తెలంగాణ

telangana

ఐపీఎల్​లో హిట్​మ్యాన్ మరో అరుదైన రికార్డు - అప్పుడు ధోనీ, సచిన్ - ఇప్పుడు రోహిత్ - Rohit Sharma 200th IPL

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 7:40 PM IST

Updated : Mar 27, 2024, 10:43 PM IST

Rohit Sharma 200th IPL : ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబయి ఇండియన్స్‌ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ రికార్డు సృష్టించనున్నాడు. అదేంటంటే ?

Rohit Sharma 200th IPL
Rohit Sharma 200th IPL

Rohit Sharma 200th IPL :హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ మొదలైంది. ఈ మ్యాచ్‌ కోసం అటు ముంబయి టీమ్​తో పాటు రోహిత్ శర్మ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇదే వేదికగా ఇప్పుడు రోహిట్ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. ముంబయి ఇండియన్స్ తరఫున ఐపీఎల్​లో తన 200వ గేమ్‌ను ఆడి, ఈ రికార్డును తన ఖాతాలో వేసుకోనున్న మొదటి ఆటగాడిగా హిట్‌ మ్యాన్‌ రికార్డు సృష్టించనున్నాడు. అలా ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ తరఫున 200 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్‌గా నిలవనున్నాడు. అయితే అతనికంటే ముందు ఈ ఘనతను విరాట్ కోహ్లి, ఎంఎస్‌ ధోని అందుకున్నారు.

ప్రస్తుత ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఇంకా ముంబయి, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం అందుకోలేదు. ముంబయి తన మొదటి మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ఓటమిని చవి చూసింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(KKR)తో ఆడిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓటమిపాలైంది. ఈ రోజు రెండు టీమ్‌లు మ్యాచ్‌ గెలవాలనే కసితో బరిలో దిగుతున్నాయి. అయితే 200 మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ నుంచి ఫ్యాన్స్‌ స్పెషల్ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు.

స్పెషల్ జెర్సీ
రోహిత్‌కి మ్యాచ్‌కి ముందు సచిన్‌ తెందూల్కర్‌ ప్రత్యేక జెర్సీని అందించాడు. ముంబయి ఆటగాళ్ల మధ్య 200 అని నంబర్‌ ఉన్న జెర్సీని రోహిత్‌కి అందజేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబయి ఓడిపోయినా రోహిత్ పర్ఫార్మెన్స్‌ అలరించింది. హిట్‌మ్యాన్‌ 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు. 200వ మ్యాచ్‌లో కూడా రోహిత్‌ చెలరేగాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ రోజు సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ఇక రోహిత్ ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే 2011లో రోహిత్‌ని ముంబయి ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. రోహిత్‌ తన డైనమిక్‌ బ్యాటింగ్‌, అద్భుతమైన కెప్టెన్సీతో ఐపీఎల్‌లో సాధించిన విజయాలు అందరికీ తెలుసు. రోహిత్‌ నేతృత్వంలో MI అత్యధికంగా ఐదు టైటిల్స్‌ నెగ్గింది. 2013, 2015, 2017, 2019, 2020లో IPL ట్రోఫీని కైవసం చేసుకుంది. ఐపీఎల్‌ హిస్టరీలో ముంబయిని సక్సెస్‌ఫుల్‌ టీమ్‌గా నిలిపిన ఘనత హిట్‌మ్యాన్‌కే దక్కుతుంది. రోహిత్‌ ముంబయి తరఫున 199 మ్యాచ్‌లలో 129.86 స్ట్రైక్ రేట్‌తో 5,084 పరుగులు చేశాడు. ముంబయి తరఫున ఐపీఎల్‌లో ఆల్-టైమ్ హై స్కోరర్‌గా రికార్డు సాధించాడు.

రోహిత్ x హార్దిక్​ - కెప్టెన్సీ మార్పు తర్వాత తొలిసారి ఇలా!

'రోహిత్‌ నాకు అండగా ఉంటాడు'- హిట్​మ్యాన్​ రిలేషన్‌పై హార్దిక్‌ కామెంట్స్

Last Updated :Mar 27, 2024, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details