ETV Bharat / business

GPayకు క్రెడిట్​, డెబిట్ కార్డ్స్​ యాడ్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Use Credit Card In GPay

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 1:57 PM IST

How To Use Credit And Debit Card In GPay : యూపీఐ పేమెంట్స్ కోసం చాలా మంది 'గూగుల్​ పే' (Gpay) యాప్​ను వాడుతుంటారు. అయితే ఈ గూగుల్ పే యాప్​నకు డెబిట్, క్రెడిట్ కార్డులను కూడా లింక్ చేసుకొని, పేమెంట్స్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How to add credit and debit card in Google Pay
How to use credit and debit card in Google Pay (ANI)

How To Use Credit And Debit Card In GPay : దేశంలో కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్ బాగా పెరుగుతున్నాయి. ప్రతిదానికీ యూపీఐ పేమెంట్స్​ చేస్తున్నారు. దీంతో చిన్నచిన్న షాపులు మొదలు, పెద్ద స్థాయిలో నిర్వహించే వ్యాపారాల వరకూ, యూపీఐ పేమెంట్స్​ను అనుమతిస్తున్నాయి. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ యాప్​ల్లో 'గూగుల్‌ పే' ఒకటిగా ఉంది. కూరగాయలు కొనడం నుంచి రైలు, విమాన టికెట్ బుకింగ్​ల వరకు ఈ యాప్​నే చాలా మంది వినియోగిస్తున్నారు. అయితే గూగుల్ పేతో యూపీఐ పేమెంట్స్​ చేయడమే కాదు. దానికి క్రెడిట్, డెబిట్ కార్డ్​లను కూడా లింక్ చేసుకోవచ్చు. వాటి ద్వారా ఆన్​లైన్, ఆఫ్​లైన్ విధానాల్లోనూ పేమెంట్స్​ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

గూగుల్ పే యాప్​నకు క్రెడిట్, డెబిట్ కార్డులు లింక్ చేయడం ఎలా?
How To Add Credit And Debit Cards In GPay :

  • ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీ ఫోన్​లోకి Google Pay యాప్​ను డౌన్​లోడ్ చేసుకుని, ఇన్​స్టాల్ చేయాలి.

నోట్​ : చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రీ-ఇన్​స్టాల్డ్​ యాప్​గా గూగుల్ పే ఉంటుంది. ఐఫోన్ యూజర్లు అయితే ప్లేస్టోర్​ నుంచి Gpayను డౌన్​లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • మీ జీ-మెయిల్​ అకౌంట్​తో గూగుల్​ పే యాప్​లోకి సైన్​-ఇన్​ కావాలి.
  • మీ ఫోన్​లో లాగ్​-ఇన్​ అయిన ఈ-మెయిల్​ అకౌంట్​, గూగుల్ పేలో సైన్-ఇన్ అయిన ఈ-మెయిల్ అకౌంట్ ఒకటే అయ్యుండాలి.
  • ఆ తర్వాత మీ ప్రొఫైల్ పిక్​పై క్లిక్ చేయాలి.
  • Payment Methods ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీకు కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి.
  1. యాడ్ బ్యాంక్ అకౌంట్​,
  2. సెట్-అప్​ యూపీఐ లైట్​
  3. యాడ్ క్రెడిట్ లైన్​
  4. యాడ్​ రూపే క్రెడిట్ కార్డ్​ ఆన్ యూపీఐ
  5. అదర్ వేస్​ టు పే
  • ఈ Other ways to pay సెక్షన్​లోకి వెళ్లి, మీ క్రెడిట్, డెబిట్ కార్డ్​లను యాడ్ చేసుకోవచ్చు.
  • ఇందుకోసం Add Cardపై క్లిక్ చేయాలి.

నోట్​ : గూగుల్ పే కేవలం 'వీసా, మాస్టర్​కార్డ్' ఎనేబుల్డ్​ క్రెడిట్, డెబిట్ కార్డులను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అమెరికన్ ఎక్స్​ప్రెస్​, మాస్ట్రో క్రెడిట్, డెబిట్ కార్డులకు గూగుల్​ పే సపోర్ట్ చేయదు. కనుక వాటిని లింక్ చేసుకోలేరు.

  • Add Cardపై క్లిక్ చేయగానే, గూగుల్ పే యాప్​ కెమెరా ఓపెన్ అవుతుంది. అది మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్​ను స్కాన్ చేస్తుంది.
  • తరువాత అది మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఆటోమేటిక్​గా తీసుకుంటుంది.
  • ఒక వేళ మీకు ఈ విధానం ఇష్టం లేకపోతే, మాన్యువల్​గా కూడా మీ కార్డ్ వివరాలను నమోదు చేయవచ్చు.
  • అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్​కు ఒక ఓటీపీ వస్తుంది.
  • ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు - గూగుల్ మీ కార్డ్ వివరాలను ధ్రువీకరిస్తుంది. అంతే సింపుల్​!

నోట్​ : సాధారణంగా గూగుల్ పే హోమ్ స్క్రీన్​లో డిఫాల్ట్​గా యూపీఐ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. కానీ మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను కూడా యాడ్ చేశారనుకోండి. అప్పుడు అవి కూడా హోమ్​ స్క్రీన్​లో కనిపిస్తాయి.

  • గూగుల్ పేలో యాడ్ చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులతో మీరు షాపుల్లో NFC (నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్​) ద్వారా పేమెంట్స్ చేయవచ్చు.
  • మీరు ఆన్​లైన్, ఆఫ్​లైన్ విధానాల్లో పేమెంట్స్ చేయవచ్చు.
  • మొబైల్ రీఛార్జ్, కరెంట్ బిల్లులు కూడా కట్టవచ్చు.
  • కానీ మీ గూగుల్​ పే కాంటాక్ట్స్​కు (ఇతర వ్యక్తులకు) మాత్రం క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించి డబ్బులు పంపించలేరు.

పెట్రోల్ బంకు వాళ్లు చీట్​ చేస్తున్నారా? సింపుల్​గా కనిపెట్టి - ఫిర్యాదు చేయండిలా! - Petrol Pump Scams

అర్జెంట్​గా ట్రైన్​కు వెళ్లాలా? డోంట్ వర్రీ - 5 మినిట్స్​ ముందు కూడా టికెట్ బుక్ చేసుకోండిలా! - Train Ticket Booking

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.