US Engineers Praised Kaleshwaram Project : 'కాళేశ్వరం ప్రాజెక్ట్ విజయగాథ.. ప్రపంచానికి పాఠం'

author img

By

Published : May 24, 2023, 10:13 AM IST

Updated : May 25, 2023, 1:50 PM IST

Kaleshwaram

American Society of Civil Engineers praised Kaleshwaram Project : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విజయగాథ నుంచి ప్రపంచం నేర్చుకోవచ్చని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ పేర్కొంది. నెవాడాలో జరిగిన వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్, వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్‌లో... కీలకోపన్యాసం అనంతరం సొసైటీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ప్రతినిధుల నుంచి.. వారి అనుభవాలు తెలుసుకున్నారు.

American Society of Civil Engineers praised Kaleshwaram Project : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్​కు అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిర్మించిన విషయం తెలిసిందే. అత్యంత తక్కువ సమయంలో ఎంతో నాణ్యతతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విజయగాథ నుంచి ప్రపంచం నేర్చుకోవచ్చని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సొసైటీ ప్రశంసలు కురిపించింది. అమెరికాలోని నెవాడాలో జరిగిన వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్‌లో కీలకోపన్యాసం అనంతరం సొసైటీ ప్రతినిధులతో చిట్‌చాట్ చేసిన మంత్రి కేటీఆర్... కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన వారి ఆలోచనలు, అనుభవాలు తెలుసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏఎస్ సీఈ ప్రతినిధులు గొప్పగా మాట్లాడారు.

US Engineers praised Kaleshwaram Project : ప్రాజెక్టు విజయగాథ నుంచి ప్రపంచం నేర్చుకోవచ్చని సొసైటీ ఛైర్మన్ మరియా సీ లెమాన్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అద్భుతమైనదని సొసైటీ ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్-ఎలెక్ట్ షిర్లీ క్లార్క్ తెలిపారు. తెలంగాణ వాసుల జీవన నాణ్యతను కాళేశ్వరం పెంచిందని షిర్లీ క్లార్క్‌ అభిప్రాయపడ్డారు. నీటిని 500 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయడం.... ఒక హైడ్రాలిక్ ఇంజనీర్‌గా తన మనసును ఆకట్టుకొందని వ్యాఖ్యానించారు. అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం... ప్రపంచ సవాలు అన్న సొసైటీ డైరెక్టర్ బ్రియాన్ పార్సన్స్... తెలంగాణ ఈ విషయంలో ఇతరులకు గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.

US Engineers Hail Kaleshwaram Project : కాళేశ్వరం లాంటి వినూత్నమైన, అద్భుత ప్రాజెక్టులను ప్రపంచానికి పరిచయం చేయడం తమ ఉద్దేశం అన్న సొసైటీ అధ్యక్షురాలు లెమన్... ప్రాజెక్టు అనుభవాలను వీడియోలు, ఇతర రూపాల్లో ప్రపంచానికి చాటుతామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుభవాలు, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం వంటి అంశాలపై విద్యార్థులకు వివరాలు అందిస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రశంసలు కురిపించిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రతినిధులకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

కాళేశ్వరంకు అంతర్జాతీయ గుర్తింపు : కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్, కాళేశ్వరం ప్రాజెక్టును ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్‌గా గుర్తించి అవార్డును ప్రదానం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ స్వీకరించిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి :

Last Updated :May 25, 2023, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.