తెలంగాణ

telangana

'తొలి దశలోనే భాజపాకు కళ్లు, చెవులు తెరుచుకుంటాయి'

By

Published : Feb 7, 2022, 7:38 AM IST

UP polls 2022: తాము అధికారంలోకి వస్తే.. ఉత్తరప్రదేశ్​లో పోలీసు నియామక పరీక్షలకు వయోపరిమితిని సడలిస్తామని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్ ప్రకటించారు. ఆలు చిప్స్​, స్నాక్స్​ను తయారు చేసే పరిశ్రమల స్థాపనకు 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు రాయితీలను ఇస్తామని అన్నారు. తొలి దశ ఎన్నికల్లోనే భాజపాకు కళ్లు, చెవులు తెరుచుకుంటాయన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించేందుకు రైతులు, యువకులు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు.

UP polls 2022
అఖిలేశ్ యాదవ్

UP polls 2022: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచార జోరు పెంచారు సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​. యువతను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. ఉత్తరప్రదేశ్​లో పోలీసు నియామక పరీక్షలకు వయోపరిమితిని సడలిస్తామని ప్రకటించారు. అర్హత వయసుదాటిన అభ్యర్థులకు ఉపయోగపడుతుందని అన్నారు.

"కరోనా మహమ్మారి కాలంలో చాలామంది యువత ఆర్మీ ఉద్యోగాల అర్హత వయసును దాటిపోయారు. దేశసేవకు యూపీ యువతను నియమించుకోవాలని ఆర్మీకి విన్నవిస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో పోలీసు నియామక పరీక్షలకు వయోపరిమితిని సడలిస్తాం. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చిననాటి నుంచి మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి. ఆలు చిప్స్​, స్నాక్స్​ను తయారు చేసే పరిశ్రమల స్థాపనకు 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు రాయితీలను ఇస్తాం."

-అఖిలేశ్​​ యాదవ్​, ఎస్పీ అధినేత

ఆలుగడ్డలు పండించే రైతులకు ప్రభుత్వం మద్దతు లభించనందున పంట వృథా అవుతుందని అఖిలేశ్​​ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే.. ఆలుగడ్డలను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్యాన్ని తయారు చేసే ప్లాంట్లను కూడా స్థాపిస్తామని హామీ ఇచ్చారు.

తొలిదశలోనే భాజపాకు కళ్లు తెరచుకుంటాయి..

Akhilesh Yadav News: ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలి దశ ఎన్నికల్లోనే భాజపాకు కళ్లు, చెవులు తెరచుకుంటాయని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించేందుకు రైతులు, యువకులు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న కర్హల్‌ స్థానంలో నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం అఖిలేశ్​ తొలిసారి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్నికల వాతావరణాన్ని చూస్తుంటే ఇప్పటివరకు మూసి ఉన్న భాజపా ప్రభుత్వ కళ్లు, చెవులు.. మొదటి దశ ఎన్నికల్లోనే తెరుచుకుంటాయన్నారు.

అంతకుముందు ఆగ్రాలోని బాహ్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలోనూ అఖిలేశ్​ ప్రసంగించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ శక్తిమంతమైన పోటీదారుగా అవతరించిన నేపథ్యంలో పార్టీకి ఓటేయద్దొంటూ కొందరు ప్రజలను ఫోన్‌లలో బెదిరిస్తున్నారని ఆరోపించారు. యూపీ భవిష్యత్తు కోసం, రాజ్యాంగ రక్షణకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. 'భాజపా ఏదైనా చేయొచ్చు.. అది చేసే వరకు ఎవరికీ తెలియదు. నోట్ల రద్దుపై ఎవరికైనా సమాచారం ఉందా?' అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పేర్లు, రంగులు మాత్రమే మార్చగలరని, కాబట్టి మనం కూడా కొంత మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు లతా మంగేష్కర్‌ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అఖిలేశ్​ యాదవ్.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత లతా దీదీ పేరిట ఏదైనా చేస్తామని చెప్పారు. యూపీలో ఈ నెల 10న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి:అసెంబ్లీ పోరు.. యూపీలో రాజకీయ పార్టీల ప్రచార జోరు

UP polls 2022: యువతకు అఖిలేశ్​​ ఆఫర్​.. ఐటీ​లో 22 లక్షల ఉద్యోగాలకు హామీ

ABOUT THE AUTHOR

...view details