ETV Bharat / sports

మూడోసారి ఐపీఎల్ టైటిల్​ ముద్దాడిన కోల్​కతా- హైదరాబాద్​కు ఘోర​ పరాజయం - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 7:02 PM IST

Updated : May 26, 2024, 10:26 PM IST

IPL 2024 Final Live Updates : కోల్‌కతాతో జరిగిన ఐపీఎల్​ 2024 ఫైనల్ మ్యాచ్‌లో సన్​రైజర్స్​ హైదరాబాద్‌ పోరాడి ఓడింది. 8 వికెట్ల తేడాతో గెలిచిన కోల్​కతా టైటిల్​ విజేతగా నిలిచింది.

IPL 2024
IPL 2024 (Source : ETV Bharat)

IPL 2024 Final Live Updates :

  • మూడోసారి ఐపీఎల్​ విజేతగా కోల్​కతా
    ఐపీఎల్ 17 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది.
  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. 2012, 2014లోనూ కేకేఆర్‌ ఐపీఎల్ విజేతగా నిలిచింది.
  • తొలుత కోల్‌కతా బౌలర్లు చెలరేగడంతో హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్ (24) టాప్ స్కోరర్.
  • 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 10.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది.
  • సునీల్ నరైన్ (6) విఫలమైనా.. వెంకటేశ్‌ అయ్యర్ (52*; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ బాదాడు. రెహ్మనుల్లా గుర్బాజ్‌ (39; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.

దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్

  • వెంకటేశ్ అయ్యర్ (19; 5 బంతుల్లో) దూకుడుగా ఆడుతున్నాడు.
  • భువనేశ్వర్‌ వేసిన మూడో ఓవర్‌లో వరుసగా 4, 6, 6 బాదేశాడు.
  • చివరి మూడు బంతులకు వరుసగా 1, 1, 2 వచ్చాయి.
  • 3 ఓవర్లకు కేకేఆర్‌ స్కోరు 37/1. గుర్బాజ్ (9) పరుగులతో ఉన్నాడు.

తొలి వికెట్​ కోల్పోయిన కోల్​కతా

కోల్​కతా తొలి వికెట్​ కోల్పోయింది. రెండో సిక్స్​కు ప్రయత్నించిన సునిల్​ నరైన్(6; 2 బంతుల్లో) ఔట్​ అయ్యాడు.

  • కోల్‌కతాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు.
  • దీంతో 18.3 ఓవర్లలో సన్‌రైజర్స్ 113 పరుగులకే ఆలౌటైంది.
  • టాప్‌ స్కోరర్‌గా నిలిచిన పాట్ కమిన్స్‌ (24) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.

క్లాసెన్ (16) ఔట్- హైదరాబాద్ ఆశలు ఆవిరి
స్కోరు 90-8

సన్​రైజర్స్​ ఐదో వికెట్ డౌన్​

  • హైదరాబాద్‌ 62 పరుగులకే హైదరాబాద్‌ ఐదు వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది.
  • మార్‌క్రమ్ (20) ఔటయ్యాడు. రస్సెల్ వేసిన 11 ఓవర్‌లో రెండో బంతికి మిచెల్ స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

నాలుగో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

  • హైదరాబాద్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. నితీశ్ రెడ్డి (13) ఔటయ్యాడు.
  • హర్షిత్ రాణా వేసిన ఏడో ఓవర్‌లో తొలి బంతికి ఫోర్ బాదన నితీశ్.. చివరి బంతికి వికెట్ కీపర్ గుర్బాజ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.
  • 7 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోరు 47/4.
  • 21 పరుగులకే హైదరాబాద్‌ మూడు వికెట్లు
    మూడో వికెట్​ కోల్పోయి హైదరాబాద్​ తీవ్ర కష్టాల్లో పడింది. 4.2 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఓపెనర్లు ఔట్

  • హైదరాబాద్‌కు మరో షాక్ తగిలింది. ట్రావిస్ హెడ్ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
  • వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్‌లో మొదటి బంతులకు పరుగులేమీ రాలేదు.
  • నాలుగో బంతికి లెగ్ బైస్ రూపంలో 2 రన్స్
  • ఐదో బంతికి సింగిల్.
  • చివరి బంతికి ట్రావిస్ హెడ్ (0) వికెట్ కీపర్‌ రెహ్మనుల్లా గుర్బాజ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.
  • 2 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 6/2.

