ETV Bharat / business

మీ ఫోన్ పోయిందా? పేటీఎం/ గూగుల్ పే/ ఫోన్​పే వాలెట్లలోని డబ్బును కాపాడుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 11:54 AM IST

How To Secure Your Money On Paytm, Google Pay And PhonePe
how to secure digital wallet

How To Secure Digital Wallet : మీరు రెగ్యులర్​గా పేటీఎం/ గూగుల్​ పే/ ఫోన్​పే లాంటి పేమెంట్ యాప్స్​ ఉపయోగిస్తుంటారా? అయితే ఇది మీ కోసమే. డిజిటల్ వాలెట్లలో మన కష్టార్జితమైన డబ్బు ఉంటుంది. ఒక వేళ మన ఫోన్​ను ఎవరైనా దొంగిలిస్తే, మన పేమెంట్ వాలెట్లలోని డబ్బును కూడా వాళ్లు దోచుకునే ప్రమాదం ఉంది. అందుకే పేమెంట్ వాలెట్లలోని డబ్బులను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Secure Digital Wallet : చాలా మంది ఈజీ పేమెంట్స్ కోసం ఫోన్​పే, గూగుల్ పే, పేటీఎం సహా పలు రకాల యూపీఐ యాప్స్ ను వినియోగిస్తూ ఉంటారు. అయితే ఫోన్ పోయినప్పుడు అందులోని మన వ్యక్తిగత సమాచారంతోపాటు, యూపీఐ యాప్స్ డేటా కూడా దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మన ఫోన్​ పోయినప్పుడు, అందులోని పేమెంట్ యాప్స్​ను ఎలా బ్లాక్ చేయాలి? మన డబ్బును ఎలా సురక్షితం చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పేటీఎం వాలెట్​ బ్లాక్ చేయడం ఎలా?

  1. మీ ఫోన్ పోయిన వెంటనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ హెల్ప్​లైన్​ నంబర్​ 01204456456కు కాల్ చేయాలి.
  2. కాల్ కనెక్ట్ అయిన వెంటనే Lost Phone ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  3. మీరు పోగొట్టుకున్న ఫోన్​ నంబర్​ను, మీ ఆల్టర్నేటివ్ ఫోన్​ నంబర్​లను ఎంటర్ చేయాలి.
  4. మీకు సంబంధించిన అన్ని డివైజ్​ల్లోనూ పేటీఎం వాలెట్​ నుంచి లాగ్​అవుట్​ కావాలి.
  5. మరింత సహాయం కోసం పేటీఎం వెబ్​సైట్​లోకి లాగిన్ కావాలి.
  6. వెబ్​సైట్​లోని 24*7 Help ట్యాబ్​పై క్లిక్ చేయాలి.
  7. Report a Fraud ఆప్షన్​పై క్లిక్ చేయాలి. తరువాత వచ్చే ప్రాంప్ట్స్ అన్నింటినీ ఫాలో కావాలి.
  8. తాత్కాలికంగా పేటీఎం వాలెట్​ను బ్లాక్ చేయడానికి కావాల్సిన సమాచారం అంతా ఇవ్వాలి.
  9. ఈ విధంగా చేస్తే, పేటీఎం వాళ్లు మీ వాలెట్​ను బ్లాక్ చేస్తారు. అప్పుడే మీ డబ్బు సేఫ్​గా ఉంటుంది.

గూగుల్ పే వాలెట్​ను బ్లాక్ చేయడం ఎలా?

  1. ముందుగా గూగుల్ పే కస్టమర్ సర్వీస్​ నంబర్​ 18004190157కు కాల్ చేయాలి.
  2. గూగుల్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ ఇచ్చిన సూచనలు అన్నీ పాటించండి.
  3. మీ గూగుల్ పే వాలెట్​ను బ్లాక్ చేయమని చెప్పండి.
  4. ఈ విధంగా మీ వాలెట్​లోని డబ్బులను కాపాడుకోండి.
  5. ఆండ్రాయిడ్​, ఐఓఎస్ ఫోన్ యూజర్లు అందరూ, తాము పోగొట్టుకున్న ఫోన్లలోని డేటాను రిమోట్​ వైప్​ చేయవచ్చు. అంటే పోయిన ఫోన్లలోని డేటాను, చాలా సులువుగా రిమూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక దానిని కూడా మీరు ప్రయత్నించవచ్చు.

ఫోన్ పే వాలెట్​ను బ్లాక్ చేయడం ఎలా?

  1. ముందుగా ఫోన్​పే కస్టమర్ సర్వీస్ సెంటర్​ నంబర్​కు కాల్​ చేయాలి.
  2. మీరు 08068727374 లేదా 02268727374 నంబర్​కు కానీ ఫోన్​ చేయవచ్చు.
  3. మీ మొబైల్ పోయింది కనుక అందులోని ఫోన్​పే వాలెట్​ను బ్లాక్​ చేయమని చెప్పాలి.
  4. వెంటనే మీరు పోగొట్టుకున్న ఫోన్ నంబర్​కు ఒక ఓటీపీ పంపిస్తారు.
  5. మీరు వెంటనే I have not received OTP అనే ఆప్షన్​ను ఎంచుకోండి.
  6. మీ సిమ్ లేదా డివైజ్ పోయింది కనుక ఫోన్​పే వాలెట్​ను బ్లాక్​ చేయమని చెప్పండి.
  7. ఈ విధంగా మీ ఫోన్​పే వాలెట్​ను బ్లాక్ చేసి, మీ డబ్బును కాపాడుకోండి.

ఈ పేమెంట్​ యాప్స్​ను ఎందుకు బ్లాక్ చేయాలంటే
మీ ఫోన్ నేరగాళ్ల చేతికి చిక్కితే, మీ వ్యక్తిగత, బ్యాంక్ ఖాతా వివరాలను వారు తెలుసుకునే అవకాశం ఉంది. దీనితో వారు మీ వాలెట్లలోని డబ్బులను దోచుకుంటారు. అందుకే మీ ఫోన్ పోయిన వెంటనే, మీ పేమెంట్ వాలెట్లను బ్లాక్​ చేయించాలి.

రిమోట్ బ్లాకింగ్ అంటే?
కొన్ని పేమెంట్​ యాప్స్ రిమోట్ బ్లాకింగ్​ ఫెసిలిటీని కల్పిస్తున్నాయి. అందుకే మీ పేమెంట్స్​ యాప్​లకు సంబంధించిన వెబ్​సైట్​లోకి లాగిన్ అయ్యి, మీ డిజిటల్ వాలెట్​ను బ్లాక్ చేసుకోవాలి.

అదనపు భద్రతా చర్యలు
ఈ డిజిటల్ యుగంలో మన ఫైనాన్సియల్​ డేటాను భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం బయోమోట్రిక్ అథంటికేషన్​, పిన్ కోడ్స్, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్​లను సెట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆర్థిక భద్రత కలుగుతుంది.

మీ కారుపై ఎలాంటి గీతలు పడకూడదా? కచ్చితంగా ఈ 6 టిప్స్​ పాటించాల్సిందే!

క్రెడిట్​కార్డ్​ 'మినిమం పేమెంట్​' ఆప్షన్​ - లాభనష్టాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.