ETV Bharat / business

పెట్రోల్ బంకు వాళ్లు చీట్​ చేస్తున్నారా? సింపుల్​గా కనిపెట్టి - ఫిర్యాదు చేయండిలా! - Petrol Pump Scams

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 12:44 PM IST

Petrol Pump Scams : పెట్రోలు బంకుల్లో ఎలాంటి మోసాలు జరుగుతుంటాయి? వాటిని ఏ విధంగా గుర్తించాలి? ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How to Avoid Getting Cheated at the Petrol Pumps
Petrol Pump Scams (ANI)

Petrol Pump Scams : ఈ డిటిజల్ యుగంలో ఆన్​లైన్​లోనే కాదు, పెట్రోలు బంకుల్లో కూడా మోసం చేసి, వినియోగదారుల డబ్బులు కొట్టేస్తున్నారు. ఇంతకూ పెట్రోల్​ బంకుల్లో ఎలాంటి మోసాలు జరుగుతాయి? వాటిని ఏ విధంగా గుర్తించాలి? ఎలా ఫిర్యాదు చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

షార్ట్ ఫ్యూయలింగ్ :
పెట్రోల్​ బంక్ వాళ్లు చేసే మోసాల్లో షార్ట్ ఫ్యూయలింగ్ ప్రధానమైనది​. దీనిని సింపుల్​గా చెప్పాలంటే, తక్కువ ఇంధనం నింపి, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. అందుకే షార్ట్ ఫ్యూయలింగ్ వంటి మోసాన్ని నివారించేందుకు, మీ వాహనంలో ఇంధనం నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకు మీరు రూ.1,000 విలువైన పెట్రోలు అడిగినప్పుడు, అటెండెంట్​ మీటర్​ను జీరోకు సెట్​ చేసి, ఫ్యూయెల్ నింపాల్సి ఉంటుంది. కానీ అతను మీటరు రూ.200 చూపిస్తున్నా, దానిని సరిచేయకుండా అలాగే పెట్రోల్ నింపాడు అనుకుందాం. అప్పుడు మీరు రూ.1000 చెల్లించి, కేవలం రూ.800 విలువైన ఇంధనాన్ని మాత్రమే పొందగలుగుతారు. అంటే ఏకంగా రూ.200 నష్టపోతారు. అందుకే ఇంధనం నింపేటప్పుడు కచ్చితంగా మీటర్​ను చూడాలి. మీటర్​ జీరోకు సెట్ చేసిన తరువాత మాత్రమే పెట్రోల్ లేదా డీజిల్​ను నింపించుకోవాలి.

ఇంధన సాంద్రత :
పెట్రోల్​ బంకువాళ్లు ఫ్యూయెల్ డెన్సిటీ (ఇంధన సాంద్రత)లో కూడా మార్పులు చేస్తుంటారు. ఈ మోసాన్ని నివారించాలంటే, మీటర్​లో ఇంధన సాంద్రతను చెక్ చేయాలి. కొన్నిసార్లు మీటర్​ను కూడా వాళ్లు మానిప్యులేట్ చేస్తుంటారు. కనుక ఇంధనం నింపేటప్పుడు దాని ధారను కూడా పరిశీలించాలి. పెట్రోల్ ఫ్లో చాలా వేగంగా ఉంటే, దాని డెన్సిటీలో మార్పులు చేసి, మిమ్మల్ని మోసం చేస్తున్నారని గుర్తించాలి.

ఈ-చిప్​ మోసం
పెట్రోల్ బంకు వాళ్లు ఫ్యూయెల్​ డిస్పెన్సింగ్ మెషిన్​తో ఈ-చిప్​ను ఇంటిగ్రేట్ చేస్తుంటారు. ఇలా చేసి మీటర్ రీడింగ్​ను తారుమారు చేస్తారు. ఎలా అంటే? మీటర్​లో ఫ్యూయెల్ అమౌంట్​, ఫ్యూయెల్ రీడింగ్ రెండూ కరెక్ట్​గానే కనిపిస్తాయి. కానీ మీ బండిలో నింపిన ఇంధనం మాత్రం తక్కువగా ఉంటుంది. ఇది ఎలా చేస్తారంటే? ఉదాహరణకు మీరు రూ.1000 విలువైన పెట్రోల్ అడిగితే, ముందుగానే ఇ-చిప్​లో 3 శాతం తక్కువ ఇంధనం నింపేలా సెట్ చేస్తారు. అందువల్ల మీ వాహనంలో రూ.1000 ఇంధనం నింపినట్లు మీటర్​లో కనిపిస్తుంది. కానీ దానిలో 3 శాతం ఇంధనం తక్కువగా ఉంటుంది. దీని వల్ల మీరు అనవసరంగా రూ.30 వరకు నష్టపోతారు.

ఫిల్టర్ పేపర్ టెస్ట్
వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం, పెట్రోలు బంకువాళ్లు ఫిల్టర్ పేపర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. ఇంధనం కల్తీ అయ్యిందా? లేదా? అని చెక్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. పెట్రోల్ బంకువాళ్లు కస్టమర్ అడిగితే, కచ్చితంగా ఫిల్టర్ పేపర్ ఇచ్చితీరాలి.

మీరు ఏం చేయాలంటే ఫిల్టర్ పేపర్​పై కొన్ని చుక్కల పెట్రోలును వేయాలి. అది పూర్తిగా ఆవిరైన తరువాత, పేపర్​పై ఎలాంటి మరకలు లేకపోతే, అది స్వచ్ఛమైన పెట్రోల్ అని అర్థం. ఒక వేళ పెట్రోల్​ ఆవిరైపోయిన తరువాత, పేపర్​పై మరకలు కనిపిస్తే, అది కల్తీ పెట్రోల్ అని గుర్తించాలి. ఈ విధంగా మీరు పెట్రోలు కల్తీ అయ్యిందా? లేదా? తెలుసుకోవచ్చు.

పెట్రోలు బంక్​ వాళ్లు మోసం చేస్తే ఏం చేయాలి?
పెట్రోలు బంకుల్లో మోసం జరిగినట్లు మీరు గుర్తిస్తే, అక్కడే కంప్లైంట్​ బుక్ అడిగి, అందులో మీ ఫిర్యాదును రిజిస్టర్ చేయాలి. ప్రతి ఆయిల్ కంపెనీ, ప్రతి పెట్రోల్ బంక్​లోనూ ఒక కంప్లైంట్​ రిజిస్టర్ బుక్​ను అందుబాటులో ఉంచుతుంది. ఆడిట్, తనిఖీల సమయంలో వాటిని సమీక్షిస్తుంటుంది. ఒకవేళ అటెండర్ లేదా యజమాని ఫిర్యాదు చేయవద్దని మిమ్మల్ని కోరినా, మీరు మాత్రం ఇలాంటి వాటికి లొంగిపోకూడదు. బంకు వాళ్లు చేస్తున్న మోసంపై ఫిర్యాదు నమోదు చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే, ఆయిల్ కంపెనీ వెబ్​సైట్​లోనూ సదరు పెట్రోల్ బంక్​పై ఫిర్యాదు చేయవచ్చు.

అర్జెంట్​గా ట్రైన్​కు వెళ్లాలా? డోంట్ వర్రీ - 5 మినిట్స్​ ముందు కూడా టికెట్ బుక్ చేసుకోండిలా! - Train Ticket Booking

ఓటీటీ లవర్స్​కు గుడ్ న్యూస్​ - రూ.299కే జియో సినిమా ప్రీమియం​ - 4కె స్ట్రీమింగ్ + నో యాడ్స్​! - JioCinema 299 Plan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.