ETV Bharat / entertainment

'దేవర ముంగిట నువ్వెంత?, పక్కా హుకుమ్​ పాటను మర్చిపోతారు'- NTR నెక్ట్స్ లెవల్ మాస్! - Devara first single

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 8:15 AM IST

Updated : May 16, 2024, 9:08 AM IST

Devara First Single: ఎన్టీఆర్- కొరటాల శివ 'దేవర పార్ట్- 1' సినిమా నుంచి మే19న తొలి పాట విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈపాట విన్న ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Devara First Single
Devara First Single (Source: ETV Bharat)

Devara First Single: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర పార్ట్- 1నుంచి మే 19న ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఎన్టీఆర్ బర్త్​డేకు ఒక రోజు ముందు సినిమా నుంచి ఫస్ట్​ సాంగ్ రిలీజ్ చేసేందురు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్​ కూడా వదిలారు. 'ఫియర్ సాంగ్' (Fear Song) పేరుతో ఈ పాట రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ సాంగ్ విన్న ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఈ పాట 'హుకుమ్' సాంగ్​ను మించి ఉంటుందని వంశీ అన్నారు. 'ఎంతగానో ఎదురుచూస్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ అన్న ఫ్యాన్స్​కు 'దేవర ఫియర్ సాంగ్' పర్ఫెక్ట్ పాట. మీ అందరి కంటే ముందు నేను పాట విన్నాను. నన్ను నమ్మండి హుకుమ్ సాంగ్​ను మర్చిపోతారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ నెక్ట్స్ లెవల్ మాస్. దేవర ముందు నువ్వెంత' అంటూ సాంగ్ పోస్టర్​ షేర్ చేస్తూ రాసుకొచ్చారు.

అయితే ఈ సినిమాకు మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. మాస్ బీట్, ఎలివేషన్ సాంగ్స్​ ఇవ్వడంలో అనిరుధ్​ టాప్​లో ఉంటారు. ఇక గతేడాది రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలో హుకుమ్ సాంగ్ ఫుల్ ఫేమస్ అయ్యింది. ఈ పాటలు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అటు తమిళ ప్రేక్షకులతోపాటు ఇటు తెలుగు ఆడియెన్స్​ కూడా ఈపాటను ఫేవరెట్ లిస్ట్​లో చేర్చేశారు. ఈ క్రమంలో హుకుమ్​ను మించి దేవర సాంగ్ ఉండనుందని నిర్మాత వంశీ అంటున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. మరాఠా భామ శ్రుతి మరాఠే కూడా కీ రోల్​ చేయనుంది. వీరిద్దరూ ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ నటులు సైఫ్ అలీ ఖాన్ సినిమాలో కీలకమైన పాత్ర పోషించనున్నారు. సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మురశీ శర్మ తదితరులు ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్​పై రూపొందుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ సినిమా 2024 అక్టోబర్ 10న వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'దేవర'లో ఐటమ్ సాంగ్- స్టార్ హీరోయిన్​ కన్ఫార్మ్! - Devara Item Song

గోవాలో 'దేవర' బిజీబిజీ- ఎన్టీఆర్ న్యూ స్టిల్ వైరల్- ఫొటో చూశారా?. - NTR Devara New Look From Sets

Last Updated : May 16, 2024, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.