ETV Bharat / bharat

84ఏళ్ల ఏజ్​లో 'టాటా' 8th క్లాస్​ పరీక్షలు- విదేశాలకు వెళ్లినప్పుడు అలా జరిగినందుకే! - doctor Prakash Indian Tata Stor

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 2:25 PM IST

Updated : May 26, 2024, 10:38 PM IST

ఆయుర్వేద వైద్యం చేయడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. సినీ నటులు నుంచి రాజకీయ నాయకుల వరకు చాలా మంది ఆయన వద్ద వైద్యం చేయించుకున్నారు. ఇప్పుడాయన ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే ఆయన అసలు పాఠశాలకే వెళ్లలేదు. ఏం చదవకుండా డాక్టర్​ ఎలా అయ్యారు?

Ayurvedic doctor Prakash Indian Tata Story
Ayurvedic doctor Prakash Indian Tata Story (ETV Bharat)

ఆయుర్వేద వైద్యం చేయడంలో మంచి పేరు సంపాదించారు ఓ డాక్టర్. ఆయన చేసే ఆయుర్వేద వైద్యం దాదాపు 112 దేశాలకు విస్తరించింది. సినీ నటుల నుంచి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు వరకు ఆయన వద్ద వైద్యం పొందారు. వైద్యంలో అంత మంచి అనుభవం సాధించిన ఆయన, ఉన్నత చదువులు చదువుకుని ఉంటారని అనుకుంటారు కదా? కానీ ఆయన ప్రస్తుతం ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.

Ayurvedic Doctor Prakash Indian Tata Story : మధ్యప్రదేశ్​ ఛింద్​వాడాకు చెందిన ప్రకాశ్(84) ఇండియా ప్రముఖ ఆయుర్వేద వైద్యుడిగా పేరు సంపాదించారు. ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే అమర్​కంటక్​లోని ఓ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడే దాదాపు 20 సంవత్సరాలు ఉండి మూలికలతో వైద్యం ఎలా చేయాలో నేర్చుకున్నారు. అలా చిన్నగా ఆయుర్వేదానికి సంబంధించిన వైద్యం చేయటం ప్రారంభించారు. ఆ తర్వాత ఛింద్​వాడాలోని కోయలాంచల్​లో నలుగు చోట్ల తన క్లినిక్​లను ప్రారంభించి ఆయుర్వేదం వైద్యం చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత డాక్టర్ ప్రకాశ్ విదేశాలకు వెళ్లి అక్కడ కూడా చికిత్స అందించారని ప్రకాశ్​ తెలిపారు.

Ayurvedic doctor Prakash Indian Tata Story
అమితాబ్​తో డాక్టర్ ప్రకాశ్ ఇండియా టాటా (ETV Bharat)

'ఇప్పటి వరకు దాదాపు 112 దేశాల ప్రజలకు చికిత్స అందించాను. జులైలో అమెరికా వెళ్లి మరికొంతమంది వైద్యం చేయనున్నాను. ఇండియాలో అమితాబ్ బచ్చన్​, రాజకీయ నాయకులు, అనేక దేశాల వ్యాపారవేత్తలకు నేను వైద్యం చేశాను. అలాగే శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య కాలు సమస్యలతో బాధపడుతున్నప్పుడు చాలా మంది వైద్యులు చికిత్స చేసిన నయం కాలేదు. జయసూర్యకు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ నా గురించి తెలియజేయగా, వైద్యం చేయించుకున్నారు. ఆ తర్వాత కోలుకున్నారు.'

-- ప్రకాశ్ ఇండియా టాటా, ఆయుర్వేద డాక్టర్

విదేశాలకు వెళ్లినప్పుడెల్లా తనను ఎగతాళి చేస్తుండేవారని, అందుకే చదువుకోవాలని నిర్ణయించుకున్నారని ప్రకాశ్ తెలిపారు. 'చదువుకు వయసుతో సంబంధం లేదని భావించాను. అందుకే నేను మొదట మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డు నుంచి ఐదో తరగతి పరీక్షలు రాశాను. ఇప్పుడు ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నా. ఆ తర్వాత 10, ఇంటర్ కూడా పూర్తి చేస్తాను. ఇంక నా పేరు విషయానికొస్తే నేనుఅమర్​కంటక్​లోని అమృత్ ప్రసాద్ తివారీ ఆశ్రమంలో ఉన్నప్పుడు నా గురువు డాక్టర్​ ప్రకాశ్ ఇండియన్​ టాటా అని పిలిచేవారు. అప్పటి నుంచి అదే నా పేరుగా మారింది. జులైలో అమెరికాలోని ఓ యూనివర్సిటీ నాకు డాక్టర్ డిగ్రీ ఇవ్వనున్నారు' అని ప్రకాశ్ తెలిపారు.

Ayurvedic doctor Prakash Indian Tata Story
శిల్పా శెట్టితో ప్రకాశ్ ఇండియా టాటా (ETV Bharat)

ఏడాది మొత్తం కాసే మామిడి చెట్లు- తుపాను వచ్చినా రాలవట! విదేశాల్లోనూ ఫుల్ డిమాండ్- కేజీ ధర? - Special Mango Tree in Rajasthan

నగల దుకాణంపై ఈడీ దాడులు- 30 గంటలు సెర్చింగ్​- రూ.115 కోట్ల విలువైన ఆస్తులు సీజ్​ - IT raids in Nashik

Last Updated : May 26, 2024, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.