తెలంగాణ

telangana

భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్​- ఆ రాష్ట్రాలకు నిఘా విభాగం హెచ్చరిక

By

Published : Apr 27, 2022, 11:29 AM IST

Updated : Apr 27, 2022, 12:21 PM IST

మావోయిస్టు
Maoist

11:25 April 27

భారీ విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్

Central Intelligence Agency Warns States: వచ్చే రెండు వారాల్లో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, బంగాల్‌ రాష్ట్రాల్లో మావోలు భారీ చర్యలకు ఉపక్రమించవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. వీటితో పాటు మావోయిస్టు ప్రభావితం ఉన్న అన్ని రాష్ట్రాలకు కేంద్ర నిఘా విభాగం-ఐబి వర్గాల హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. మావోయిస్టుల దాడికి సంబంధించి వచ్చిన సమాచారాన్ని.. నాలుగు రాష్ట్రాల అధికారులకు పంపినట్లు నిఘా వర్గాల అధికారులు పేర్కొన్నారు.

ఈ కేసు తీవ్రత దృష్ట్యా నాలుగు రాష్ట్రాల పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. తగిన వ్యూహాన్ని రచించే పనిలో నిమగ్నమవ్వాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయి. రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు కేంద్ర పారామిలటరీ బలగాలు కూడా మావోయిస్టు కదలికలపై నిరంతర పర్యవేక్షణ పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల కాలంలో నిఘా వర్గాలు, స్థానిక పోలీసులతోపాటు.. పారామిలిటరీ బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌లు నిర్వహించడం, పలు రాష్ట్రాల్లో పెద్దఎత్తున లొంగిపోవడం, అరెస్టులు జరిగాయి. దీంతో మావోయిస్టు అగ్రనాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే దాడుల రూపంలో తమ ఆగ్రహాన్ని చూపాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:యోగి 'మార్క్'​ పాలన.. వారంతా ఆస్తులు ప్రకటించాలని ఆదేశం

Last Updated :Apr 27, 2022, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details