ETV Bharat / sports

రోహిత్ x హార్దిక్​ - కెప్టెన్సీ మార్పు తర్వాత తొలిసారి ఇలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 8:44 AM IST

Updated : Mar 21, 2024, 9:45 AM IST

కెప్టెన్సీ మార్పు తర్వాత ఫస్ట్ టైమ్​ ఎదురుపడ్డ హార్దిక్‌ - రోహిత్‌!
కెప్టెన్సీ మార్పు తర్వాత ఫస్ట్ టైమ్​ ఎదురుపడ్డ హార్దిక్‌ - రోహిత్‌!

IPL 2024 Mumbai Indians : ఐపీఎల్‌ 2024 సీజన్‌ ముంబయి ఇండియన్స్​ కెప్టెన్సీ మార్పు తర్వాత రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే కెప్టెన్సీ మార్పు తర్వాత తొలిసారి వీరిద్దరు ఎదురుపడ్డారు. అప్పుడు వీరు ఏం చేశారంటే?

IPL 2024 Mumbai Indians : ఐపీఎల్‌ 2024కు కోసం సర్వం సిద్ధమైంది. మరో రోజులో గ్రాండ్​గా ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఇప్పటికే అన్నీ జట్ల ఆటగాళ్లు తమ కాంపౌండ్​కు చేరుకుని ప్రాక్టీస్ చేయడం ఎప్పుడో ప్రారంభించారు. అయితే ఈ సీజన్​లో ఎక్కువగా చర్చల్లో నిలిచిన జట్టు ముంబయి అనే చెప్పాలి. అందుకు కారణం కెప్టెన్సీ మార్పు. ఐదుసార్లు జట్టుకు టైటిల్​ అందించిన రోహిత్‌ శర్మను పక్కనుపెట్టి హార్దిక్‌ పాండ్యకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఓ దశలో పాండ్య కెప్టెన్సీలో రోహిత్‌ ఆడతాడా? అన్న అనుమానాలూ కూడా వచ్చాయి. అయితే తాజాగా వీరిద్దరూ తొలిసారి మైదానంలో ఎదురుపడ్డారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే?

రోహిత్, పాండ్యా భేటీలో ఏం జరిగింది?

ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం జట్టు శిబిరంలో చేరాడు. ఆ సమయంలో ప్రాక్టిస్ కూడా చేశాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య జరిగిన భేటీకి సంబంధించిన వీడియోను ముంబయి ఇండియన్స్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఒక ప్రత్యేక విషయం గమనించవచ్చు. నిజానికి, మైదానంలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య ఒకరినొకరు చూసిన వెంటనే, పాండ్య రోహిత్ వైపు కదిలాడు. రోహిత్ శర్మ అతనితో కరచాలనం చేయడానికి చేయి చాచాడు. కానీ రోహిత్‌తో కరచాలనం చేయడానికి బదులుగా, హార్దిక్ పాండ్యను కౌగిలించుకున్నాడు. ఈ వీడియోను పోస్ట్ చేసి ముంబయి ఇండియన్స్ తమ క్యాప్షన్‌లో 45, 33 అని రాశారు. 45 రోహిత్ శర్మ జెర్సీ నంబర్ కాగా, 33 హార్దిక్ పాండ్యాది.

రోహిత్‌ గురించి పాండ్య ఏం చెప్పాడు?

ఐపీఎల్​ ప్రారంభానికి ముందు, హార్దిక్ పాండ్య మీడియా సమావేశంలో రోహిత్ శర్మ ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. పాండ్య మాట్లాడుతూ "నాకు సహాయం చేయడానికి అతను ఎల్లప్పుడూ ఉంటాడు. ఈ టీమ్ ఏది సాధించిందో అది రోహిత్ నాయకత్వంలోనే జరిగింది. ఇప్పుడు నేను దానిని ముందుకు తీసుకెళ్లాలి. రోహిత్ నా భుజాలపై చేయి వేసి ముందుకు నడిపిస్తాడు. ఇది మాత్రమే కాదు, రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్. ఇది నాకు సహాయపడుతుంది" అని హార్థిక పాండ్య అభిప్రాయపడ్డాడు. కాగా మార్చి 24న గుజరాత్ టైటాన్స్ -ముంబయి ఇండియన్స్ మొదటి మ్యాచ్ ఆడనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

IPL 2024 టైటిల్‌ వేటకు 10 టీమ్స్‌ కెప్టెన్లు రెడీ - ఎవరి సక్సెస్‌ రేటు ఎంత?

IPL 2024 ముంబయి ఇండియన్స్​ కొట్టేనా సిక్సర్‌? - హార్దిక్ సేన బలాబలాలు ఇవే!

Last Updated :Mar 21, 2024, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.