హోటళ్లలో ఫుడ్​ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు - పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు గుర్తింపు - Food Safety Officers Raid On Hotels

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 6:50 PM IST

thumbnail
హోటళ్లలో ఫుడ్​ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు (ETV Bharat)

Food Safety Officers Raid On Hotels : కరీంనగర్​ నగరంలో ఫుడ్​సేఫ్టీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సంబంధిత అధికారి అమృతశ్రీ నేతృత్వంలో నగరంలోని శ్వేతహోటల్లో తనిఖీలు నిర్వహించారు. హోటల్లోని ప్రతిచోట పరిశీలించిన ఆహారభద్రత అధికారులు అక్కడ ఉన్న పరిస్థితులు చూసి నివ్వెరపోయారు. ఈ సందర్భంగా హొటళ్లో కాలం చెల్లిన ఆహారనిల్వలను గుర్తించారు. తనిఖీల్లో భాగంగా స్టోర్​ రూంను పరిశీలించినపుడు వారికి కాలం చెల్లిన మసాలా దినుసులు దర్శనమిచ్చాయి. 

అధికారుల తనిఖీల్లో హోటల్​ స్టోర్​ రూంలో కాలం చెల్లిన మసాల దినుసులు, ఐస్​క్రీంలు, మిగిలి పోయిన ఆహార పదార్థాలను గుర్తించారు.  నగరంలో ఇప్పటికే తనిఖీలు చేపట్టిన కొన్ని హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశామని ఆమె వెల్లడించారు. కరీంనగర్​లో​ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని ఫుడ్​ సేఫ్టీ అధికారి అమృతశ్రీ పేర్కొన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. హోటళ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని దీనిపై సంబంధిత యజమాన్యాలకు నోటీసులు జారీచేస్తామని వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.