ETV Bharat / state

RevanthReddy on BRS : బీఆర్ఎస్​ నేతలకు రేవంత్​రెడ్డి సవాల్.. దమ్ముంటే స్వీకరించాలంటూ..

author img

By

Published : Jul 15, 2023, 5:40 PM IST

Revanth Reddy
Revanth Reddy

RevanthReddy Fires on BRS : రాష్ట్రంలో సాగుకు 24 గంటల విద్యుత్ ఇచ్చే గ్రామాల్లో తాము ఓట్లు అడగమని రేవంత్​రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే ఎక్కడ 24 గంటల కరెంట్ ఇవ్వలేదని తేలిందో అక్కడ బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దని వ్యాఖ్యానించారు. ఈ రెఫరెండానికి తాము సిద్ధమని.. గ్రామ సభల్లో రైతులను అడుగుదామని వివరించారు. దమ్ముంటే తన సవాల్‌ను భారత్ రాష్ట్ర సమితి నేతలు స్వీకరించాలని రేవంత్​రెడ్డి ఛాలెంజ్ చేశారు.

RevanthReddy Comments on KCR : తెలంగాణకు విద్యుత్‌ చాలా ముఖ్యమని కాంగ్రెస్‌కు తెలుసని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తెలిపారు. టీడీపీ ప్రభుత్వం 25,000 మంది మీద విద్యుత్‌ కేసులు పెట్టిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ వేలాది మంది అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చారని చెప్పారు. ఇందులో భాగంగానే బషీర్‌బాగ్‌ వద్ద రైతులపై జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని చెప్పారు. హైదరాబాద్ గాంధీభవన్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆనాడు టీడీపీకి సంబంధించిన హెచ్‌ఆర్‌డీ ఛైర్మన్‌గా కేసీఆర్‌ ఉన్నారని రేవంత్​రెడ్డి గుర్తు చేశారు. పోచారం శ్రీనివాస్​రెడ్డి మంత్రిగా.. గుత్తా సుఖేందర్​రెడ్డి కీలక నేతగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్‌, పోచారం, గుత్తా వీళ్లంతా కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాన్ని సమర్థించారని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో కేసీఆర్‌, పోచారం భాగస్వాములేనని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు.

RevanthReddy Fires on BRS : టీఆర్ఎస్​కు మొట్టమొదటగా నిధుల సాయం చేసింది.. టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన కోటి రూపాయలతోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఫ్లెక్సీలు, పార్టీ సభ్యత్వ పుస్తకాలు ముద్రించారని చెప్పారు. చంద్రబాబుతో అంటకాగి బషీర్‌బాగ్‌ కాల్పల ఘటనకు కారణమయ్యారని విమర్శించారు. బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన తర్వాత కూడా 9 నెలల పాటు కేసీఆర్‌ తెలుగుదేశంలోనే ఉన్నారని రేవంత్​రెడ్డి వెల్లడించారు.

RevanthReddy on BRS : హరీశ్‌రావుకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్​రెడ్డి అని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. వార్డు మెంబర్‌గా గెలవని హరీశ్​ను మంత్రిని చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ జీవితమంతా కాంగ్రెస్‌, తెలుగుదేశం పైనే ఆధారపడ్డారని వివరించారు. బొగ్గుగనులు ఉన్నచోటనే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను నెలకొల్పుతామని ముఖ్యమంత్రి అన్నారని రేవంత్​రెడ్డి వెల్లడించారు.

సచివాలయంలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లలేని దుస్థితి ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయించిన వాళ్లే ఇవాళ కేసీఆర్‌ చుట్టూ ఉన్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వాళ్లను.. ముఖ్యమంత్రి దగ్గరకు రానీయటం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే స్పీకర్‌, మండలి ఛైర్మన్‌ రాజకీయాల గురించి మాట్లడటం నైతికత కాదని రేవంత్​రెడ్డి హితవు పలికారు.

"సాగుకు 24 గంటల విద్యుత్ ఇచ్చే గ్రామాల్లో మేం ఓట్లు అడగం. ఎక్కడ 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని తేలిందో అక్కడ బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దు. రెఫరెండానికి మేం సిద్ధం. గ్రామ సభల్లో రైతులను అడుగుదాం. దమ్ముంటే నా సవాల్‌ను బీఆర్ఎస్ నేతలు స్వీకరించాలి. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని కేసీఆర్‌ ప్రకటించాలి. సిట్టింగులందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానని కేసీఆర్‌ చెప్పాలి. నా సవాలుకు కేటీఆర్ సిద్ధమా?." - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

దమ్ముంటే నా సవాల్‌ను బీఆర్ఎస్ నేతలు స్వీకరించాలి

ఇవీ చదవండి : Revanth Reddy Free Electricity Comments : 'ఉచిత విద్యుత్​పై మాట్లాడిన మాటలను.. బీఆర్​ఎస్​ ఎడిట్​ చేసింది'

Revanthreddy on Dharani Portal : 'జులై 15 తర్వాత ధరణి అక్రమాలు బయటపెడతా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.