తొలి ఓవర్‌లోనే హైదరాబాద్‌కు భారీ షాక్

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్‌ తగిలింది.
  • మిచెల్ స్టార్క్‌ వేసిన మొదటి మూడు బంతులు డాట్.
  • నాలుగో బంతికి రెండు పరుగులు చేసిన అభిషేక్ శర్మ (2) తర్వాతి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

ప్రారంభమైన మ్యాచ్ హైదరాబాద్ బ్యాటింగ్

  • టాస్‌ గెలిచి హైదరాబాద్‌ బ్యాటింగ్‌కు దిగింది.
  • అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా వచ్చారు.
  • మిచెల్ స్టా్ర్క్ తొలి ఓవర్‌ వేస్తున్నాడు.

IPL 2024 Final Live Updates : ఐపీఎల్ 2024లో భాగంగా సన్​రైజర్స్ హైదరాబాద్, కోల్​కతా నైట్ రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. అందులో భాగంగా ఎస్​ఆర్​హెచ్ టాస్ గెలుచుకుని బ్యాటింగ్​ ఎంచుకుంది. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫైనల్‌ చేరిన ఈ రెండు జట్లు చెరో రెండు సార్లు టైటిల్‌ సాధించాయి. మూడోసారి కప్‌ను సొంతం చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. ఐపీఎల్‌లో కోల్‌కతా, సన్‌రైజర్స్‌ మధ్య ఇదే మొదటి ఫైనల్‌.

హైదరాబాద్ తుది జట్టులో వీరికి ఛాన్స్‌
ట్రావిస్‌ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్‌ మార్‌క్రమ్‌, నితీశ్‌ రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్, షాబాజ్‌ అహ్మద్‌, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయ్‌దేవ్‌ ఉనద్కత్, నటరాజన్.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇంపాక్ట్ ప్లేయర్స్‌
ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్‌, మయాంక్ మార్కండే, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్.

కోల్‌కతా ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే
రెహ్మనుల్లా గుర్బాజ్‌, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్‌ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

కోల్‌కతా ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ వీరే
అనుకుల్ రాయ్‌, మనీశ్ పాండే, నితీశ్ రాణా, కేఎస్ భరత్, రూథర్‌ఫోర్డ్.

శ్రేయస్ రికార్డు
ఐపీఎల్‌ ఫైనల్‌లో రెండు వేర్వేరు జట్లకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టించాడు. దిల్లీ క్యాపిటల్స్‌కు 2020లో శ్రేయస్‌ నాయకత్వం వహించాడు. ఆ సీజన్‌లో ఫైనల్‌కు చేరిన దిల్లీ ముంబయి చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.

చెపాక్‌ మైదానంలో మొత్తం 83 క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు 58 శాతం నెగ్గగా, మొదట బౌలింగ్‌ చేసిన టీమ్స్‌ 41 శాతం గెలిచాయి. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ అని పేరున్న చెపాక్‌లో జరిగిన గత పది మ్యాచుల్లో పేసర్లు 89 వికెట్లు పడగొట్టగా, 29 వికెట్లు స్పిన్నర్లకు దక్కాయి. గత ఆరు సీజన్లుగా పాయింట్ల పట్టికలో నెంబర్‌ 1గా ప్లేఆఫ్స్‌కు చేరిన టీమే కప్‌ గెలుస్తూ వచ్చింది. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి.

Last Updated : May 26, 2024, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.