ETV Bharat / entertainment

రేస్ 3, ట్యూబ్‌లైట్ కాదు- సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత చెత్త సినిమా ఏదో తెలుసా? - Salman Khan Movies

author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 6:38 PM IST

Salman Khan Worst Movie : పాపులర్‌ హీరోలకు కూడా అప్పుడప్పుడు ఫ్లాప్‌ సినిమాలు ఎదురవుతుంటాయి. సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌లో అలాంటి చిత్రాలు చాలానే ఉన్నాయి. కానీ ఓ మూవీ మాత్రం థియేటర్‌లో రిలీజ్‌ కూడా కాలేదు. భారీ నష్టం తీసుకొచ్చింది. ఆ సినిమా ఏదంటే?

Salman Khan
Salman Khan (Source : Getty Images)

Salman Khan Worst Movie : మూవీ ఇండస్ట్రీలో విజయాలు, అపజయాలు సర్వ సాధారణం. ఎంత పెద్ద సూపర్‌ స్టార్‌కి అయినా కెరీర్‌లో ఫ్లాప్‌ మూవీలు ఉంటాయి. అయితే ఆ సినిమాల సంఖ్య, బాక్సాఫీసు వసూళ్లు, ఎదుర్కొన్న నష్టంపై ప్రభావం ఆధారపడి ఉంటుంది. హిందీ రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న, పాపులర్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు.

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌లో సల్మాన్‌ ఖాన్‌ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, పాపులారిటీ సొంతం చేసుకున్నారు. మూడు దశాబ్దాలుగా అనేక హిట్స్‌ అందించారు. సల్మాన్‌ కెరీర్‌లో హిట్‌ మూవీలే కాదు బాక్సాఫీసు దగ్గర అతి తక్కువ వసూళ్లు రాబట్టినవి కూడా ఉన్నాయి. అలాంటి ఓ సినిమా విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2021లో రిలీజైన రాధే (రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్) సల్మాన్ ఖాన్ కెరీర్‌లో అత్యంత తక్కువ రేటింగ్‌ పొందిన సినిమాగా నిలిచింది. IMDbలో దీనికి 10కి 1.9 రేటింగ్‌ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ యాక్ట్‌ చేసిన మరికొన్ని సినిమాలు కూడా బోల్తా కొట్టినా, రాధే అంత తక్కువ రేటింగ్‌ పొందలేదు. ఉదాహరణకు రేస్ 3, IMDbలో 2 రేటింగ్ పొందింది. ట్యూబ్‌లైట్ 3.9 రేటింగ్‌తో, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ 4.1గా రేటింగ్‌తో ఫరవాలేదనిపించుకున్నాయి.

రాధే ఎందుకు థియేటర్స్‌లో రిలీజ్‌ కాలేదు?
ప్రభుదేవా దర్శకత్వం వహించిన రాధే మూవీ షూటింగ్ 2019లో నిర్మాణాన్ని ప్రారంభించారు. 2020 ఈద్ (మే 22)న రిలీజ్‌ కావాల్సింది. అయితే కోవిడ్-19 మహమ్మారితో థియేటర్స్‌ మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో సినిమా రిలీజ్‌ చాలా కాలం వాయిదా పడింది. చివరికి రాధే సినిమా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైంది.2021 మేలో OTT (Zee5)లో రిలీజ్‌ అయింది. ఓవర్సీస్‌లో అతికొద్ది థియేటర్స్‌లో కూడా సినిమాను రిలీజ్‌ చేశారు.

రాధేని రక్షించిన డిజిటల్‌ రైట్స్‌
ఓవర్సీస్‌లో తక్కువ థియేటర్స్‌లో రిలీజ్‌ కావడంతో, బాక్సాఫీస్ వద్ద లాభం పొందలేకపోయింది. విదేశాల నుంచి రూ.18 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. దీని బడ్జెట్ రూ.90 కోట్లు అనుకున్నా, బాక్సాఫీస్ వసూళ్ల ఆధారంగా రూ.72 కోట్ల నష్టాన్ని చూసింది. అయితే, అదృష్టవశాత్తు సినిమా డిజిటల్ రైట్స్‌తో పాటు టీవీ, మ్యూజిక్‌ రైట్స్‌ నుంచి లాభాలు పొందింది. Zee5లో వ్యూయింగ్‌ మినిట్స్‌ పొందినప్పటికీ, మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫ్లాప్‌ టాక్‌ సొంతం చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.