ETV Bharat / state

Jurala Project Works in Gadwal : వానాకాలంలోనే జూరాల మరమ్మతులు పూర్తి.. కానీ?

author img

By

Published : Jun 3, 2023, 10:10 AM IST

Jurala Project Crust Gates repair : జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్ల మరమ్మతులు నత్తనడకన సాగుతున్నాయి. జులై నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉన్నా సగమే చేశారు. మొత్తం పనులు పూర్తవ్వాలంటే మరో ఏడాది సమయం గడిచేలా ఉంది. ప్రాజెక్టుకు అమర్చిన గ్యాంటీ క్రేన్ తరచూ మరమ్మత్తులకు గురవుతోంది. ఇక్కడ ఒకే ఒక్క గ్యాంటీ క్రేన్‌తో పనులు చేస్తున్నారు. ఇతర సాంకేతిక లోపాలు తోడవడంతో ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు మందగమనంలో సాగుతున్నాయి

Etv Bharat
Etv Bharat

జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్ల మరమ్మతు పనుల్లో వేగవంతం లేదు

Jurala Project Pending Work in Gadwal : ఉమ్మడి పాలమూరు జిల్లాకు జలప్రదాయని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. కృష్ణానది నుంచి ఏటా వచ్చే వేల క్యూసెక్కుల నీరు ఆ ప్రాజెక్టు నుంచే దిగివకు విడుదలవుతుంది. ఎంతో ప్రాధాన్యమున్న జూరాల క్రస్టు గేట్ల మరమ్మతులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఆనకట్టకు మొత్తం 62 గేట్లుంటే.. వాటి మరమ్మతులకు మాత్రం.. ఒకే ఒక్క గ్యాంటీ క్రేన్ అందుబాటులో ఉంది. ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడే అమర్చారు. 20ఏళ్లలో అనేక సార్లు మరమ్మతులు కాగా బాగుచేసి తిరిగి పనులు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఆ కారణంగా క్యాంటీక్రేన్ సాయంతో చేపట్టాల్సిన క్రస్ట్‌గేట్ల మరమ్మతుల్లో ఆలస్యం జరుగుతోంది.

Jurala project Work Delay at Kuravpur : ఒక్కో గేటు 12 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. నీటి ప్రవాహం కారణంగా గేట్లు బలహీనం కావడం, తుప్పుపట్టడం, లాక్స్ సరిగా లేక నీళ్లు లీకేజీ కావడం ఇతర సాంకేతిక పరమైన మరమ్మత్తులకు గురవుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి స్టాప్ లాక్ వేసి రిపేర్లు చేయాల్సి ఉంటుంది. కాని వాటికి వినియోగించే పరికరకాలు తరచూ రిపేర్లు రావడం పనులకు ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ప్రస్తుతం రాక్ సాండ్ స్ప్రేయింగ్ ద్వారా తుప్పును వదిలించే పనులు చేపట్టారు. జులై నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా, ఆలస్యం కావడంతో ఈ వానాకాలం వదిలి వచ్చే వానాకాలం నాటికి పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Jurala project Work Budget in Gadwal : గేట్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటి వరకు రూ.3 కోట్ల విలువైన మరమ్మతులు మాత్రమే పూర్తయ్యాయి. పాతది మార్చి కొత్త గ్యాంటీ క్రేన్ ఏర్పాటు చేస్తే గేట్ల మర్మమతులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఈ మేరకు అదనపు గ్యాంటీ క్రేన్ కావాలని ఉన్నతాధికారులకు నివేదించినట్లుగా ప్రాజెక్టు అధికారులు చెప్పారు.

Koilsagar Spillway Works in Mahabubnagar : పాలమూరు జిల్లాలో మరో నీటిపారుదల ప్రాజెక్టు కోయల్ సాగర్ స్పిల్‌వేకి సైతం గుంతలు పడ్డాయి. వాటి మరమ్మతులు గురించి అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కోయల్ సాగర్​లోనూ పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉన్నప్పుడు గేట్ల ద్వారా లీకేజీలు కొనసాగుతున్నాయి.

"జూరాల ప్రాజెక్టులో ఒక గ్యాంటీ క్రేన్​ చాలా రోజుల నుంచి పనిచేయట్లేదు. దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గేట్ల మరమ్మతు, రంధ్రాలను, ఉపయోగించాల్సిన రబ్బర్​లను.. ఇతర మరమ్మతులను చేయాలి. ఈ డ్యాంలో లీకేజ్​లు ఉంటే ఆ పనులను ఇప్పుడే పూర్తి చేయాలి. మరికొద్ది రోజుల్లో వర్షాకాలం రానుండటంతో వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం." - జూబేర్ అహ్మద్, జూరాల డ్యాం ఈఈ

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.