ETV Bharat / snippets

ఓయో లాడ్జిలో ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 6:26 PM IST

GOVERNMENT TEACHER SUICIDE
Etv BharatGovernment Teacher Suicide in Oyo (ETV Bharat)

Government Teacher Suicide in Oyo : హైదరాబాద్​ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏపీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం, కూకట్​పల్లి బాలాజీ నగర్​లో నివాసం ఉంటున్న జయప్రకాశ్​ నారాయణ ఆంధ్రప్రదేశ్​లోని రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.

శనివారం మధ్యాహ్నం రాయచోటికి వెళ్తున్న అని ఇంట్లో చెప్పి మియాపూర్ మదీనాగూడలోని ఓయో లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. విషం మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న మియాపూర్ పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, ఇంట్లో నుంచి వెళ్లినప్పటి నుంచి జయప్రకాశ్​ ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యలు శనివారం రాత్రి కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.