పరిష్కారంలో అదనపు వనరులను అందించేందుకు ఏడీబీ సిద్ధంగా ఉంది. దేశంలో కొనసాగుతున్న టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడం సహా.. ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠత, చిన్న వ్యాపారాల సంరక్షణ, విద్య , సామాజిక అంశాల్లో సహకారాన్ని కొనసాగిస్తుంది."

-టేకో కొనిషి, భారత్​లో ఏడీబీ డైరెక్టర్

2020లో ఇంధనం, రవాణా, పట్టణాభివృద్ధి, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణకు ఏడీబీ తోడ్పాటునందించింది. వీటిలో..

  • దిల్లీ-మేరఠ్​ మధ్య(82 కిమీ) రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్‌ నిర్మాణానికి 500 మిలియన్ డాలర్లు.
  • మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, మేఘాలయల్లో విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ బలోపేతం సహా.. అసోంలో 120 మెగావాట్ల జలవిద్యుత్ కర్మాగారం నిర్మాణానికి సహకారం అందించింది.

ఇవీ చదవండి:సభ్య దేశాలకు ఏడీబీ మరింత సాయం

'2021-22లో భారత వృద్ధి రేటు 11 శాతం!'

కరోనాపై పోరులో భారత్​కు ఏడీబీ ఆర్థిక సాయం

ABOUT THE AUTHOR

...view details