ETV Bharat / sports

ప్లేఆఫ్స్​కు అడుగు దూరంలో సన్​రైజర్స్- కమిన్స్ సేన టార్గెట్ అదే - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 7:37 AM IST

Sunrise Hyderabad IPL 2024: సొంతగడ్డపై సన్​రైజర్స్ హైదరాబాద్ గురువారం గుజరాత్​తో పోరుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్​లో ఎలాగైనా నెగ్గి ప్లేఆఫ్స్​కు దూసుకెళ్లాలని కమిన్స్​ సేన భావిస్తోంది.

Sunrise Hyderabad IPL 2024
Sunrise Hyderabad IPL 2024 (Source: Associated Press)

Sunrise Hyderabad IPL 2024: 2024 ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ అసాధారణ ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఈ సీజన్​లో ఇప్పటికే మూడుసార్లు 260+ స్కోర్లు నమోదు చేసిన సన్​రైజర్స్​ తాజాగా గుజరాత్​ టైటాన్స్​తో ఫైట్​కు రెడీ అవుతోంది. ఉప్పల్ వేదికగా గురువారం గుజరాత్​తో తలపడనుంది. ఇక ప్రస్తుత సీజన్​లో 12మ్యాచ్​ల్లో 7 విజయాలు నమోదు చేసిన సన్​రైజర్స్​ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్​తో మ్యాచ్​ నెగ్గి ​ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకోవాలని హైదరాబాద్ ఉవ్విళ్లూరూతోంది.

ఈ మ్యాచ్​లో ఓడినా సన్​రైజర్స్​కు మరో ఛాన్స్ ఉంటుంది. కానీ, మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్​లో అడుగుపెట్టాలని ఆశిస్తోంది. ఇక చివరి రెండు మ్యాచ్​ల్లో నెగ్గితే టాప్- 2లో స్థానం దక్కుతుంది. ఇన్ని అవకాశాలు, గత మ్యాచ్​ విజయంతో ఊపులో ఉన్న సన్​రైజర్స్​, గుజరాత్​పై నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా సొంతగడ్డపై ఆడనుండడం సన్​రైజర్స్​కు కలిసొచ్చే అంశం.

ఉప్పలో మరోసారి తుపాన్!: భీకర బ్యాటింగ్ లైనప్​తో ఉన్న సన్​రైజర్స్ మరోసారి భారీ స్కోర్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (533 పరుగులు), అభిషేక్‌ శర్మ (401) ఈ సీజన్​లో మెరుపు ఆరంభాలిచ్చారు. మరోసారి శుభారంభం ఇస్తే, భారీ స్కోర్ ఖాయం. వీరితోపాటు హెన్రీచ్ క్లాసెన్ (339), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (239), షాబాజ్‌ అహ్మద్‌, అబ్దుల్ సమద్‌ ఫామ్​లో ఉండడం పాజిటివ్ అంశం.

పేస్ త్రయం కీలకం: సన్​రైజర్స్​ బౌలింగ్ దళం ప్రారంభ మ్యాచ్​ల్లో పరుగులు భారీగానే సమర్పించినా, ఆ తర్వాత పుంజుకుంది. ముఖ్యంగా పేస్ త్రయం నటరాజన్‌ (15 వికెట్లు), కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్‌ (14), భువనేశ్వర్‌ (11) అద్భుతంగా రాణిస్తున్నారు. ఉప్పల్ మైదానంలో మరోసారి వీళ్లు చెలరేగితే గుజరాత్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు.

విజయంతో ముగించేనా?: గతరెండు సీజన్లలో అద్భుతంగా ఆడిన గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత ఎడిషన్​లో ఘోరంగా విఫలమైంది. ఈ సీజన్​లో 13 మ్యాచ్​ల్లో కేవలం 5 విజయాలు నమోదు చేసి ఇప్పటికే ఇంటిబాట పట్టింది. ఇక ఆఖరి మ్యాచ్​లోనైనా నెగ్గి సీజన్​ను గౌరవప్రదంగా ముగించాలని ఆశిస్తోంది. పైగా ఈ మ్యాచ్​లో జట్టుపై కూడా ఎలాంటి ఒత్తిడి ఉండదు. దీంతో గుజరాత్​ను సన్​రైజర్స్ తేలిగ్గా తీసుకోకుడదు.

రిలాక్స్​ మోడ్​లో కమిన్స్​- గ్యాప్​లో దుబాయ్ ట్రిప్- SRH ఫ్యాన్స్ టెన్షన్! - IPL 2024

'అభిషేక్ బ్యాటింగ్​ స్ట్రైల్ ఫుల్​ క్లాస్​- అచ్చం యువీలానే' - Abhishek Sharma IPL

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.