ETV Bharat / sports

IPL 2024 ముంబయి ఇండియన్స్​ కొట్టేనా సిక్సర్‌? - హార్దిక్ సేన బలాబలాలు ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 8:42 AM IST

IPL 2024 Mumbai Indians : ముంబయి ఇండియన్స్‌ అనగానే క్రికెట్ అభిమానులకు టక్కున గుర్తొచ్చే పేరు రోహిత్‌ శర్మ. దశాబ్ద కాలంగా ఆ జట్టును నడిపిస్తూ ఏకంగా ఐదు టైటిళ్లను అందించాడు. ఐపీఎల్​లో సక్సెస్​ఫుల్ కెప్టెన్లలో నెం.1 స్థానాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఈసారి నుంచి అలా ఉండదు. ఎందుకంటే హిట్​మ్యాన్ ఇకపై కేవలం ఆటగాడే. రెండేేళ్ల క్రితం ప్లేయర్​గా ముంబయిని విడిచి వెళ్లిన హార్దిక్​ ఈ సారి సారథిగా తిరిగి రాబోతున్నాడు. మరి హార్దిక్‌ అంచనాలను అందుకుంటాడా? ముంబయికి టైటిల్​ను అందిస్తాడా లేదా చూడాలి?

IPL 2024 ముంబయి ఇండియన్స్​ కొట్టేనా సిక్సర్‌? - హార్దిక్ సేన బలాబలాలు ఇవే!
IPL 2024 ముంబయి ఇండియన్స్​ కొట్టేనా సిక్సర్‌? - హార్దిక్ సేన బలాబలాలు ఇవే!

IPL 2024 Mumbai Indians : ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ గొప్ప చరిత్రే ఉంది. ఇప్పటివరకూ ఐదు టైటిళ్లను అందుకుని అత్యధిక సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. కానీ చివరగా 2020లో ట్రోఫీని దక్కించుకుంది. ఇక అప్పటి నుంచి లీగ్​ దశలోనే వైదొలుగుతోంది. గత సీజన్​ మాత్రం ప్లే ఆఫ్స్ చేరింది. అయితే ఈ సారి ఎలాగైనా టైటిల్​ను దక్కించుకోవాలని కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఈ సారి కెప్టెన్​గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు స్వీకరించాడు. ఎక్కడైతే ఆల్‌రౌండర్‌గా ఎదిగాడో ఇప్పుడు అక్కడే నాయకుడిగా రాణించనున్నాడు.

బలాల విషయానికొస్తే బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌, హైదరాబాదీ ప్లేయర్​ తిలక్‌ వర్మ, ఇషాన్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్​ బలంగా కనిపిస్తోంది. వీళ్లతో పాటు హార్దిక్‌, బ్రేవిస్‌, టిమ్‌ డేవిడ్‌, మహమ్మద్‌ నబి కూడా ఉన్నారు. అత్యుత్తమ పేస్‌ దళం కూడా ఉంది. గాయంతో గత సీజన్‌ ఆడిని బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. కొయెట్జీ, మదుశంక, నువాన్​తో పాటు ఆకాశ్‌ మధ్వాల్‌, బెరెండార్ఫ్‌ ఉన్నారు. ఆల్​రౌండర్లో హార్దిక్‌, నబి, నేహాల్‌, షెఫర్డ్‌ జట్టుకు లోటు లేదనే చెప్పాలి.

బలహీనతల విషయానికొస్తే ఐపీఎల్‌లో కొంతకాలంగా రోహిత్‌ ఫామ్​లో లేడు. 2019 నుంచి అతడి గణాంకాలను పరిశీలిస్తే 70 మ్యాచ్‌ల్లో 28.49 యావరేజ్​తో 1718 రన్సే సాధించాడు. అయితే అప్పుడు కెప్టెన్సీ భారం ఉండేది. మరి ఈ సారి లేదు కాబట్టి బ్యాటర్​గా ఎలా రాణిస్తాడో. రంజీల్లో ఆడకపోవడం వల్ల బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్​కు ఐపీఎల్​ చాలా ముఖ్యం. అతడు ఎలా ఆడతాడో. స్పిన్‌ విభాగం బలంగా కనిపించట్లేదు. వెటరన్‌ స్పిన్నర్‌ పియూష్‌ చావ్లాపైనే ఆధారపడాలి. శ్రేయస్‌ గోపాల్‌, శామ్స్‌ ములాని, కుమార్‌ కార్తీకేయపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేం. టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా బుమ్రా, రోహిత్‌ అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చని అంటున్నారు. సూర్యకుమార్‌ గాయం వల్ల ఆరంభ మ్యాచ్​కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. కొయెట్జీ, మదుశంక కూడా కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు.

దేశీయ క్రికెటర్లు : రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, అర్జున్‌ తెందుల్కర్‌, విష్ణు వినోద్‌, నేహాల్‌ వధెరా, శామ్స్‌ ములాని, అన్షుల్‌, హార్దిక్‌ పాండ్య, శివాలిక్‌ శర్మ, నమన్‌ ధీర్‌, కుమార్‌ కార్తీకేయ, బుమ్రా, ఆకాశ్‌ మధ్వాల్‌, పియూష్‌ చావ్లా, శ్రేయస్‌ గోపాల్‌.

విదేశీయులు : టిమ్‌ డేవిడ్‌, డెవాల్డ్‌ బ్రేవిస్‌, రొమారియో షెఫర్డ్‌, మహమ్మద్‌ నబి, బెరెండార్ఫ్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, నువాన్‌ తుషార, మదుశంక.

ముంబయి జట్టుకు ఆ స్టార్ క్రికెటర్ దూరం - పేస్​ దళానికి తీరనిలోటు!

'రోహిత్‌ నాకు అండగా ఉంటాడు'- హిట్​మ్యాన్​ రిలేషన్‌పై హార్దిక్‌ కామెంట్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.