Donation to Shirdi Saibaba Temple: శిరిడీ సాయి ఆలయానికి పిండి యంత్రం విరాళం.. గంటకు వెయ్యి కిలోల సామర్థ్యంతో

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 4:26 PM IST

thumbnail

Flour Machine Donation to Shirdi Saibaba Temple: బెంగుళూరుకు చెందిన సాయిబాబా భక్తులు.. శిరిడీ సాయిబాబా ఆలయానికి పిండి యంత్రాన్ని విరాళంగా అందించారు. ఈ యంత్రం ద్వారా గంటకు వెయ్యి కిలోల వరకు పిండి అందుబాటులోకి రానుంది. ఈ యంత్రం సాయి సంస్థాన్​ ప్రసాదాలయానికి ఎంతో తోడ్పాటును అందించనుంది. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఉపయోగపడనుంది.

సాయిబాబా భక్తులు శిరిడీ ఆలయాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. సాయి సంస్థాన్​లోని ప్రసాదాలయంలో.. రోజుకు దాదాపు 40 వేల మందికి భోజన ప్రసాదాలు అందిస్తారు. ఒకేసారి 5 వేల మంది భోజనం చేయగల సామర్థ్యంతో ఇక్కడ భోజనశాల ఉంది. అయితే ఇప్పుడు విరాళంగా అందించిన యంత్రం ద్వారా.. భక్తుల రద్దీ అధికంగా ఉన్నా సరే.. పని మరింత వేగంగా చేసుకునేందుకు అవకాశం లభించింది. ఇంతకముందు గంటకు 400 కిలోల పిండిని ఉత్పత్తి చేయగల సామర్థ్యమున్న యంత్రం ఉండేదని అధికారులు వివరించారు. ఈ యంత్రం గోధుమల ఎంపిక నుంచి.. పిండి నూర్పిడి వరకు అన్ని పనులను చేస్తుందని దాతలు అన్నారు. కాగా, సాయిబాబా సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి. శివ శంకర్.. పిండి యంత్రదాతను శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయనకు సాయిబాబా విగ్రహాన్ని అందించారు.   

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.